Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 17
Listen to find out how to ask about a celebration in English.
వేడుకల గురించి ఇంగ్లిష్లో ఎలా మాట్లాడాలో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 17 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I ask about a celebration?
ఈ కింది రెండు ప్రశ్నలూ ఒకటేనా? వేర్వేరా?
- How was your New Year's?
- What was your New Year's like?
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Hello and welcome! We have a fun topic for the audience today, don't we?
సౌమ్య
Yes. ఇవాళ మనం celebrations గురించి మాట్లాడుకోబోతున్నాం. వేడుకల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. జేమ్స్, ఫిల్ ఏవో గురించి మాట్లాడుకుంటున్నారు. విందాం రండి. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. వాళ్లేదో పెద్ద వేడుక గురించే మాట్లాడుకుంటున్నారు. విందామా?
Phil
Hi James! Happy New Year! How was your New Year's?
James
It was great, thanks! We went to a big party. It was really fun. How about you? What was your New Year's like?
Phil
It was really quiet but it was nice.
సౌమ్య
విన్నారా? వాళ్లు కొత్త సంవత్సరం వేడుకల గురించి మాట్లాడుకుంటున్నారు.
Sam
And they asked each other some useful questions we can use to ask about lots of things. So let's have a look at those together.
సౌమ్య
అవును. ఇద్దరూ ఇద్దరినీ న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరిగాయి? అనే అడిగారు. కానీ ఇద్దరూ రెండు రకాలుగా అడిగారు. మళ్లీ విందాం.
How was your New Year's?
What was your New Year's like?
సౌమ్య
ఫిల్ 'How was your New Year's?', అని అడిగాడు. ఇందులో New Year అనేది వాక్యం చివర్లో వచ్చింది.
Sam
And then 'What was your New Year's like?', where 'your New Year's' goes before 'like'. Can you quickly explain 'like' here?
సౌమ్య
Yes. ఇక్కడ 'What was your New Year's like?' అని అడిగినప్పుడు like అంటే ఇష్టం అని కాదు. మనం తెలుగులో వంటిది, వలే, పోలిన అని వాడతాం కదా దానికి ఇంగ్లిష్లో ‘like’ అంటారు. సమానమైనది, సదృశమైనది అని అర్థం. మీ న్యూ ఇయర్ ఎలా జరిగింది? దేనివలె జరిగింది? అని అడుగుతున్నారు.
Sam
Exactly! And you can use these questions to ask about many things – a birthday, a party, a wedding… Shall we practise the pronunciation? Please repeat after me:
‘How was your birthday?’
‘What was your birthday like?’
‘How was the party?’
‘What was the party like?’
Well done!
And you can use ‘your’ or ‘the’ after ‘was’ depending on what you’re talking about.
Now let's look at different ways you can answer these questions.
సౌమ్య
Yes! జవాబులు ఎలా చెప్పారో ఒకసారి పరిశీలిద్దాం.
It was great, thanks!
It was really fun.
It was really quiet but it was nice.
సౌమ్య
గమనించారా వాళ్లు ప్రతీసారీ 'it was…' అనే మొదలెట్టారు. తరువాత విశేషణం వాడారు. 'great', 'fun', 'quiet' and 'nice' ఇవన్నీ వాడారు. ఇవే కాకుండా ఎలాంటి విశేషణాలైనా వాడొచ్చు. Positive or negative.. ఏదైనా వాడొచ్చు.
Sam
And we say 'it' and 'was' quite quickly, so it sounds like 'Itwaz'. Let's practise that - repeat after me:
‘It was great, thanks!’
‘It was really fun!’
‘It was really quiet.’
‘….but it was nice.’
సౌమ్య
Great! ఇప్పుడు పరీక్షా సమయం. మీరెంత బాగా నేర్చుకున్నారో చూద్దాం! మీ ఫ్రెండ్ని తన పుట్టినరోజు తరువాత మీరు కలిసారు. Birthday party ఎలా జరిగింది? అని అడగాలి. ప్రయత్నించండి. తరువాత Sam కూడా జవాబు చెప్తారు. విని, మీ జవాబు సరిచూసుకోండి.
