Phần 23

Listen to find out how to give directions in English.
ఇంగ్లిష్‌లో దారి చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.

Các phần trong bài này

0 / 4

  • 0 / 4
    Bài tập 1

Bài tập 1

How do I give directions?

Listen to Simon asking three strangers for directions to the bus staion – is the route they give Simon the same?
Simon బస్ స్టేషన్‌కు వెళ్లాలి. కానీ దారి తెలీదు. ముగ్గురు అపరిచితులను దారి అడిగారు. ఆ ముగ్గురూ అతనికి చెప్పిన దారి ఒకటేనా? వినండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

సౌమ్య 
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు. 

Sam
Hello! And welcome! 

సౌమ్య 
ఇవాళ, ఇంగ్లిష్‌లో directions అంటే దారి చూపడం ఎలాగో తెలుసుకుందాం. Simonకు బస్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ముగ్గురు అపరిచితులను అడిగారు. వాళ్లు ఎలా జవాబు చెప్పారో విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. వాళ్లు ముగ్గురూ Simon కు ఒకే దారి చెప్పారా? లేక వేరు వేరు దారులా? వినండి. 

Excuse me! Where's the bus station, please? 

1.      Go straight on, take the first road on the left, and it'll be on your right. 

2.      Go straight down here, take the first road on your left, and it's on the right. 

3.      Just go straight, turn left at the supermarket. It'll be on the right.

సౌమ్య
గమనించారా? ముగ్గురూ మూడు విధాలుగా చెప్పినా ఒకే దారి చూపించారు. 

Sam
So let's look at those different phrases they used. 

సౌమ్య
వాళ్లు ముగ్గురూ వాక్యాలను ఎలా మొదలుపెట్టారో మరోసారి విందాం. 

Go straight on…

Go straight down here…

…just go straight… 

సౌమ్య
అందరూ కూడా ‘go straight’..తిన్నగా వెళ్లు అనే చెప్పారు. కాకపోతే మూడు రకాలుగా చెప్పారు. మొదటి వ్యక్తి ‘go straight on’ అన్నారు. రెండో వ్యక్తి ‘go straight down here’ అన్నారు. 

Sam
You can even say 'go straight up here'! Let's practise the pronunciation. Repeat after me: 

‘Go straight on’. 

‘Go straight down here’. 

సౌమ్య
ముగ్గురూ ‘take’ అనే క్రియ వాడారు. ఎలా వాడారో మళ్లీ విందాం. ప్రతీ వాక్యంలోనూ ఈ క్రియ తరువాత ఏమొస్తోందో జాగ్రత్తగా గమనించండి.

…take the first road on the left…

…take the first road on your left… 

సౌమ్య
Ok, ‘take’ తరువాత 'the first road'..మొదటి రహదారి అని వచ్చింది. 'The second road', 'the third road'..ఇలా ఏదైనా చెప్పొచ్చు. తరువాత 'on the left'..ఎడమచేతి వైపు అని చెప్పారు. 'On the right' అంటే కుడిచేతివైపు. 

Sam
And here, you can use 'on the' or 'on your' before 'right' and 'left'. Shall we practise?

Repeat after me: 

‘Take the first road on the right’. 

‘Take the second road on your left’. 

సౌమ్య
తరువాత ‘turn’ అని కూడా వాడారు కదా. ఈ క్రియను ఎలా వాడారో చూద్దాం.

…turn left at the supermarket.

Sam
Left or right! 

సౌమ్య
Yes! ఏదైనా landmark-మైలురాయి దగ్గర తిరగండి అని చెప్పాలంటే ‘at’ అని వాడి ఆ landmark ఏమిటో చెప్పాలి. లేదా వేరే మార్గంలోకి వెళ్లమని చెప్పాలంటే ‘on’ అని వాడి ఆ మార్గం పేరు చెప్పాలి. 

Sam
Quick practice! Repeat after me: 

‘Turn left at the supermarket.’ 

‘Turn right on King’s Road.’

సౌమ్య
చివరిగా, Simon కు గమ్యం తెలుపడానికి వాడిన పదాలు ఏవి?

…and it’ll be on your right.

…and it’s on the right.

It’ll be on the right. 

Sam
They used 'on the' or 'on your' before 'right' and 'left' again. And before that? 

సౌమ్య
Before that, ‘it'll be' అన్నారు. 'it will be' కు కుదింపు ‘it'll be' అవుతుంది. 'It’s' అని కూడా అన్నారు. రెండింటికీ అర్థం ఒకటే. 

