Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 6

Listen to find out how to talk about your location in English.
ఉన్న స్థలం గురించి ఇంగ్లిష్‌లో చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.

 

Session 6 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

How do I talk about my location?

Sam వాళ్ల కలీగ్ Ben కు మధ్య సంభాషణ వినండి.

1. మొదటిసారి మాట్లాడినప్పుడు Ben ఎక్కడున్నారు?

2. రెండవసారి మాట్లాడినప్పుడు Ben ఎక్కడున్నారు?

3. చివరిసారి మాట్లాడినప్పుడు Ben ఎక్కడున్నారు?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Show transcript Hide transcript

సౌమ్య 
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.

Sam
Hello, everybody. Welcome! 

సౌమ్య
Sam వాళ్ల కలీగ్ బెన్‌కు ఫోన్ చేస్తోంది. ఆఫీసులో చాలా ముఖ్యమైన మీటింగ్‌కి బెన్ లేట్ అయిపోతున్నారు. అందుకని Sam కి ఆందోళనగా ఉంది. బెన్ ఎక్కడున్నారో కనుక్కోవడానికి అతనికి ఫోన్ చేసింది. వాళ్ల సంభాషణ విందాం.

Sam
Where are you, Ben? 

Ben
I’m at the bus stop! 

సౌమ్య
అయ్యో బెన్ ఇంకా బస్ స్టాప్ లోనే ఉన్నారట.

Sam
Oh dear. While we wait, let’s talk about what ‘at’ means here. Ben said ‘I’m at the bus stop’. 

సౌమ్య
Yes! ‘At’ అనేది ఎప్పుడు వాడతామంటే మనం ఆ స్థలం లేదా ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ పాయింట్ దగ్గరకి చేరుకున్నాక ‘at’ వాడాలి. ఇక్కడ బెన్ బస్ స్టాప్ కు చేరుకున్నారు కాబట్టి ‘at the bus stop’ అన్నారు. మన గది తలుపు ఎవరైనా కొడుతున్నారనుకోండి. అప్పుడు ఏమనాలంటే...

Sam
Someone’s at the door! Ben, is that you? Let me call him again! 

Sam
Ben, where are you? 

Ben
I’m on the bus. 

సౌమ్య
Ok, బెన్ బస్ ఎక్కారట. So, కొన్ని రవాణా వాహనాలకు మనం ‘on’ వాడతాం. 

Sam
Yes, we use ‘on’ for bicycles, buses, trains, planes, ships… But, careful, because we use ‘in’ for cars and taxis.

సౌమ్య
ముఖ్యంగా అని ఎక్కడ వాడతామంటే భౌతికంగా ఉపరితలంతో టచ్‌లో ఉన్నప్పుడు. లేదా ఆ ఉపరితలం మనకి ఆసరాగా ఉన్నప్పుడు. For example, Sam, your cup of coffee is… 

Sam

It’s on the table.

And my feet are on the floor.

And we are on the 6th floor…and Ben is not… Let me call him again. 

Sam
Ben, you’re so late. Where are you? 

Ben
I’m in the office. But where is everyone? Where are you? 

Sam
Oh, Ben! Which building did you go to? 

సౌమ్య
Oh no! బెన్ ఏదో తప్పుదారిలో వెళ్లినట్టున్నారు. ఇంకేదో బిల్డింగ్‌కు వెళ్లిపోయారు. అతను ‘in the office’ అన్నారు. మనం ‘in’ అని ఎప్పుడు వాడతామంటే ‘లోపల’ అని అర్థం వచ్చేలా చెప్పినప్పుడు. మన చుట్టూ గోడలు ఉన్నప్పుడు.  

