1

Bài 1: Essential English Conversation

Bộ phận chọn bài

 1. 1 Essential English Conversation

Phần 34

Listen to find out how to ask someone if they have any hobbies.
ఎవరినైనా వాళ్ల ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు అని అడగడం ఎలాగో విని తెలుసుకోండి.

0 / 3

 • 0 / 3
  Bài tập 1

Bài tập 1

ఖాళీ సమయాల్లో మీరేం చేస్తుంటారు?

Listen to find out how to ask about what people do in their spare time.
ఎవరినైనా వాళ్ల ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు అని అడగడం ఎలాగో విని తెలుసుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

సౌమ్య

హలో! బావున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి  తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు.నా పేరు సౌమ్య.ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎవరినైనా, వాళ్ల ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు అని అడగడం ఎలాగో తెలుసుకుందాం.

ఇదిగో వీళ్ళిద్దరూ ఖాళీ సమయాల్లో ఏం చేస్తారో మాట్లాడుకుంటున్నారు. విందాం.

Sam

What do you do in your spare time?

Rob

I play the guitar in a band. What about you?

Sam

I like exercising.

సౌమ్య

కాస్త కష్టంగా ఉందా! మరేం పర్లేదు...దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి.

మొదట Sam, Rob ను మీరేం చేస్తుంటారు….? ‘What do you do…..?’ అని మొదలెట్టి…..మీకున్న ఖాళీ సమయాల్లో  ‘in your spare time’ అని చివర్లో కలిపింది. విని, మళ్ళీ చెప్పండి.

What do you do in your spare time?

సౌమ్య    

అప్పుడు Rob... ‘I play the guitar in a band’... నేను ఒక వాయిద్యబృందం లో గిటార్ వాయిస్తాను అన్నాడు.ఇక్కడ‘play’అంటే సంగీత వాయిద్యాలను వాయించడం అన్నమాట. ‘Band’ అంటే వాయిద్య బృందం లేదా మేళం.

I play the guitar in a band


సౌమ్య                                                          

అప్పుడు Rob, Sam ని అదే ప్రశ్న మళ్ళీ అడగడానికి‘what about you?’  అన్నాడు. విని మళ్ళీ చెప్పండి.

What about you?

సౌమ్య                                                          

చివరిగాSam,తనకి వ్యాయామం చెయ్యడం ఇష్టం అని చెప్పింది.మనకి ఏదైనా ఇష్టమైనది చెయ్యడాన్ని వివరించాలంటే  ‘I like’ అని వాడి చివర్లో ఆ పదానికి‘–ing’ కలిపి చెప్పొచ్చన్నమాట. విని మళ్ళీ చెప్పండి.

I like exercising.


Great...ఇప్పుడు, వీళ్ళంతా ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారో దాని గురించి మాట్లాడుకుంటున్నారు.  వింటూ, మీ జవాబులు సరిచూసుకోండి.

What do you do in your spare time?

I go fishing by the river. What about you?

I like playing sports.

 

What do you do in your spare time?

I play basketball with my friends. What about you?

I like meeting friends.

సౌమ్య                                                                                 

Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లిష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి. ఈసారి ఒక్కొక్కటీ రెండేసిసార్లు వస్తుంది...వినండి.

What do you do in your spare time?

What do you do in your spare time?

 

I play the guitar in a band.

I play the guitar in a band.

 

What about you?

What about you?

 

I like exercising.

I like exercising.

సౌమ్య                                                                                

Great! ఈ ఇంగ్లిష్‌ను మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం.  ! ఏదీ ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లిష్‌లో అనండి.

ఖాళీ సమయాల్లో మీరేం చేస్తుంటారు?

What do you do in your spare time?

నేను ఒక వాయిద్యబృందంలో గిటార్ వాయిస్తాను.

I play the guitar in a band.

మీ సంగతేంటి?

What about you?

నాకు వ్యాయామం చెయ్యడం ఇష్టం.

I like exercising.

సౌమ్య                                                                                

Fantastic, OK, ఇప్పుడు మీకు ఎవరినైనా వాళ్ళ ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారో అడగడం వచ్చేసింది. Sam కు జవాబిస్తూ ప్రాక్టీస్ చెయ్యండి. What about you?అని వాళ్ళను కూడా అడగడం మర్చిపోకండి.

What do you do in your spare time?

I like exercising.

సౌమ్య                                                                                

Great,ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Sam

What do you do in your spare time?

Rob

I play the guitar in a band. What about you?

Sam

I like exercising.

సౌమ్య

Well done, భలే చక్కగా చేశారే! ఇప్పుడు మీరు ఎవరినైనా ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు అని ఇంగ్లిష్‌లో చక్కగా అడిగేయగలరు. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి.  రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

ఖాళీ సమయాల్లో మీరేం చేస్తుంటారు?

3 Questions

Put the words in the correct order.
సరైన క్రమంలో అమర్చండి.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

 • What do you do in your spare time?
  ఖాళీ సమయాల్లో మీరేం చేస్తుంటారు?

  I play the guitar in a band.
  నేను ఒక వాయిద్యబృందం లో గిటార్ వాయిస్తాను.

  I like exercising.
  నాకు వ్యాయామం చెయ్యడం ఇష్టం.

  I go fishing by the river.
  నేను చెరువులో చేపలు పట్టడానికి వెళుతుంటాను.

  I like playing sports.
  నాకు ఆటలు ఆడడం ఇష్టం.

  I play basketball with my friends.
  నేను నా స్నేహితులతో బాస్కెట్‌బాల్ ఆడుతాను.

  What about you?
  మీ సంగతేంటి?