భారత్ గత 60 ఏళ్లుగా ఏమీ సాధించలేదా?

‘కాంగ్రెస్ పార్టీకి ఆధునిక దేశం అక్కర్లేదు. వారికి అవసరాలతో కూడిన దేశమే కావాలి..’ అని ప్రధాని మోదీ ఫిబ్రవరి 7న రాజ్యసభలో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో పేర్కొన్నారు. పలు బహిరంగ సభల్లోనూ మోదీ.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం ఏమీ సాధించలేదని చెప్పారు. మరి ఇది నిజమా?