Unit 1: Essential English Conversation
Select a unit
Session 5
Listen to find out how to use what we have learned in the last four lessons.
మొదటి నాలుగు పాఠాల్లో నేర్చుకున్న విషయాలను వాడడం ఎలాగో ఇక్కడ నేర్చుకోండి.
Session 5 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
Review
Listen to find out how to use what we have learned in the last four lessons.
మొదటి నాలుగు పాఠాల్లో నేర్చుకున్న విషయాలను వాడడం ఎలాగో ఇక్కడ నేర్చుకోండి.
Listen to the audio and take the quiz. ఆడియో వినండి.

కల్యాణి
హలో! బావున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి.
ఇంతకు ముందు నాలుగు పాఠాలలో నేర్చుకున్న వాటిని ఇప్పుడు సాధన చేద్దురుగాని. మన పేర్లూ, ఊర్లూ, వృత్తులూ ఇంకా ఫోన్నంబర్లూ - ఇవి చెప్పడం, ఎదుటి వారివి కనుక్కోవడం – ఇవన్నీ నేర్చుకున్నాం, గుర్తుంది కదా.
ఇదిగో వీళ్లేం మాట్లాడుకుంటున్నారో వినండి.
Sarah
Hello, I'm Sarah. What's your name?
Matthew
Hi. My name's Matthew. Nice to meet you.
Sarah
Where are you from?
Matthew
I’m from Leeds. How about you?
Sarah
I’m from Cardiff. What do you do?
Matthew
I’m an engineer.
Sarah
What’s your phone number?
Matthew
It’s 0113 496 0578.
Sarah
Thanks!
కల్యాణి
ఏ మాత్రం గుర్తుందో తెలుస్తుంది, ఈ క్విజ్ చేసి చూద్దామా? ప్రశ్నా, తర్వాత కాసేపటికి జవాబూ వినిపిస్తాయి. ఆ గడువులో మీరు ఆలోచించుకుంటూ ఉండండి.
సరే మొదటి ప్రశ్న-
కల్యాణి
'నీ పేరేమిటి' అని ఎవరినైనా అడగాలంటే ఎలా అడుగుతారు'?
Sarah
Hello, what’s your name?
కల్యాణి
‘నా పేరు ఫలానా ...’ అని మీ పేరు చెప్పండి.
Matthew
My name’s Matthew.
కల్యాణి
‘నేను ఫలానా ...’ అంటూ కూడా మీ పేరు చెప్పొచ్చు.
Matthew
I’m Matthew.
కల్యాణి
ఇప్పుడు 'నిన్నుకలవడం నాకు సంతోషంగా ఉంది'. అని చెప్పండి.
Matthew
Nice to meet you.
కల్యాణి
'నువ్వెక్కడి నుంచి వచ్చావు ?' అని అడగండి.
Matthew
Where are you from?
కల్యాణి
నేను ఫలానా ఊరి నుంచి వచ్చానంటూ మీ ఊరి పేరు కలిపి చెప్పండి.
Matthew
I’m from Leeds
కల్యాణి
దీనిలో మీరు దేశపు పేర్లు కూడా కలిపి చెప్పొచ్చు.
Matthew
I’m from England.
కల్యాణి
'మరి నీ సంగతేమిటి ?' అని ఎదుటి వారినడగండి.
Matthew
How about you?
కల్యాణి
'నువ్వేం చేస్తూ ఉంటావు?' అని అడగండి.
Sarah
What do you do?
కల్యాణి
వృత్తి గురించి అడిగేటప్పుడు “what do you do?” అని అంటాం, గుర్తుందిగా.
'నేనొక ఇంజనీర్ని' అని చెప్పండి.
Matthew
I’m an engineer.
కల్యాణి
'నీ ఫోన్ నంబర్ ఏమిటి ? ' అని అడగండి .
Matthew
What’s your phone number?
కల్యాణి
'0113 496 0578 ' అని చెప్పండి.
Matthew
0113 496 0578
కల్యాణి
చివరగా 'థేంక్స్!' అని చెప్పండి.
Matthew
Thanks!
కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, మళ్లీ చేసి చూద్దాం ఉండండి ...
ఇప్పుడు మళ్లీ విని, అనండి.
Hello, I'm Sarah. What's your name?
Hi. My name's Matthew. Nice to meet you.
Where are you from?
I’m from Leeds.
How about you?
I’m from Cardiff.
What do you do?
I’m an engineer.
What’s your phone number?
It’s 0113 496 0578
Thanks!
కల్యాణి
బ్రహ్మాండం – మొత్తం అంతా కలిపి మాట్లాడి చూద్దురు గాని. మరి సేరా వేసే ప్రశ్నలకు జవాబులివ్వండి.
Sarah
Hello, I'm Sarah. What's your name?
What do you do?
Where are you from?
What’s your phone number?
Thanks!
కల్యాణి
భలే, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులను సరి చూసుకోండి.
Sarah
Hello, I'm Sarah. What's your name?
Matthew
Hi. My name's Matthew. Nice to meet you.
Sarah
Where are you from?
Matthew
I’m from Leeds. How about you?
Sarah
I’m from Cardiff. What do you do?
Matthew
I’m an engineer.
Sarah
What’s your phone number?
Matthew
It’s 0113 496 0578.
Sarah
Thanks!
కల్యాణి
భలే చక్కగా చేశారే, కొత్త వారిని కలిసినప్పుడు ఇంగ్లీష్‌లో మన పేర్లు, ఊర్లు, వృత్తులు ఇంకా ఫోన్నంబర్ల గురించి చెప్పడం, ఎదుటి వారివి కనుక్కోవడం – ఇవన్నీ తెలుసుకున్నారు కదా. రోజు వారీ ఇంగ్లీష్‌ను నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!
Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.
Review
3 Questions
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
Help
Activity
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
Hint
పేరుQuestion 1 of 3
Help
Activity
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
Hint
ప్రదేశం.Question 2 of 3
Help
Activity
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
Hint
ఉద్యోగం.Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
Hello.
హెలో
Hi.
హాయ్
I'm ______.
నేను______.
My name's ______.
నా పేరు ______.
What's your name?
నీ పేరేమిటి?
Nice to meet you.
నిన్ను కలవడం నాకు సంతోషంగా ఉంది.
Where are you from?
నీది ఏ ప్రాంతం?
I’m from ______.
నేను ______ ప్రాంతం వాడిని.
How about you?
మీ సంగతి?
What do you do?
నువ్వేం చేస్తూ ఉంటావు?
I’m a/ an______.
నేను ఒక ______.
What’s your phone number?
నీ ఫోన్ నంబర్ ఏమిటి?
It’s ______.
అదీ ______.
Thanks!
ధన్యవాదాలు!