Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 7

Listen to Georgina and Sam talk about unusual animal behaviour, and introduce some multi-word verbs.
Multi-word verbs - బహుళ పద క్రియలును పరిచయం చేస్తూ కొన్ని జంతువుల విచిత్ర ప్రవర్తన గురించి Georgina, Sam మాట్లాడుతున్నారు. శ్రద్ధగా వింటూ నేర్చుకోండి.

Sessions in this unit

Session 7 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

Animal Behaviour

ఆడియో వినండి. మంచి పదాలు నేర్చుకోండి.

તમારા જવાબો તપાસવા સાંભળો. પછી નીચે આપેલા ટ્રાન્સક્રિપ્ટ સાથે તુલના કરો.

Show transcript Hide transcript

సౌమ్య
హలో! New English Together కార్యక్రమానికి స్వాగతం. ఈమధ్య BBC radio లో వచ్చిన ఒక ప్రోగ్రాంలో ఒక గమ్మత్తైన విషయాన్ని ప్రస్తావించారు. ‘Fred’అనే కుక్క, కొన్ని బాతు పిల్లల్ని వెంటపెట్టుకుని ఇంటికొచ్చిందిట. ఆ బాతుపిల్లలు వాళ్ల అమ్మ నుంచి తప్పిపోయాయట, అప్పటినుంచీ ‘Fred’ వాటిని దత్తత తీసుకుందిట. ఓ కుక్క, అనాథ బాతుపిల్లలని దత్తత తీసుకోవడం భలే విచిత్రమైన విషయం కదా!  కానీ ‘Fred’ ని పెంచుకుంటున్న యజమానికి ఇది ఏమంత ఆశ్చర్యం కలిగించలేదుట! ఎందుకంటే ఆ యజమాని ఇలాగే అనేక రకాల ఆపదలనుంచి వివిధ జంతువులను కాపాడి ఇంటికి తెచ్చి పెంచుకుంటున్నారట. ‘Fred’ వాటన్నిటితో పాటూ కలిసి పెరిగింది. యజమాని లక్షణాలు ‘Fred’ కు కూడా వచ్చుండొచ్చు. ఈ విషయం చెప్తూ…Fred ‘had grown up’ around other rescued animals అన్నారు. ఇక్కడ ‘had grown up’ అనే క్రియను గమనించండి! ‘To grow up’ అంటే పెరగడం. ఇందులో grow, up అనే రెండు పదాలున్నాయి. ఇలాంటివాటిని Multi-word verbs - బహుళ పద క్రియలు అంటారు. ఇలాంటి Multi-word verbs ను ఉపయోగిస్తూ కొన్ని జంతువుల విచిత్ర ప్రవర్తన గురించి Georgina and Sam మాట్లాడుతున్నారు. శ్రద్ధగా వింటూ నేర్చుకుందాం.  

Georgina
Do you know any other unusual animal behaviour? 

Sam
Well, what about Emperor penguins, you know, the big ones. Do you know it’s the dad that looks after the egg until it hatches, not the mum? 

Georgina
Oh you mean the dad is responsible for the egg? But what is the mum getting up to while the dad is sitting on the egg? 

Sam
She’s doing fun things like relaxing and eating lots of fish, but she comes back to help take care of the little penguins when they are growing up. 

Georgina
Ok so she does return to help him to make sure they have enough food when they are little.  

సౌమ్య
విన్నారా? ఈ సంభాషణలో ఎన్ని బహుళ క్రియా పదాలొచ్చాయో…‘to look after’, ‘to get up to’, ‘to come back’, ‘to take care of’ and ‘to grow up’.  ఇన్ని పదాలొచ్చాయి! ఇలాంటి పదాలను విడగొట్టలేము. వీటిని ఇలాగే వాడాలి. Multi-word verbs లో ఒక క్రియ తో పాటూ prepositions - విభక్తులుగానీ, adverbs - క్రియా విశేషణాలు గానీ ఉంటాయి. చాలామటుకు బహుళ పద క్రియల్లో ఏదైనా నానుడి లేదా జాతీయానికి సంబంధించిన అర్థం ఇమిడి ఉంటుంది. ఒక్కోసారి చూడగానే అవి అర్థం కాకపోవచ్చు. కాస్త పరిశీలించవలసి ఉంటుంది. సరే, ఇంకేం చెప్తున్నారో చూద్దాం. 

Sam
Do you think penguin chicks are well behaved?

Georgina
I don’t know. Did you hear about that badly behaved or naughty male monkey in Gibraltar who stole a tourist’s hat though?

Sam
No! Did the monkey put the hat on his head? 

