Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 5
Listen to find out how to use 'there is' and 'there are' in English.
'There is', 'there are'..ఈ రెండిటినీ ఎలా ఎప్పుడు వాడాలో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 5 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I talk about what food is in my kitchen?
మన వంటింట్లో ఉన్న పదార్థాల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలి?
Sessions Vocabulary లో ఈ కింది పదాలకు అర్థాలు చూడండి. వీటిల్లో ఏవి లెక్కించగలిగేవి, ఏవి లెక్కించగలిగేవి కావో చెప్పండి.
a pepper
an onion
cheese
milk
eggs
tomatoes
carrots
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Hello! Hope you're well, everyone!
సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్లో 'there is', ' there are' ఈ రెండిటినీ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. Lewis వాళ్ల ఫ్రిడ్జిలో ఏమేమున్నాయో చెప్తున్నాడు. విందాం. అతను చెప్పిన వస్తువులతో ఇవాళ భోజనానికి ఏ పదార్థాలు తయారుచెయ్యొచ్చో చూద్దాం.
Lewis
There's a pepper and there's an onion. There's some cheese but there isn't any milk. There are some eggs and some tomatoes, but there aren't any carrots.
సౌమ్య
So, a pepper – మిరపకాయ, an onion - ఒక ఉల్లిపాయ, some cheese - కొంచం ఛీజ్, some eggs - కొన్ని గుడ్లు and tomatoes – టమాటాలు ఉన్నాయట.
Sam
Mmmmh, maybe an omelette? What do you think?
సౌమ్య
Yes! Omelette- కోడిగుడ్డు అట్టు వెయ్యొచ్చు. తన దగ్గర ఏమున్నాయో, ఏమి లేవో చెప్పడానికి Lewis వాడిన పదబంధాలను మరొకసారి విందాం.
There's a pepper and there's an onion.
సౌమ్య
విన్నారా? లూయిస్ 'there's' అన్నారు. అంటే అక్కడ ఉంది అని అర్థం. ఏకవచనం, లెక్కించదగ్గ నామవాచకాలకు 'there's' అని వాడాలి. ఇక్కడ 'there', 'is' కలిపి 'there's' అవుతుంది. పలుతున్నప్పుడు ఒక పదం లాగే వినిపిస్తుంది.
Sam
Yes, so let's practise this together. Please repeat after me:
‘There's…’
‘There's a…’
‘There's a pepper’.
‘There's an onion’.
సౌమ్య
Great! Lewis చెప్పిన రెండో వాక్యం విందాం.
There's some cheese but there isn't any milk.
సౌమ్య
ఇక్కడ 'there's' అనే వాడారు. కానీ చీజ్ ముందు 'some' అన్నారు. Uncountable nouns -లెక్కించలేని నామవాచకాలకు 'some' అని వాడాలి.
Sam
So we can't say 'a', like with 'a pepper' or 'an onion', and when you pronounce 'some' you usually say it very quickly. Let's practise together – repeat after me.
‘some’
‘some cheese’
‘There’s some cheese’.
సౌమ్య
తరువాత 'there isn’t any milk' - ఫ్రిడ్జిలో పాలు లేవు అన్నారు. ‘Milk’ అనేది uncountable noun కాబట్టి 'isn't అని వాడాలి. ఇక్కడ కూడా 'is’, not' కలిపి 'isn't అవుతుంది. అస్సలు లేవు కాబట్టి 'any' అని వాడాలి.
Sam
Exactly! Let's practise that – repeat after me:
‘There isn't…’
‘There isn't any…’
‘There isn't any milk’.
సౌమ్య
చివరి వాక్యంలో ఏకవచనం వాడారా? బహువచనమా?
There are some eggs and some tomatoes, but there aren't any carrots.
సౌమ్య
గమనించారా? 'Eggs', 'tomatoes' and 'carrots'... ఇవన్నీ బహువచనాలు, లెక్కించగలిగేవి కాబట్టి గ్రామర్ మారుతుంది.
Sam
Yes, we change 'is' to 'are', but we still use ‘some' and 'any'. Let's practise:
‘There are some eggs’.
‘There are some tomatoes’.
‘There aren't any carrots’.
సౌమ్య
Thanks, Sam. ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలను మరోసారి ప్రాక్టీస్ చేద్దాం. మీ దగ్గర ఒకటే గుడ్డు ఉంది అనుకుందాం. దీన్ని ఇంగ్లిష్లో ఎలా చెప్తారు? తరువాత Sam కూడా చెప్తారు. విని, మీరు సరిగ్గా చెప్పారో లేదో చూసుకోండి.