Sam
And repeat after me: 

‘It's on the left’. 

‘It'll be on the right’. 

సౌమ్య
ఇప్పుడు కొంచం ప్రాక్టీస్ చేద్దాం. బ్యాంక్‌కు వెళ్లడానికి మిమ్మల్ని దారి అడిగారనుకుందాం. ఎలా చెప్తారు? తరువాత Sam కూడా చెబుతారు. మీరు సరిగ్గా చెప్పారో లేదో సరిచూసుకోండి. మొదట, తిన్నగా వెళ్లమని చెప్పండి. ‘On’ వాడండి. 

Sam
Go straight on… 

సౌమ్య
Great! ఇప్పుడు ఆ సినిమా హాల్ దగ్గర ఎడమవైపు తిరగమని చెప్పండి. ‘At’ అని వాడాలి. గుర్తుంది కదా?!

Sam
Turn left at the cinema…

సౌమ్య
చివరిగా అక్కడ ఎడమవైపు ఉంది అని చెప్పాలి. 'On the' అని వాడడం మరచిపోకండి. 

Sam
It's on the left. 

సౌమ్య
Well done! ఇప్పుడు మీరు ఎవరికైనా, ఎక్కడికైనా సులువుగా దారి చెప్పేయగలరు!

Sam
Excellent! So can you help me get out of the studio…

సౌమ్య
Turn right, Sam! 

మరో ఎపిసోడ్‌లో 'How do I…'? మళ్లీ కలుసుకుందాం. Bye! 

Sam
Left or right? See you next time! Bye, everyone!

 

Learn more!

1. ఒకే దిశలో ప్రయాణం కొనసాగించమని ఎలా చెప్పాలి?

'Go straight' అని చెప్పొచ్చు. ఇదే పదాన్ని చిన్న చిన్న వైవిధ్యాలతో ఈ కింది విధాలుగా కూడా చెప్పొచ్చు.

  • Go straight on…
  • Go straight down here…
  • Go straight up here…

 2. దారి మార్చమని ఎలా చెప్పాలి?

ఎడమవైపు తిరగండి - 'turn left' అని చెప్పొచ్చు. లేదా కుడివైపు - 'turn right' అని చెప్పొచ్చు. ఎక్కడ తిరగాలో అక్కడ ఏదైనా landmark ఉంటే అది బిల్డింగ్ అయితే 'at' అని వాడి ఆ బిల్డింగ్ పేరు చెప్పాలి. లేదా ఏదైనా మార్గంలోకి తిరగాలంటే 'on' అని వాడి ఆ మార్గం పేరు చెప్పాలి.

  • Turn left at the cinema.
  • Turn right on Queen Street.

'Take' అని వాడి ఫలానా దారిలోకి లేదా ఫలానా వీధిలోకి వెళ్లండి అని చెప్పొచ్చు.

  • Take the first road on the left.
  • Take the second road on your right.

మనం 'on the left' లేదా 'on your left' అని చెప్పొచ్చు. కానీ 'first', 'second', ‘third' అని చెప్పేటప్పుడు మాత్రం కచ్చితంగా 'the' వాడాలి. 

3. గమ్యస్థానం గురించి చెప్పడం ఎలా?

చివరిగా 'it's' (it is) లేదా 'it'll be' (it will be) అని మొదలుపెట్టి 'on the/ your right/ left' అని చెప్పొచ్చు.

  • It's on the right.
  • It'll be on your left.

4. దారి చెప్పడానికి ఎలాంటి క్రియాపదాలు వాడాలి? ఏ కాలాలు వాడాలి?

ఇక్కడ క్రియాపదాలను 'imperlative form' లో వాడాలి.  సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి కూడా ఇదే వాడతాం.  అంటే క్రియ యొక్క infinitive form ను వాక్యం మొదట్లో పెట్టాలి.

  • Go straight on, take the first road on the left, turn left at the cinema.

How do I give directions?

4 Questions

Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join our Facebook group to practise more!
మా ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అయి, మరిన్ని విషయాలు నేర్చుకోండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • left
    ఎడమ 

    right
    కుడి

    the first…
    మొదటిది..

    the second…
    రెండోది…

    road
    మార్గం

    supermarket
    సూపర్‌మార్కెట్

    cinema
    సినిమా హాల్