Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 5

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్‌ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 5 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

A can of worms

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్‌ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో, బావున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ - “a can of worms” అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా?
ఇక్కడ - పిన్‌ ‘worms’ , పురుగుల గురించి చాలా పరిశోధన చేసాడట, ఫేఫెకి తను కనుక్కున్న విషయాలు చెప్తున్నాడు, విందాం పదండి.

Finn
Worms are great – don't you think they're really interesting?

Feifei
Erm, yeah, kind of. But what's today's phrase?

Finn
Yeah, yeah, yeah, we'll come to that in a minute. But, did you know earthworms, the kind
you normally find in the soil, are both male and female in one body?

Feifei
That is quite interesting.

Finn
And if you cut a worm in half – only one part of the worm will die!

Feifei
Oh yes, the part with the fat little bump on it will survive. I knew that.

Finn
Fascinating, isn't it? And earthworms can be really short – from only one millimetre – to a massive three
metres!

కల్యాణి
ఫిన్‌ ‘earthworms’ వానపాముల గురించి చెప్తున్నాడు. ‘female’ – ఆడా, ‘male’ మగా – రెండు భాగాలూ దాని ఒక్క దేహంలోనే ఉంటుందని తెలిసిందట అతనికి. వానపామును మధ్యలోకి కోసిన తర్వాత కూడా అది ‘survive’, జీవించి ఉండగలదనీ, ‘three metres’ మూడు మీటర్ల పొడుగు దాకా పెరగగలదని కూడా తెలిసింది.

Feifei
Finn, hang on a second, why are we talking about worms so much?

కల్యాణి
అసలు ఫిన్‌ పురుగుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో విని చూద్దాం.

Finn
Sorry, yes, I was doing some research for today's programme. The phrase, today, is: a can of worms!

Feifei
Right. Well 'a can of worms' is a phrase we use to describe a situation that causes a lot of problems when you start to deal with it.

Finn
Yes, sometimes you want to deal with a problem, but you realise that by dealing with that problem it will open up a whole set of new problems.

కల్యాణి
ఫిన్‌ పురుగుల గురించి ఆసక్తికరమైన విషయాలనేకం చెప్పేడు సరే – కానీ worms గురించి అంతగా ఎందుకు మాట్లాడుతున్నాడో ఫెఫెకి అర్ధం కాలేదు – అదే అడిగింది. ఈ రోజు మాట్లాడుకోబోయే phrase, పదం - ‘a can of worms’, పురుగుల నుంచిన డబ్బా కదా, దాని కోసం బోలెడు research చేసాడట ఫిన్‌ - భలేవాడే.

అప్పుడు ఫేఫె చెప్పింది - ఏదన్నా ఒక పరిస్థితి - అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని చెప్పే సందర్భంలో ‘a can of worms’ అనే మాటను వాడతారు, అని. పరిస్థితి - ‘can’, సమస్యలు -‘worms’.

ఒకసారి can ని గనకా open చేసామంటే పురుగులు బయటకొచ్చేస్తాయిగా - వాటిని మళ్లీ లోనికి పంపడం సులభం కాదు కదా. అందుకే – తీర్చడానికి కష్టమయ్యే సమస్యల వలయంలో చిక్కుకుంటాం సుమా అనే అర్ధంలో ఈ పదప్రయోగం చేస్తాం.

ఇవిగో కొన్ని ఉదాహరణలు :
వేర్వేరు సందర్భాల్లో ఈ phrase వాడకాన్ని విని, ఏది 'can’, ఏవి 'worms’ అనేది  - చెప్పగలరేమో చూడండి.

Examples

When Frank asked why his brother arrived late to the party, his brother started telling Frank all about the problems in his life: his car, his health, problems with his friends… Frank realised he'd opened a can of worms.

A: Charles, have you finished writing that report about our fantastic sales figures this month?
B: No, because actually I realised our sales figures are all wrong. Someone has been giving us false information for months…
A: Oh no, what a can of worms.

Finn

Yes, well anyway – I hope everyone listening understands the phrase now. I think I'll get back to my reading. 34,000 different kinds of worm, wow… They can live for up to 10 years!

Fascinating… They eat their own weight every day…

Feifei
OK, well I think we've lost Finn there. I think I've had enough of worms for one day.

కల్యాణి
పురుగుల గురించి ఇంకా విశేషాలు కనుక్కుంటాడనుకుంటా ఫిన్, మనం పోదాం లెండి. మీరెప్పుడైనా ‘can of worms’ ను తెరిచారా? అప్పుడేమయింది? చిరాకు పడ్డారా? Join us next time for more of “The English Expressions”.

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

.

 

can of worms

3 Questions

Choose the correct answer.
సరైన జవాబును గుర్తించండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • earthworm
  వానపాము
  soil
  మట్టి
  can
  డబ్బా
  survive
  జీవించి ఉండు
  deal with
  వ్యవహరించు