Unit 1: Essential English Conversation
Select a unit
Session 19
Listen to find out how to talk about different meals.
వివిధ సమయాలలో తీసుకునే ఆహారం గురించి ఇక్కడ విని నేర్చుకోండి.
Session 19 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
Different meals
Listen to find out how to talk about different meals.
వివిధ సమయాలలో తీసుకునే ఆహారం గురించి ఇక్కడ విని తెలుసుకోండి.
Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

కల్యాణి
హలో! బాగున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. వివిధ సమయాల్లో తీసుకునే ఆహారం గురించి మాట్లాడ్డం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందురు గాని.
ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.
Phil
Hi Sian. What do you eat for breakfast?
Sian
I usually eat porridge for breakfast. What about you?
Phil
I always eat fruit.
కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ... మొట్టమొదట Sian ఉదయాన్నే ఏ ఆహారం తీసుకుందని, అంటే “breakfast” ఏం చేసిందని Phil అడిగాడు. విని మీరూ అనండి.
What do you eat for breakfast?
కల్యాణి
మధ్యాహ్నం ఏం ఆహారం తీసుకున్నావనీ, అంటే ‘lunch’లో ఏం తిన్నావనీ, ఇంకా రాత్రి భోజనం ‘dinner’లో ఏం తిన్నావనీ కూడా అడగొచ్చు.
What do you eat for lunch?
What do you eat for dinner?
కల్యాణి
Sian, తను సాధారణంగా, 'usually' – అంబలి, 'porridge' తింటూ ఉంటానని చెప్పింది. విని మీరూ అనండి.
I usually eat porridge for breakfast.
కల్యాణి
మీరు ఎంత తరుచుగా తీసుకుంటారో చెప్పేందుకు -నిత్యం ‘always’ అని గానీ, అప్పుడప్పుడూ ‘sometimes’ అని గానీ వాడొచ్చు.
I always eat porridge for breakfast.
I sometimes eat porridge for breakfast.
కల్యాణి
తరువాత ఆమె Philని అదే ప్రశ్న అడిగింది, అలా అడిగేందుకు,'నీ సంగతేమిటి?' 'What about you?' అని అడగొచ్చు. విని మీరూ అనండి.
What about you?
కల్యాణి
Phil said that he always 'always' eats fruit 'fruit' for breakfast.
I always eat fruit.
కల్యాణి
ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా ఇష్టమైన ఆహారం గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.
'Fish stew' చేపల జావని 'lunch' లో తీసుకున్నానని Rob చెప్తే, Nicole కోడిమాంసం 'chicken' తో అన్నం 'rice' తిన్నానని చెప్పింది.
Hi Rob. What do you eat for lunch?
I usually eat fish stew for lunch. How about you?
I usually eat chicken and rice.
కల్యాణి
Heather గొర్రెమాంసం 'lamb' ని 'dinner' లో తీసుకున్నానని చెప్పింది, Nick కూరగాయలు 'vegetables' తిన్నానని చెప్పాడు.
Hi Heather. What do you eat for dinner?
I always eat lamb for dinner. What about you?
I usually eat vegetables.
కల్యాణి
సరే, మళ్లీ చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విన్నాక మీరూ అనండి.
What do you eat for breakfast?
I usually eat porridge for breakfast.
What about you?
I always eat fruit.
కల్యాణి
సరే, ఈ ఇంగ్లిష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లిష్‌లో అనండి.
మీరు ఉదయాన్నే ఏం ఆహారం తీసుకుంటారు?
What do you eat for breakfast?
నేను ఉదయాన్న సాధారణంగా అంబలి తింటాను.
I usually eat porridge for breakfast.
మరి మీసంగతేమిటి?
What about you?
నేను ఉదయాన్న ఎప్పుడూ పళ్లే తింటాను.
I always eat fruit.
కల్యాణి
Fantastic – ఇంగ్లీష్‌లో ఇష్టమైన ఆహారం గురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి Sian ప్రశ్నకు జవాబివ్వండి.
What do you eat for breakfast?
I always eat fruit.
కల్యాణి
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.
Phil
Hi Sian. What do you eat for breakfast?
Sian
I usually eat porridge for breakfast. What about you?
Phil
I always eat fruit.
కల్యాణి
Well done! భలే చక్కగా చేశారే. ఇప్పుడు వివిధ సమయాల్లో తీసుకునే ఆహారం గురించి ఇంగ్లిష్‌లో చెప్పగలరు, ఎదుటి వారిని కనుక్కోగలరు. ఇక మిత్రులతో కలిసి ఈ ఇంగ్లీష్ అభ్యాసం చేస్తూ ఉండండి. మరిన్ని విషయాల్ని తెలుసుకోడానికి Essential English Conversation లలో మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!
Check what you’ve learned by putting the words in the correct order.
సరైన క్రమంలో అమర్చి మీరు నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.
Different meals
3 Questions
Put the words in the correct order.
సరైన క్రమంలో అమర్చండి.
Help
Activity
Put the words in the correct order.
సరైన క్రమంలో అమర్చండి.
Hint
ఉదయాన్నే తీసుకునే ఆహారం.Question 1 of 3
Help
Activity
Put the words in the correct order.
సరైన క్రమంలో అమర్చండి.
Hint
ఉదయాన్నే అంబలి తీసుకుంటాడట.Question 2 of 3
Help
Activity
Put the words in the correct order.
సరైన క్రమంలో అమర్చండి.
Hint
రాత్రి భోజనం సంగతి.Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
What do you eat for breakfast?
ఉదయాన్న ఏం తీసుకున్నావు?I usually eat ______ for breakfast.
ఉదయాన్న సాధారణంగా నేను ______ తీసుకుంటూ ఉంటాను.I always eat ______.
నేనెప్పుడూ ______ తింటాను.What about you?
మరి నీ సంగతేమిటి?lunch
మధ్యాహ్నపు భోజనంdinner
రాత్రి భోజనంporridge
అంబలిfruit
పళ్లుfish stew
చేపల పులుసుchicken and rice
కోడిమాంసం, అన్నం