Sam
How was your birthday party?
సౌమ్య
Well done! ఇప్పుడు అదే ప్రశ్న మరో విధంగా అడగాలి. ఇందాక మనం రెండు విధాలుగా ఎలా అడగవచ్చో నేర్చుకున్నాం కదా. అందులో రెండో పద్ధతి పాటించాలి. 'What', 'like' ఈ రెండు పదాలు వాడాలి. Try చెయ్యండి.
Sam
What was your birthday party like?
సౌమ్య
Good! ప్రశ్నలడగడం వచ్చేసిందిగా! ఇప్పుడు జవాబులు ఎలా చెప్తారో చూద్దాం. ఈ ప్రశ్న విని, జవాబు చెప్పండి.
What was your weekend like?
Sam
Mine was really nice! I hope yours was, too!
సౌమ్య
And how was this programme, Sam?
Sam
It was great, as always.
సౌమ్య
Thanks. So we hope to see you next week for more How do I…! Bye, everyone.
Sam
See you then! Bye!
Learn more
1. ఒక ప్రత్యేకమైన వేడుక గురించి ఎలా అడగాలి?
ఈ కింది రెండు విధాలుగా అడగొచ్చు.
- How was your New Year's?
- What was your New Year's like?
మొదటి పద్ధతిలో వేడుక పేరు వాక్యం చివర్న రావాలి.
How was your ______?
How was the ______?
రెండో పద్ధతిలో వేడుక పేరు 'like' కు ముందు వస్తుంది.
What was your ______ like?
What was the ______ like?
2. ఈ కింది ప్రశ్నలలో 'you' కు 'the' కు తేడా ఏంటి?
సంభాషిస్తున్న ఇద్దరికీ ఆ ప్రత్యేకమైన వేడుక గురించి వివరాలు తెలిసినట్లైతే 'the' వాడొచ్చు.
• How was the wedding?
• What was the party like?
• How was the dinner?
• What was the concert like?
మీరెలా జరుపుకున్నారు అని ప్రత్యేకంగా అడగాలంటే 'your' వాడాలి.
• How was your New Year's?
• What was your Christmas like?
• How was your weekend?
• What was your Deepawali like?
3. ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్పాలి?
ఈ కింది విధంగా చెప్పొచ్చు.
• It was great, thanks!
• It was really fun.
• It was really quiet but it was nice.
It was తో మొదలెట్టి తరువాత విశేషణాన్ని వాడొచ్చు.
4. మరింత సమాచారాన్ని ఎలా అడగాలి?
ఈ కింది విధంగా తదుపరి ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు.
• What did you do?
• What did you get up to? ('get up to' એ 'do' ને કહેવાની અનૌપચારિક રીત છે)
వీటికి ఈ కింది జవాబులు ఇవ్వొచ్చు.
• I went to a great party!
• We stayed in.
How do I ask about a celebration?
3 Questions
Complete the gaps.
ఖాళీలను పూరించండి.
Help
Activity
Complete the gaps.
ఖాళీలను పూరించండి.
Hint
'Like' అని వచ్చినప్పుడు ముందు ఏ ప్రశ్నార్థకం రావాలి?Question 1 of 3
Help
Activity
Complete the gaps.
ఖాళీలను పూరించండి.
Hint
పార్టీ ఎలా ఉంది అని అడగాలి.Question 2 of 3
Help
Activity
Complete the gaps.
ఖాళీలను పూరించండి.
Hint
ఎలా మొదలెట్టాలో పాఠంలో చెప్పాం. గుర్తుందా?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
What was the last big event you celebrated? What was it like? Come and tell us on our Facebook group!
మీరు చివరిగా జరుగుపుకున్న పెద్ద వేడుక ఏది? ఎలా జరిగింది? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో పంచుకోండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
a celebration
వేడుకNew Year's (Eve)
కొత్త సంవత్సర వేడుకyour birthday
మీ పుట్టినరోజుyour party
మీ పార్టీthe wedding
వివాహంthe concert
కచేరీgreat
గొప్పగా
fun
సరదాగాquiet
నిశ్శబ్దంగాnice
బావుంది