Sam
There's an egg.
సౌమ్య
Did you say the same ? ఇప్పుడు మీ దగ్గర ఉల్లిపాయ లు లేవు అని చెప్పాలి. ఉల్లిపాయలని లెక్కించొచ్చు. కాబట్టి 'there isn't any' అని వస్తుందా? 'there aren't any'? అని వస్తుందా? Sam జవాబుతో కంపేర్ చేసుకోండి.
Sam
There aren't any onions.
సౌమ్య
Did you say the same? Well done! మీ దగ్గర కొన్ని పాలు ఉన్నాయి. పాలని లెక్కించలేము కాబట్టి 'a' అని వాడాలా, 'some' అనాలా?
Sam
There's some milk.
సౌమ్య
Well done! Sam, can we only use these phrases to describe what’s in our fridge?
Sam
No, absolutely not! You can use them to talk about what's in your town or city, what's in your room, even what's in your bag! So practise today!
సౌమ్య
మరో ‘How do I…’ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. Bye.
Sam
Bye, bye!
Learn more
1) 'There is', 'there are' వీటిని ఎలా ఉపయోగించాలి?
'There' + 'be' verb వాడాలి. తరువాత నామవాచకం రావాలి. ఏకవచనాలు, లెక్కించగలిగేవాటికి, లెక్కించలేని నామవాచకాలకూ కూడా 'is' అనే వాడాలి. బహువచనం, లెక్కించగలిగే నామవాచకాలకు 'are' వాడాలి.
- There's a pepper in the fridge. (pepper = singular, countable noun)
- There's some cheese in the fridge. (cheese = uncountable noun)
- There are four tomatoes in the fridge. (tomatoes = plural, countable noun)
2) 'Some' ను ఎలా ఎప్పుడు వాడాలి?
లెక్కించలేనప్పుడు, ఎంతుందో సరిగ్గా చెప్పలేనప్పుడు 'some' అని వాడాలి. బహువచనాలు, లెక్కించగలిగేవే అయినా కరక్ట్ గా నంబర్ చెప్పలేకపోయినప్పుడు కూడా 'some' వాడొచ్చు. ఇలాంటి సందర్భాలలో 'there are' అని వాడాలి.
- There are some tomatoes in the fridge.
లెక్కించలేని నామవాచకాలకు కూడా 'some' అని వాడొచ్చు. ఇలాంటప్పుడు 'there's' అని వాడాలి.
- There's some cheese in the fridge.
3) నెగటివ్ ఫార్మ్ లో ఎలా వాడాలి?
అక్కడ ఏమి లేదో చెప్పడానికి లేదా ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్పడానికి 'not' + 'be' verb వాడాలి. నామవాచకానికి ముందు 'any' అని వాడాలి.
- There isn't a pepper in the fridge. (pepper = singular, countable noun)
- There isn't any cheese in the fridge. (cheese = uncountable noun)
- There aren't any tomatoes in the fridge. (tomatoes = plural, countable noun)
4) 'Any' ఎప్పుడు ఎలా వాడాలి?
నెగటివ్ వాక్యాలలో 'not' తో పాటుగా 'any' వాడొచ్చు. బహువచనం, లెక్కించగలిగే నామవాచకాలకు 'there aren't' అని వాడాలి.
- There aren't any tomatoes in the fridge.
లెక్కించలేని నామవాచకాలకు 'there isn't' అని వాడాలి.
- There isn't any cheese in the fridge.
How do I talk about what food is in my kitchen?
4 Questions
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
ఒక్కటే కేరెట్ ఉంటే 'is' వస్తుందా, 'or' వస్తుందా?Question 1 of 4
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
కొన్ని ఉల్లిపాయలున్నప్పుడు 'is' వాడాలా, 'or' వాడాలా?Question 2 of 4
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
ఇది నెగటివ్ వాక్యం. 'Some' అనాలా? 'Any' అనాలా?Question 3 of 4
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
పాలు లెక్కించలేనివి...'is' వస్తుందా, 'are' వస్తుందా?Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Come to our Facebook group to tell us what's in your fridge, town, room or bag!
మీ ఫ్రిడ్జిలో, మీ ఇంట్లో, మీ ఊర్లో ఏమేమి ఉన్నాయో మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
in the fridge
ఫ్రిడ్జిలోa pepper
ఒక మిరపకాయan onion
ఒక ఉల్లిపాయcheese
చీజ్milk
పాలుeggs
గుడ్లుtomatoes
టమాటాలుcarrots
కేరెట్లుan omelette
కోడిగుడ్డు అట్టు (ఆమ్లెట్)