Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 32

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 32 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

The last straw

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

సౌమ్య
హలో, బాగున్నారాEnglish Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ మనం “the final straw”అనే expressionగురించి తెలుసుకుందాం. దీనిర్థం ఏమయ్యుంటుందంటారు?మ్మ్..తెలియట్లేదా! సరే, వినండి.

Neil, Helen ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. Helen వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఏమయ్యింది? ఎందుకయ్యింది? 

Helen
Neil, can I ask you about something? 

Neil
Yeah, sure. What's on your mind?

Helen
Well, Theodora and Alma are my best friends, but they are not talking to each other because of a straw. 

Neil
They are not getting on because of a straw? Are you sure you heard it right?
 

సౌమ్య
Helen ఫ్రెండ్స్‌కు ఏమయ్యింది? రైట్...వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదుట. కానీ, ఎందుకు? ఒక స్ట్రా వలన అని Helen అంటోంది. అది నిజమేనంటారా? 

Helen
Yes, Alma said to me when Theodora didn't come to her party, it was the last straw. I don't understand. What could a straw do? 

Neil

Oh, Alma was just using an expression. What she really meant was, things were not going well between them because of things that had happened in the past. 

Helen
Well, Theodora did miss quite a few of our gatherings. 

Neil
When Theodora didn't come to Alma's party, that was the final thing that made Alma really angry, giving up on their friendship. 

Helen
Oh, I see, so the last straw means the last thing or event that caused the total meltdown. 

Neil
That's right, we often hear the phrase 'the last straw', when people are talking about repeated problems or issues that aren't getting better, then the smallest thing happens, people finally lose their composure and explode. 

Helen
I see. 

సౌమ్య
అవును. Theodora, Alma ఇచ్చిన పార్టీకి వెళ్ళకపోవడం Alma కు, “the last straw”. Last అంటే చివరిది, straw అంటే మీకు తెలుసు...స్ట్రా నే. ఈ expression ను ఎప్పుడు ఉపయోగిస్తామంటే...మనకేమైనా సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయనుకోండి...అవి ఎప్పటికీ తీరకుండా అంతూపొంతూ లేకుండా ఉన్నాయనుకోండి. మనకెక్కడో ఒకచోట ఓపిక నశిస్తుంది. ఓపిక నశించే ఆ చివరి పాయింట్ ని the last straw అంటారు. నిజానికి ఈ expression, the straw that broke the camel’s back” ...ఒంటె నడుం విరిచిన స్ట్రా అనే expression నుంచి వచ్చింది. ఒంటె ఎంత బరువునైనా మోస్తుందిట. కానీ దాని లిమిట్ దాటి అది ఒక చిన్న స్ట్రా బరువు కూడా మొయ్యలేదుట. ఆ లిమిట్ కొచ్చాక ఒక స్ట్రా పెట్టినా ఒంటె నడుము విరిగిపోతుందిట. “The last straw” అనేది ఎప్పుడైనా ఎవరైనా ఓపిక, టైం, శక్తి పూర్తిగా నశించిపోయి ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగినా తమ ప్రశాంతతను, ఏకాగ్రతను పూర్తిగా కోల్పోతారు. ఆ సంఘటన The last straw అవుతుంది. దాని తరువాత ఏదో ఒక గణనీయమైన మార్పు వస్తుందన్నమాట. ఈ expression వాడుతున్నప్పుడు ఎప్పుడూ "the" వాడాలి...గుర్తుపెట్టుకోండి.

సరే, కొన్ని ఉదాహరణలు విందాం. 

Examples
 

A: I've never seen you so angry.

B: I have had such a bad day. I woke up late and rushed out of the house, then missed my bus by seconds, got in to work and was told there would be no pay rise this year. When the dinner lady said I put too much salad on my plate, it was the last straw.

 

The paper factory has struggled to stay open in the last few years; the new tax charge was the last straw, forcing it to shut down after 30 years in business.

Neil
Just so you know. Some people also say 'the final straw', and it means the same as 'the last straw'. 

Helen
Thanks for the clarification. I do hope my friends can resolve their differences. Friendship is worth saving. 

Neil
Absolutely.

సౌమ్య
The last straw తరువాత ఏ రిలేషన్‌షిప్‌నైనా నిలుపుకోవడం కష్టమే! కానీ, Helen ఫ్రెండ్స్ ఈ సమస్యను పరిష్కరించుకుంటారని ఆశిద్దాం. మీ సంగతేంటి? మీతో ఎవరైనా ఎప్పుడైనా the last straw వచ్చేవరకు తగువు పెట్టుకున్నారా? మీరెలా రియాక్ట్ అయ్యారు? Join us next time for more ‘English Expressions’. Bye. 

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

The last straw

3 Questions

Choose the correct answer.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • straw
  స్ట్రా

  party
  పార్టీ

  angry
  కోపం

  friendship
  స్నేహం

  meltdown
  నీరసించిపోవడం