Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 13
Listen to find out how to talk about possible situations in the future using 'if' in English.
'If' వాడుతూ సమీప భవిష్యత్తు ప్లానుల గురించి ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 13 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about making future plans using ‘if’?
వీళ్ల వారాంతం ప్లాన్స్ దేని మీద ఆధారపడి ఉన్నాయి?
- If it's sunny this weekend, I could go for a bike ride!
- If it's sunny, I might go shopping.
- If it's sunny, I may go to the beach.
- If it's sunny, I'll relax in the garden.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Hello!
సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్లో ‘if’ అనే పదాన్ని సమీప భవిష్యత్తు నిర్ణయాలకు ఎలా వాడాలో తెలుసుకుందాం. ఇక్కడ కొందరు ఈ వారాంతంలో వారు చేయాలనుకునే పనుల గురించి మాట్లాడుతున్నారు. విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను.
- If it's sunny this weekend, I could go for a bike ride!
- If it's sunny, I might go shopping.
- If it's sunny, I may go to the beach.
- If it's sunny, I'll relax in the garden.
సౌమ్య
విన్నారా? వాళ్ల ప్లానులన్నీ ఎండ వస్తుందా రాదా అనేదాని మీదనే ఆధారపడి ఉన్నాయి.
Sam
Yes, they all said 'if it's sunny' and the important word here is 'if'.
సౌమ్య
ఈ ‘if’ అనే పదాన్ని ఇంగ్లిష్‌లో చాలా సందర్భాల్లో వాడొచ్చు. కానీ ఇవాళ సమీప భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పడానికి ఎలా వాడాలో తెలుసుకుందాం.
Sam
Yes, and you can use any verb in the present after 'if' – 'if it rains', 'if you're late', 'if he comes'... But, what happens in the other part of the sentence?
సౌమ్య
వాక్యం రెండో భాగంలో రెండు క్రియాపదాలను కలిపి వాడొచ్చు. మొదటి వ్యక్తి 'go for a bike ride' అన్నారు. అయితే 'go' కు ముందు ఏ క్రియను వాడారు? మళ్లీ విందాం.
If it's sunny this weekend, I could go for a bike ride!
సౌమ్య
'Could' అన్నారు. సాధ్యం అవుతుంది అనే అర్థం వచ్చేట్టు ‘could’ అని అన్నారు. ‘ఈ వారాంతంలో ఎండ కాస్తేనే నాకు బైక్ తొక్కడానికి వీలవుతుంది’ అన్నారు. ఇలాగే ‘వీలవుతుంది’, ‘సాధ్యమవుతుంది’ అని అర్థమొచ్చేట్టు ఏ క్రియాపదానికైనా ముందు ‘could’ చేర్చి వాక్యాల్లో వాడొచ్చు.
Sam
Yes, any verb, and the pronunciation is 'could'. Let's try that:
‘…could go…’
‘If it's sunny, I could go for a bike ride.’
సౌమ్య
మిగతా ఇద్దరూ కూడా ఏమన్నారో మళ్లీ విందాం. వీళ్లిద్దరూ ‘go’ కు ముందు ఏ క్రియలను వాడారో జాగ్రత్తగా గమనించండి.
If it's sunny, I might go shopping.
If it's sunny, I may go to the beach.
సౌమ్య
గమనించారా? ఎండ కాస్తే నేను షాపింగ్‌కి వెళ్తానేమో! లేదా బీచ్‌కు వెళతానేమో! అంటున్నారు. వెళ్లే అవకాశముంది అని చెప్పడానికి 'may' లేదా 'might' అని వాడొచ్చు. ఈ రెండు పదాలలో ఏది వాడినా ఫరవాలేదు. రెండిటికీ కూడా అర్థం ఒకటే! వీటిని కూడా ఏ క్రియాపదాల ముందైనా వాడొచ్చు.
Sam
And let's look at the pronunciation together. Repeat after me:
‘…might go…’
‘If it's sunny, I might go shopping.’
‘…may go…’
‘If it's sunny, I may go to the beach.’
సౌమ్య
Thanks, Sam. ఇంక చివరి వ్యక్తి ఏమన్నారో విందాం. అతను 'relax' అనే క్రియ వాడారు. దానికిముందు ఏమన్నారు?
If it's sunny, I'll relax in the garden.
