1

Bài 1: Essential English Conversation

Bộ phận chọn bài

  1. 1 Essential English Conversation

Phần 13

Listen to find out how to ask for detailed directions.
దారి కనుక్కుంటున్నప్పుడు దిశల గురించిన వివరాలు ఇక్కడ విని నేర్చుకోండి.

 

0 / 3

  • 0 / 3
    Bài tập 1

Bài tập 1

How do I get to...?

Listen to find out how to ask for detailed directions.
దారి కనుక్కుంటున్నప్పుడు దిశల గురించిన వివరాలు ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

కల్యాణి
హలో! బావున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. మీరుండే ఊళ్లో ఏ చోటకైనా చేరడమెలా అని అడిగి తెలుసుకోడం ఇవాళ నేర్చుకుందురు గాని.

ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.

Phil
How do I get to the supermarket?

Sam
Turn left, go straight on, turn right, it’s on Queen Street.

Phil
Thanks!

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదటా ...

Phil 'supermarket' కి ఎలా వెళ్లాలో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం 'How do I get to…' 'ఎలా చేరుకోవాలి …' అనే వాక్యానికి “the supermarket” కలిపి చెప్పాడు. . వినీ తిరిగి మీరూ అనండి.

How do I get to the supermarket?

కల్యాణి
అప్పుడు Sam అతనికి ఏపక్కకెళ్లాలో దారి చెప్పింది. ముందు అతన్ని 'turn left'. ఎడమవైపు తిరగమంది. తర్వాత అతన్ని 'go straight on' తిన్నగా వెళ్లమంది, ఆఖర్న 'turn right' కుడి వైపు తిరగమని చెప్పింది. వినీ తిరిగి మీరూ అనండి.

Turn left 

Go straight on 

Turn right 

కల్యాణి
ఆ తర్వాత - 'it is on Queen Street' అది Queen Street మీద ఉంది అని చెప్పింది. 'it’s on…' అంటే ఫలానా వీధి అని అర్ధం వస్తుంది కనక మనం వీధి పేరు చివర్న చేర్చి చెప్పుకోవచ్చు. వినీ తిరిగి మీరూ అనండి.

It’s on Queen Street

కల్యాణి
తనకి సహాయపడినందుకు Phil 'thanks!' అని చెప్పాడు. మీరూ అనండి.

Thanks

కల్యాణి
సరే – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా దారి కనుక్కుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.

Pete 'bank' కి వెళ్లాలి.

How do I get to the bank?

Turn right, go straight on, turn left, it’s on Perth Road.

Thanks!

Claire 'post office'కి వెళ్లాలి.

How do I get to the post office?

Go straight on, turn right, turn left, it’s on South Street.

Thanks!

కల్యాణి
Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి.

How do I get to the supermarket?

Turn left. 

Go straight on 

Turn right. 

It’s on Queen Street. 

Thanks!

కల్యాణి
Great! ఈ ఇంగ్లిష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లిష్‌లో అనండి.
supermarketకి ఎలా వెళ్లాలి?

How do I get to the supermarket? 

ఎడమ పక్కకి తిరగండి. 
Turn left.

తిన్నగా వెళ్లండి. 
Go straight on

కుడి పక్కకి తిరగండి.
Turn right.

అది Queen Street మీద ఉంది. 
It’s on Queen Street.

Thanks! 

Thanks! 

కల్యాణి
Fantastic – ఇంగ్లిష్‌లో దారి ఎలా చెప్పాలో తెలిసింది కదా. మరి Phil ప్రశ్నకు జవాబివ్వండి.

How do I get to the supermarket?
--------------------
Thanks!

కల్యాణి
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Phil
How do I get to the supermarket?

Sam
Turn left, go straight on, turn right, it’s on Queen Street.

Phil
Thanks!

కల్యాణి
Well done, భలే చక్కగా చేశారే, ఇప్పుడు మీరు ఇంగ్లిష్‌లో- ఎక్కడికి చేరుకోవాలన్నా దారి చెప్పగలరు, ఎదుటివారిని అడిగి తెలుసుకోగలరు. ఇక మీ మిత్రులతో కలిసి ఇంగ్లిష్‌లో అభ్యాసం చేస్తూ ఉండండి.
రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by putting the words in the correct order.
పదాలను సరైన వరసలో పెట్టి మీరు నేర్చుకున్న విషయాన్ని చెక్ చేసుకోండి

How do I get to….?

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

 

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

  • How do I get to ______?
    ______ఎలా చేరుకోవాలి?

    the supermarket
    సూపర్‌మార్కెట్

    the bank
    బేంక్

    the post office
    పోస్ట్‌ ఆఫీస్

    Go straight on.
    తిన్నగా వెళ్లండి.

    Turn right.
    కుడి పక్కకి తిరగండి.

    Turn left.
    ఎడమ పక్కకి తిరగండి.

    It’s on ______.
    ______ వీధిలో ఉంది.

    Thanks!
    ధన్యవాదాలు!