Session 44

Listen to find out how to receive a compliment in English.
పొగడ్తలు అందుకున్నప్పుడు, వాటికి జవాబివ్వడం ఎలాగో విని తెలుసుకోండి.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 44 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I receive a compliment?

సాధారణంగా మీకెలాంటి పొగడ్తలు అందుతుంటాయి?

పొగిడినప్పుడు మీకెలా అనిపిస్తుంది?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

సౌమ్య 
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Phil కూడా ఉన్నారు.

Phil
Welcome, everyone! 

సౌమ్య 
మనల్ని ఎవరైనా పొగిడితే బావుంటుంది కదా! అలా పొగిడినప్పుడు కాస్త సిగ్గుగా మొహమాటంగా ఉంటుంది. అవునా?! ఒక్కోసారి ఎలా జవాబివ్వాలో తెలియక తికమకపడుతుంటాం. ఆ తికమకకు ఇవాల్టితో చెక్ పెట్టేద్దాం. Phil…Is that something that you have to do a lot? 

Phil
Not very often, but it's nice when it happens! 

సౌమ్య 
True! It feels great. సరే, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు పొగడ్తలు అందుకుంటున్నారు. వాటికి వాళ్లు ఎలా జావాబిచ్చారో చూద్దాం. ఇంతకీ వీళ్లని దేనికి పొగుడుతున్నారూ?! 

Inserts
That's a nice shirt!  
Thank you, you're so kind!

Your painting is really nice – you're a great artist!
Thanks, I'm really proud of it! 

This party is great! Thanks for organising it!
Thanks, but I couldn't have done it without you!

సౌమ్య 
ఒహో! ఒకరి చొక్కా బావుందిట, ఒకరి పెయింటింగ్ బావుందిట, మరొకరు ఇచ్చిన పార్టీ బ్రహ్మాండంగా ఉందిట. షర్ట్ బావుందనగానే ఆమెలా జవాబిచ్చారో చూద్దాం.  

Insert
That's a nice shirt!
Thank you, you're so kind! 

Phil
So the most important thing to do when you receive a compliment is just to say 'thank you', here we also had 'that's so kind'. ‘So’ means the same as 'very' here. You could also say 'Thank you, that's so nice' or 'Thank you so much'. 

సౌమ్య 
బావుంది. మనకి ఎలాంటి compliment వచ్చినా ఇలా సింపుల్ గా రెస్పాండ్ అవ్వొచ్చన్నమాట! తరువాత వ్యక్తి ఎలా జవాబిచ్చారో చూద్దాం. అతని పెయింటింగ్ బావుందని కదూ అన్నారు.  

Your painting is really nice – you're a great artist!
Thanks, I'm really proud of it!
 

సౌమ్య 
మళ్లీ thanks చెప్తూనే మొదలెట్టారు. అంతే కాకుండా తను వేసిన పెయింటింగ్స్ తనకి గర్వకారణమని కూడా అన్నారు. Nice. What else could people say, Phil?

Phil
Well, you could also give more details about it – for example: 

Thanks, it's new!

Thanks, I made it yesterday. 

సౌమ్య 
Oh ok. సరే చివరి వ్యక్తి ఏమన్నారో మరోసారి విందాం.

Insert
This party is great! Thanks for organising it!
Thanks, but I couldn't have done it without you. 

Phil
Here, he has shared the compliment with someone else. If you want to say that someone has helped you when you receive a compliment, you can say 'I couldn't have done it without' – and they just say who. 

Listen carefully to how we pronounce the five words 'could', 'not', 'have', 'done' and 'it'. 'not' and 'have' get contracted to 'n't' and ''ve' – 'n't've'. 'Done' and 'it' join together – 'dunnit'. Listen and repeat: 

‘Couldn't’ 

‘Couldn't have’ 

‘Couldn't have done it’ 

‘I couldn't have done it without my friends.’ 

సౌమ్య 
Good. ఇప్పుడు మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలడుగుతాను. మీరెంత బాగా జవాబు చెప్తారో చూద్దాం! మీ డ్రెస్ చాలా బావుంది అని ఎవరైనా అన్నారనుకోండి. ఎలా రెస్పాండ్ అవుతారు? 

Phil
Thanks, that's so kind. 

సౌమ్య 
Nice. మీరు తీసిన ఒక ఫొటో అద్భుతంగా వచ్చింది. అది చూసి మీ మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి. మీరేం జవాబు చెప్తారు. ఆ ఫొటో అంటే మీకు కూడా ఇష్టం అని చెప్పండి. 

Phil
Thanks, I really like it! 

సౌమ్య 
Great, సరే ఇప్పుడు మీరు రాసిన ఒక నవల చాలా బాగుంది అని పొగడ్తలు వచ్చాయనుకోండి. ఆ నవల రాయడంలో మీ కుటుంబ తోడ్పాటు చాలా ఉంది చెప్తూ జవాబివ్వండి, చూద్దాం. 

Phil
Thanks, I couldn't have done it without my family. 

సౌమ్య 
Excellent! ఇంక తికమకపడకుండా ఎవరైనా పొగడగానే చక్కగా జవాబిచ్చేస్తూ ఉండండి.OK,Time up Phil,I think you've presented this programme really well! 

Phil
Thanks. I couldn't have done it without you! 

సౌమ్య 
Thanks, you're so kind! See you all again. Bye.

Learn more

1. Thanking someone

It's good to thank people when they give you a compliment. We also often comment on the person giving the compliment.

  • Thanks, you're so kind!
  • Thanks, that's really nice!

2. Add details

We often add some details about the thing that we are being complimented on.

  • Your painting is really nice – you're a great artist!
  • Thanks, I'm really proud of it!
  • That shirt's nice.
  • Thanks, it's new!

3. Sharing compliments

We often want to share compliments with other people. One way of doing this is to use the expression 'I couldn't have done it without…'

  • Thanks, I couldn't have done it without you!
  • Thanks, I couldn't have done it without my friends!
  • Thanks, I couldn't have it without your help!

How do I receive a compliment?

3 Questions

Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

What's the best compliment you've ever received? Come and tell us on our Facebook group!
ఇప్పటివరకు మీరందుకున్న అత్యుత్తమ పొగడ్త ఏంటి? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో చెప్పండి.   

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • shirt
    చొక్కా

    kind
    దయ/కరుణ

    painting
    చిత్రం

    proud
    గొప్ప/గర్వం

    organise
    ఏర్పాటు చెయ్యడం