Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 39
Listen to find out how to tell a short story in English.
ఇంగ్లిష్లో చిన్న చిన్న కథలు చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 39 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I tell a short story?
మీకు కథలు చెప్పడం ఇష్టమేనా?
ఎవరికి చెప్తారు?
ఇంగ్లిష్లో చిన్న చిన్న కథలు చెప్పడం ఎలాగో ఇవాళ తెలుసుకుందాం.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Tom కూడా ఉన్నారు.
Tom
Hi everyone! Welcome to today’s programme!
సౌమ్య
కథలు చెప్పడమంటే నాకు చాలా ఇష్టం. మీకూ ఇష్టమే కదా! అయితే ఇవాళ మనం ఇంగ్లిష్లో చిన్న చిన్న కథలు ఎలా చెప్పాలో తెలుసుకుందాం. Do you like stories, Tom?
Tom
Yeah! But only the ones that have happy endings!
సౌమ్య
Well, see what you think of this one. ఈ కథేంటంటే కొంతమంది కలిసి ఒక పెద్ద కొండెక్కారు. అక్కడ వాళ్లకి ఒక ఎలుగుబంటి కనిపించింది. తరువాతేమయ్యింది? విందాం.
Insert
We were walking up the mountain, when we saw a bear. Luckily, before we started walking, our guide had given us instructions. We followed her instructions. We looked at the bear and walked away slowly. As we were walking, the bear left and went into the woods.
సౌమ్య
వాళ్లు మెల్లిగా చప్పుడు చెయ్యకుండా పక్కకి నడిచి వెళిపోయారు. ఎగులు కూడా పొదల్లోకి వెళిపోయింది. వాళ్ల గైడ్ మంచి సూచనే ఇచ్చారు. సరే, ఈ చిట్టి కథలో భాష ఎలా ఉంది? వాక్యాల నిర్మాణం ఎలా ఉంది పరిశీలిద్దామా? మొదటి భాగం విందాం.
Insert
We were walking up the mountain, when we saw a bear.
Tom
The speaker walking was the action in progress. It was in progress when they saw the bear. They use the past continuous tense.
సౌమ్య
ఇక్కడ past continuous టెన్స్ వాడారు. ఇక్కడ ‘was/were’ + [క్రియ with ING] వాడి past continuous లో చెప్పొచ్చు. రెండు విషయాలు జరుగుతున్నాయనుకుందాం. ఒకటి అప్పుడు ఆ క్షణంలో జరుగుతుంటే, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి జరుగుతుందనుకుందాం. వెనకాల జరుగుతున్న విషయం చెప్పడానికి past continuous tense వాడొచ్చు. అప్పుడు ఆ క్షణంలో జరుగుతున్న విషయం చెప్పడానికి past simple వాడొచ్చు. ఇక్కడ వాళ్లు ఎలుగుబంటిని చూసారు. ఎప్పుడు? నడుస్తున్నప్పుడు అంటే ఎలుగుని చూడడం ఆ క్షణంలో జరిగిన పని. దానికి past simple వాడతాం. అందుకని ‘we saw a bear’ అన్నారు. Background లో జరుగుతున్న పనేంటి? నడవడం. So దీనికి past continuous వాడుతూ we were walking అన్నారు. అర్థమైందా?
Tom
Let’s practice some past continuous. We don’t usually stress was or were. Repeat after me:
‘were’
‘were walking’
‘We were walking.’
‘looking’
‘was looking’
‘I was looking at him.’
సౌమ్య
Ok, తరువాత కూడా రెండు విషయాలను కలిపి ఒకే వాక్యంలో చెప్పారు. మళ్లీ విందాం.
Insert
Luckily before we started walking, our guide had given us instructions.
Tom
So, first, the guide gave the group instructions. Next, they started walking. The speaker says the guide ‘had given us instructions’. This sentence uses the past perfect tense.
సౌమ్య
ఇందాక మనం అప్పుడు ఆ క్షణంలో జరుగుతున్న విషయం, దాని వెనకాల జరుగుతున్న విషయం గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు గతంలో already జరిగిపోయాయి ఆ విషయాలు! అవి ఒకదాని తరువాత ఒకటి జరిగిన విషయాలు. వాటి గురించి చెప్పడానికి past perfect tense వాడొచ్చు. ఊast perfect లో had అని రావాలి. క్రియ past participle form లో వస్తుంది. ‘Had given’ వస్తుంది.
Tom
Notice that the speaker used the adverb ‘before’ to show what happened first. They said ‘before we started walking, our guide had given us instructions’. Had given is the past perfect tense. Let’s practise the pronunciation together. ‘Had’ is not usually stressed when we use the past perfect tense. So, repeat after me.
‘Had’
‘Had given’
‘She had given’
‘She had given us instructions.’
సౌమ్య
Nice. సరే, ఇప్పుడు నేర్చుకున్న విషయాలతో మీరెంత బాగా కథ చెప్తారో చూద్దాం . మీరు ఆఫీసుకి వెళుతుంటే దార్లో రోడ్డు మీద మీకొక 'envelope' కనిపించింది. ఈ విషయాన్ని ఇంగ్లిష్లో ఎలా చెప్తారు?
Tom
I was walking to work and I found an envelope on the floor.
సౌమ్య
Very good. ఆ 'envelope' ని మీరు తెరిచి చూసారు. అందులో డబ్బుంది. ఎవరో డబ్బు పెట్టి పారేసుకున్నారు. ఇదెలా చెప్తారు? రెండో వాక్యంలో had అని వాడాలి. గుర్తుంది కదా!
Tom
I opened the envelope and someone had put money in it.
సౌమ్య
Nice.
Tom
How do you think it ends?
సౌమ్య
Hmm I am not sure! Hope it would be a happy ending. Ok మీకు కథ ఎలా చెప్పాలి, ఏ టెన్స్లు వాడాలి, క్రియలు ఏ form లో వాడాలి తెలిసింది కదా. మరో How do I.. ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం. Bye.
Learn more
1. Past simple
We use the past simple to talk about a finished item in the past. It is sometimes used to contrast with the past continuous or past perfect.
- We saw a bear.
- We followed her instructions.
- The bear left and went back into the woods
2. Past continuous
We use the past continuous to refer to something that is in progress when something else happens (which is usually referred to in the past simple). It is formed with the past tense of 'to be' and the 'ing' form of the verb.
- We were walking up the mountain, when we saw a bear.
- As we were walking, the bear left.
3. Past perfect
We use the past perfect to say that one past event happened before another one. It is formed with 'had' and the past participle of the verb.
- Luckily, before we started walking, our guide had given us instructions.
- We did what she had told us.
- I had seen bears before this trip.
How do I tell a short story?
3 Questions
Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
వెనకాల జరుగుతున్న విషయం ఏంటి?Question 1 of 3
Help
Activity
Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ముందు ఏం జరిగింది?Question 2 of 3
Help
Activity
Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ముందు ఏం జరిగింది? వెనకాల జరుగుతున్నదేమిటి?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
What would you like to tell a story about? Come and tell us on our Facebook group!
మాకు ఏదైనా చిన్న కథ చెప్తారా? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I…కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
mountain
కొండ/పర్వతంbear
ఎలుగుబంటిwoods
చెట్లు/కర్ర దుంగలుguide
గైడ్face
ఎదుర్కొనుట