Georgina
I don’t think he put on the hat. He didn’t want to wear it he just took it and ran off and when the owner tried to get it back, the monkey refused!

సౌమ్య
‘Put the hat on’ and ‘Get it back’? ...ఇలాంటి multi-word verbs ను విడగొట్టొచ్చు.  Verb, preposition లేదా adverb ల మధ్య ఒక నామవాచకాన్ని పెట్టొచ్చు. లేదా ‘it’ లాంటి సర్వనామాలనూ పెట్టొచ్చు. Nouns వాడుతున్నప్పుడు వాటిని పదబంధం చివర్లో కూడా వాడొచ్చు. Hat అనేది noun కదా. దీన్ని మధ్యలో పెట్టి ‘he put the hat on’ అనొచ్చు లేదా చివర్లో పెట్టి ‘he put on the hat’ అనొచ్చు. కానీ సర్వనామాల విషయంలో ఇలా చివర్లో పెట్టి వాడలేము. ‘Get it back’ అనే అనాలి. ‘It’ అనేది మధ్యలోనే రావాలి. ‘Get back it’ అనకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. 

Sam
How naughty! That reminds me of baby meerkats - they can also be badly behaved! 

Georgina
Meerkats? They’re the small mammals that live in a big group and stand on their back legs to see what is happening, aren’t they? 

Sam
Yes, they’re really interesting. Do you know it’s the female meerkat that’s the leader? She’s the boss of the whole group and they all look up to her. 

Georgina
Do you mean that everyone respects her? 

Sam
Yes, mind you she’s also very controlling and she tries to prevent other females from having babies! 

Georgina
She sounds very scary. I bet she thinks she is the best and looks down on everyone! 

Sam
Yes, I think she probably doesn’t respect the rest of the group and she might be a bit difficult to live with! 

Georgina
At least she probably doesn’t smell bad. Apparently male gorillas can smell quite bad, but scientists have realised that they can turn off the smell depending on who they’re with! 

Sam
That’s amazing! I never knew that it was possible for anything to turn their smell off and on

సౌమ్య ‘Turn off’  లాంటి పదాలకు వ్యతిరేక పదాలను రాయడం చాలా సులువు. ‘Off’ తీసేసి ‘on’ అని పెట్టేస్తే చాలు. ‘Turn off’ , ‘turn on’ రెండూ వ్యతిరేక పదాలు. కానీ ‘to look up to’ లాంటి వాటికి వ్యతిరేక పదాలు రాయడం కొంచం కష్టం. దీనికి వ్యతిరేక పదం ‘to look down on’ అవుతుంది. ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. బహుళపదక్రియలు నేర్చుకున్నామంటే ఇంగ్లిష్ రాయడం, మాట్లాడడం చాలా సులువైపోతుంది. అంతే కాకుండా మన భాష అందంగా కూడా ఉంటుంది. మరో English Together లో మళ్లీ కలుసుకుందాం. Bye! 

Learn more! 

Multi-word verbs

Multi-word verbs can be made up of a verb plus one or two prepositions or adverbs and they often have an idiomatic meaning which is difficult to understand. 

Some multi-word verbs cannot be split like ‘to look after’, ‘to get up to’, ‘to come back’, ‘to take care of’ and ‘to grow up’.

  • I look after my neighbour’s cat.
  • What did you get up to at the weekend?
  • My brother comes back home most holidays.
  • I grew up in the north of the country.

With some multi-word verbs you can split the verb and preposition or adverb with a noun like ‘my jumper’ or a pronoun like ‘it’.

  • I put my jumper on because it was cold.
  • I put it on because it was cold.

You can also put the noun at the end like ‘he put on the hat’ but you can’t put the pronoun at the end!

  • I put on my jumper.

Making the opposite of some multi-word verbs like ‘turn off’ can be quite easy. All we have to do is change ‘off’ to ‘on’.

  • I turned on the lights.
  • I turned off the lights.

With other multi-word verbs like ‘to look up to’ it is more complicated and the opposite is ‘to look down on’ so you need to be careful!

  • I look up to my dad.
  • I think it is rude to look down on people.

Animal Behaviour

4 Questions

Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Come to our Facebook group and tell us what you think about this story.
ఈ కథనం మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని మా ఫేస్బుక్ గ్రూప్ లో మాతో పంచుకోండి.

Join us for our next episode of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • to look after
    చూసుకోవడం

    to come back
    తిరిగి రావడం

    to take care of
    జాగ్రత్త తీసుకోవడం

    to grow up
    ఎదగడం

    to get back
    తిరిగి రావడం

    to turn off
    ఆపేయడం