Sam
Exactly! We are ‘in the studio’, ‘in a building’, Ben is ‘in the wrong office’, and my coffee is ‘in my cup’. ‘At’, ‘on’ and ‘in’ can be confusing words because we use them to talk about time, as well… 

సౌమ్య
Yes! కానీ ఇవాళ వ్యక్తులు ఎక్కడ ఉన్నారు లేదా వస్తువులు ఎక్కడ ఉన్నాయో చెప్పే ప్రక్రియలో వాటిని ఎలా వాడాలో నేర్చుకుంటున్నాం. For this reason, we use them with the verb ‘be’ after the subject. 

Sam
Now, the pronunciation isn’t difficult, but it’s still useful to practise. We usually put more importance on the words after ‘at’, ‘on’ and ‘in’. Like this – repeat after me: 

‘I’m at the bus stop’. 

‘I’m on the bus’. 

‘I’m in the office’. 

సౌమ్య
Thanks, Sam. ఇప్పుడు కొంచం ప్రాక్టీస్ చేద్దాం. మీరు లిఫ్ట్‌లో ఉన్నారనుకుందాం. దీన్ని ఇంగ్లిష్‌లో ఎలా చెప్తారు? తరువాత Sam కూడా చెప్తారు? విని మీ జవాబు సరిచూసుకోండి.

Sam
I’m in the lift.

సౌమ్య
Did you say the same?
మీరు ట్రైన్‌లో ఉన్నారు? ఏ preposition వాడాలో గుర్తుందా? Sam జవాబు విని సరిచూసుకోండి. 

Sam
I’m on the train. 

సౌమ్య
Did you say the same? Well done! మీ ఫ్రెండ్ మిమ్మల్ని కలవడానికి మీ అఫీసుకొచ్చారు. రిసెప్షన్ దగ్గరున్నారు. రెసెప్షనిస్ట్ మీకు ఫోన్ చేసి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? 

Sam
Your friend’s at reception. 

సౌమ్య
‘Reception’ కు ముందు ‘the’ అని వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. 

Sam
Write to us on our Facebook group and tell us: where are you? That reminds me – where’s Ben? 

సౌమ్య
Join us next week for more How do I…. Bye, everyone. 

Sam
Bye, bye!

Learn more!

1. సమయం, ప్రదేశం రెండిటికీ గురించి చెబుతున్న సందర్భాలలో ‘at’, ‘in’ and ‘on’ వాడొచ్చా?
అవును. కానీ ఇవాళ పాఠంలో మనం స్థానం/ప్రదేశం మీదే దృష్టి పెడుతున్నాం. After all three ‘at’, ‘on’ and ‘in’ you need to indicate the place, using a noun.

2. వీటి మధ్య వ్యత్యాసాలేంటి?

ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు 'at' అని వాడతాం.

 • I’m at the bus stop.
 • Did you hear the doorbell? Someone’s at the door.
 • We’ve just arrived at the station.

కొన్ని రవాణా వాహనాలకు, ముఖ్యంగా మనం నిల్చుని ప్రయాణం చేయగలిగే వాహనాలకు 'on' వాడతాం.

 • on the bus
 • on the train
 • on the plane
 • on the ship/ ferry

Careful! కూర్చుని మాత్రమే ప్రయాణం చేయగలిగేవాటికి 'in' వాడతాం.

 • in a car
 • in a taxi

భౌతికంగా ఉపరితలంతో టచ్‌లో ఉన్నప్పుడు అంటే 'మీద' అని చెప్పడానికి కూడాకూడా 'on' వాడతాం.

 • The cup of coffee in on the desk.
 • My office is on the 2nd floor.
 • She’s sitting on the bed.

లోపల అని చెప్పడానికి, ముఖ్యంగా నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు 'in' అని వాడతాం.

 • She’s in her bedroom.
 • I’m in the lift.
 • They’re in the pool.

How do I talk about my location?

4 Questions

Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Come to our Facebook group ,to tell us where you are right now!
ఇప్పుడు మీరెక్కడున్నారో మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • the bus stop
  బస్ స్టాప్

  the lift
  లిఫ్ట్

  reception
  రిసెప్షన్

  the entrance
  ప్రవేశ ద్వారం