Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 2

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.Session 2 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Treading on Eggshells

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి
Listen to the audio and take the quiz

Show transcript Hide transcript

కల్యాణి
హలో, బావున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ 'treading on eggshells' గుడ్డు పై పెంకులపై నడవడం - అన్న ప్రయోగాన్ని చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా ? ఊఁ...ఇక్కడ విని చూడండి.
సరుకులు కొనుక్కోడానికి Li దుకాణానికెళ్లిందట, ‘‘అక్కడ గొప్ప చిక్కులో పడ్డాను, 'tricky' అనిపించింది’’ అంటోంది Li. ఏమిటో ఆ ఇబ్బంది?! ఎందుకు tricky అనిపించిందో కనుక్కుందాం పదండి.

Rob
Hi Li. It looks like you've been busy.

Li
I've just picked up some groceries from the local shop, you know - milk, eggs, bread, flour – I'm going to make a cake.

Rob
Oh good. So how was Mr Brown, the shopkeeper? Hasn't he just split up with his wife?

Li
He has. It was tricky in the shop. I didn't want to say anything to him just in case I mentioned his wife. I only said: "Good morning" and he said: "Is it?"

కల్యాణి
దుకాణదారు బ్రౌన్‌, అతని భార్యా - ఇద్దరూ ‘split up’, విడిపోయారట. అందుకే అతని భార్య ప్రసక్తి తన మాటల్లో తేకూడదూ అనుకుంది కూడాను. సున్నితమైన సందర్భం sensitive situation అని - అంతా జాగ్రత్త పడి - Li ఊరికే ‘good morning’ అని అందిట. అతను ‘is it?’ అన్నాట్ట. మరే, బ్రౌన్‌కు ఆ ఉదయం శుభం అనిపిస్తుందా చెప్పండి. విషయం అర్ధమైయాక Rob ఏమంటున్నాడో విందాం రండి.

Rob
Hmm, it sounds like you've been treading on eggshells.

Li
Oh no, the shop was very clean, nothing on the floor – I don't really think he's the sort of person to throw food around!

Rob
No Li – I mean you were trying very hard not to upset him – that's what treading on eggshells means.

Li
Oh! So it's about being nice - it's about being sensitive to the situation?

Rob
Yes.

Li
Well, I was very sensitive. But what have eggshells got to do with it?

Rob
Well, if there were eggshells on the floor literally you would have to be very careful where you put your feet!

కల్యాణి
బ్రౌన్‌ కెక్కడా బాధ కలక్కుండా - Li జాగ్రత్త పడాల్సి వచ్చింది కదా, అందుకే Li పని 'treading on eggshells' లా ఉంది అని రాబ్‌ అన్నాడు. ఇప్పుడిప్పుడే మీ ఫ్రెండ్‌కి బ్రేకప్ జరిగి తన ప్రేమ విషయంలో బాధగా ఉన్నారనుకోండి, ఆవిషయం గుర్తుచేసి అతని బాధనింకా పెంచాలనుకోరుగా... ఏం?
ఇంతకీ - treading on eggshells – అంటే మనం తెలుగులో అంటామే - ఆచితూచి మాట్లాడ్డం, అనీ – అలాటిదన్న మాట. ఆ అర్ధం వచ్చే మాటలు మీరుండే ప్రాంతంలో వేరే ఏమన్నా ఉన్నాయేమో – ఆలోచించి చెప్పండి.
ఇదిగో ఈ ఉదాహరణల్ని విని చూడండి:

Examples:

I had to be so careful with what I said to my ex-girlfriend. The smallest thing made her angry: it was like treading on eggshells.

Ever since my argument with my neighbour about parking, I feel like I've been treading on eggshells.

Since my friend's father died, I don't know what to say to him: it's like treading on eggshells.

Li
So, treading on eggshells can be awkward because you don't know what to say and you don't want to offend someone. So Rob, what should I have said to Mr Brown?

Rob
You could have said 'plenty more fish in the sea!'

Li
What?!

Rob
Or… 'I didn't like her much anyway'?

Li
Rob, I think that's the opposite of treading on eggshells.

Rob
Really? Anyway let me help you with your shopping… oops (Rob drops the eggs!).

Li
Rob! You've dropped the eggs all over my kitchen floor.

Rob
Now you really will be walking on eggshells!

Li
That's not funny.

Rob
I didn't like your cakes much anyway.

కల్యాణి
అయ్యయ్యో, రాబ్‌ చేతిలోంచి గుడ్లన్నీ జారిపోయాయి. Li వంటింటి నేల నిండా చిందరవందరగా పగిలి పోయాయి. ఇప్పుడు నిజంగానే గుడ్డు పెంకులపై నడవాల్సి ఉంటుంది వాళ్లకి. అది సరేగానీ, treading on eggshells అనే ప్రయోగానికి అర్ధం మాత్రం ఎదుటివారికి ఇబ్బంది కలిగించకూడదని జాగ్రత్త పడడం అన్న మాట.
ఔనూ, మీకెప్పుడైనా ఇలా treading on eggshells వంటి పరిస్థితి వచ్చిందా?

“English Expressions ”లో మమ్మల్ని మళ్లీ కలిసి మరిన్ని కొత్త ప్రయోగాల గురించి వినండి.

Check what you’ve learned by selecting the correct option for the question.
సరైన జవాబును గుర్తించి, మీరు నేర్చుకున్న దానిని చెక్ చేసుకోండి.

Treading on Eggshells

3 Questions

Choose the correct option.

సరైన జవాబును గుర్తించండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరిన్ని పద ప్రయోగాల వాడకం నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • groceries 
  కిరాణా సరుకులు

  shopkeeper
  దుకాణాదారుడు

  eggshells 
  గుడ్ల పై పెంకులు

  upset
  బాధ పెట్టు

  sensitive 
  నాజూకైన

  awkward 
  ఇబ్బందికరమైన

  offend 
  మనస్సు నొప్పించు