Unit 1: Essential English Conversation
Select a unit
Session 9
Listen to find out how to ask about someone’s birthday.
ఎదుటివారి పుట్టినరోజు కనుక్కోవడం ఎలా?
Session 9 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
When is your birthday? నీ పుట్టినరోజు ఎప్పుడు?
Listen to find out how to ask about someone’s birthday.
ఎదుటివారి పుట్టినరోజు కనుక్కోవడం - ఇక్కడ విని నేర్చుకోండి.
Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

కల్యాణి
హలో! బాగున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. ఎదుటివారి పుట్టినరోజు కనుక్కోవడం - ఇప్పుడు నేర్చుకుందురు గాని.
ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.
Amy
When’s your birthday?
Phil
My birthday’s on June the 10th.
Amy
Mine’s on October the 3rd.
కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదటా ...
‘When is your birthday?’ ‘నీ పుట్టినరోజు ఎప్పుడు?’ అని ఏమీ, ఫిల్‌ని అడిగింది. విని మీరూ అనండి.
When’s your birthday?
కల్యాణి
‘My birthday’s on June the 10th’ ‘నా పుట్టినరోజు జూన్ 10న’ అని ఫిల్ చెప్పాడు. తేదీ, నెల – చెప్పేందుకు మనం ‘on’ అనే పదాన్ని వాడతాం. For example, ‘on May the 10th’ and ‘on April the 22nd’ విని మీరూ అనండి.
My birthday’s on June the 10th.
కల్యాణి
పుట్టిన రోజును చెప్పేందుకు ముందు నెల పేరు చెప్తూ మొదలు పెట్టొచ్చు, ఇవిగో నెలల పేర్లు :
జనవరి January
ఫిబ్రవరి February
మార్చి March
ఏప్రిల్ April
మే May
జూన్ June
జూలై July
ఆగస్ట్ August
సెప్టెంబర్ September
అక్టోబర్ October
నవంబర్ November
డిసెంబర్ December
కల్యాణి
అన్నట్టూ – పుట్టినతేదీని చెప్పేటం దుకు క్రమసంఖ్యలను వాడతాం. ఒకటి, రెండు, మూడులకు క్రమసంఖ్యలు ఇవిగో:
First, second, third.
కల్యాణి
నాలుగు నుంచి ఇరవై దాకా ఉండే సంఖ్యల చివర ‘th’ చేర్చాల్సి ఉంటుంది. For example
నాలుగవ fourth
పదవ tenth
పద్ధెనిమిదవ eighteenth
కల్యాణి
ఇరవై పైనున్న సంఖ్యలకు ఇరవైతో కలిపి క్రమసంఖ్యను చెపితే సరిపోతుంది.
ఇరవై నాలుగవ – Twenty-fourth
ఇరవై ఏడవ – Twenty-seventh
ఇరవై తొమ్మిదివ – Twenty-ninth
కల్యాణి
అప్పుడు ఏమీ, నాది అక్టోబర్ మూడున, ‘Mine’s on October the 3rd’ అని చెప్పింది. విని మీరూ అనండి.
Mine’s on October the 3rd.
కల్యాణి
బాగుంది – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా ఒకరి పుట్టినరోజు గురించి మరొకరు అడిగి తెలుసుకుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.
When’s your birthday?
My birthday’s on May the 23rd.
Mine’s on January the 10th.
When’s your birthday?
My birthday’s on February the 13th.
Mine’s on August the 8th.
కల్యాణి
Ok, మరో సారి చేద్దామా, ఈ ఇంగ్లీష్ వాక్యాలను విని మీరూ అనండి.
When’s your birthday?
My birthday’s on June the 10th.
Mine’s on October the 3rd
కల్యాణి
సరే, ఈ ఇంగ్లిష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లిష్‌లో అనండి.
నీ పుట్టినరోజు ఎప్పుడు?
When’s your birthday?
నా పుట్టినరోజు జూన్ 10న.
My birthday’s on June the 10th.
నాది అక్టోబర్ మూడున
Mine’s on October the 3rd
కల్యాణి
బ్రహ్మాండం – ఇంగ్లిష్‌లో పుట్టినరోజు గురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి ఏమీ ప్రశ్నకు మీ అసలు పుట్టినరోజు చెప్తూ - జవాబివ్వండి. ‘When’s your birthday?’ అని ఏమీని అడగడం మర్చి పోకండీ.
When’s your birthday?
Mine’s on October the 3rd.
కల్యాణి
భలే, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.
Amy
When’s your birthday?
Phil
My birthday’s on June the 10th.
Amy
Mine’s on October the 3rd
కల్యాణి
భలే చక్కగా చేశారే, ఇప్పుడు ఇంగ్లిష్‌లో ఎదుటివారి పుట్టినరోజు ఎప్పుడనేది కనుక్కోగలరు కదా, మిత్రులతో కలిసి మీరు నేర్చుకున్నది సాధన చెయ్యండి. సరైన నెల పేరు చెప్పండి, తేదీని చెప్పేందుకు క్రమసంఖ్యలనూ వాడాలి – ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. రోజు వారీ ఇంగ్లీష్‌ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!
Check what you’ve learned by choosing the correct answer to the question.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
When is your birthday?
3 Questions
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
Help
Activity
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
Hint
పైనQuestion 1 of 3
Help
Activity
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
Hint
నాలుగక్షరాలుQuestion 2 of 3
Help
Activity
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
Hint
మూడక్షరాలుQuestion 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
When’s your birthday?
నీ పుట్టినరోజు ఏది?My birthday’s on _ the _.
‘నా పుట్టినరోజు ___ (నెల) ___ (తేదీ)న’.My birthday’s on the __ of __.
‘నా పుట్టినరోజు ___ (తేదీ) ______( నెల).January
జనవరిFebruary
ఫిబ్రవరిMarch
మార్చిApril
ఏప్రిల్May
మేJune
జూన్July
జూలైAugust
ఆగస్ట్September
సెప్టెంబర్October
అక్టోబర్November
నవంబర్December
డిసెంబర్