సౌమ్య
'I'll' అన్నారు. ఇది 'I will' కు కుదింపు. ఎండ కాస్తే కచ్చితంగా తోటకెళ్లి విశ్రాంతి తీసుకుంటాను అన్నారు. మిగతా ముగ్గురూ ఎండ కాస్తే మేము ఫలానా పని చేసే అవకాశం ఉంది అన్నట్టు మాట్లాడారు. కానీ చివరి వ్యక్తి ఎండ కాస్తే ఏం చెయ్యాలో కచ్చితంగా నిర్ణయించేసుకున్నారు. అందుకనే 'I'll' అని వాడారు. అయితే నలుగురి ప్లాన్స్ కూడా ఎండ కాస్తుందా, కాయదా అనే విషయంపై ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి విషయాలు చెప్పడానికి ‘if’ అని వాడతాం. అర్థమయ్యిందా?!
Sam
Quick practice of pronunciation:
‘I'll relax…’
‘If it's sunny, I'll relax in the garden.’
సౌమ్య
Great! ఇప్పుడు కొంచం సాధన చేద్దామా? ఎండ కాస్తే నేను రన్నింగ్ కి వెళ్లొచ్చు అని చెప్పాలి. మూడు రకాలుగా వాక్యాల్ని నిర్మించొచ్చు. ప్రయత్నించండి. తరువాత Sam కూడా చెప్తారు. విని మీ జవాబులు సరిచూసుకోండి. వాక్యంలో 'go running' అని వాడండి.
Sam
If it's sunny, I could go running.
If it's sunny, I might go running.
If it's sunny, I may go running.
సౌమ్య
Great! ఇప్పుడు ‘ఆఫీసులో పని పూర్తి చేసేస్తే ఇంటికి తొందరగా వెళ్లిపోతాను’ అని చెప్పాలి. వాక్యంలో 'go home early’ అని వాడండి. Sam చెప్పిన జవాబుతో సరిచూసుకోండి.
Sam
If I finish my work, I'll go home early.
That's a great idea, let's go home!
సౌమ్య
Only if you finish your work, Sam…
Sam
Oh, ok.
సౌమ్య
Bye bye!
Sam
Bye, everyone!
Learn more
1. 'If' అంటే ఏంటి?
'అలా అయితేనే', 'ఇది జరిగితేనే' అనే అర్థంలో 'if' వాడతాం. ఈ పదాన్ని ఇంగ్లిష్‌లో అనేక రకాల సందర్భాల్లో ఉపయోగించొచ్చు. కానీ ఇవాళ సమీప భవిష్యత్తు గురించి చెప్పడానికి 'if' ను ఎలా వాడాలో తెలుసుకుందాం.
In these cases, we follow 'if' with a verb in the present.
If it rains…
- If you're late…
- If he comes…
2. వాక్యంలో 'if' మీద ఆధారపడిన భాగాన్ని నిర్మించడం ఎలా?
ఆ వాక్యం అర్థానికి సరిపడేట్టు చాలా రకాలుగా నిర్మించొచ్చు.
could/ might/ may + base verb = something that will be possible.
- If it's sunny, I might go shopping.
- If it's sunny, I may go to the beach.
will + base verb = something that will be certain.
- If it's sunny, I'll relax in the garden.
3. నకారాత్మక (negative) పదం వాడొచ్చా?
అవును. వాక్యంలో రెండు భాగాల్లోనూ not వాడొచ్చు.
- If it isn't sunny this weekend, I might stay at home.
- It if rains this weekend, I won't go to the beach.
4. వాక్య క్రమాన్ని మార్చొచ్చా?
మార్చొచ్చు. వాక్యంలో రెండు భాగాలనూ అటుదిటు చెయ్యొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వాక్యం 'if' తో మొదలవ్వకపొతే వాక్యంలో రెండు భాగాల మధ్య కామా పెట్టకూడదు.
- If it's sunny, I might go shopping.
- I might go shopping if it's sunny.
How do I talk about making future plans using ‘if’?
3 Questions
Complete the gaps.
ఖాళీలను పూరించండి.
Help
Activity
Complete the gaps.
ఖాళీలను పూరించండి.
Hint
'If' తో మొదలవ్వాలి. తరువాత క్రియ రావాలి.Question 1 of 3
Help
Activity
Complete the gaps.
ఖాళీలను పూరించండి.
Hint
వాక్యంలోని ఈ భాగంలో ఎన్ని క్రియలు వాడొచ్చు?Question 2 of 3
Help
Activity
Complete the gaps.
ఖాళీలను పూరించండి.
Hint
మొదట్లో 'if' రాలేదు కాబట్టి మధ్యలో వస్తుందా?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
What will you do this weekend if it doesn't rain? Come and tell us on our Facebook group!
ఈ వీకెండ్లో వర్షం పడకుండా ఉంటే మీరేం ప్లాన్ చేస్తున్నారు? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
go for a bike ride
బైక్ నడపడానికి వెళ్లడంgo shopping
షాపింగ్‌కు వెళ్లడంgo to the beach
బీచ్‌కు వెళ్లడంrelax in the garden
తోటలో విశ్రాంతి తీసుకోవడం