1

Bài 1: Essential English Conversation

Bộ phận chọn bài

 1. 1 Essential English Conversation

Phần 1

Listen to find out how to ask for names and say your names
మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోడం ఎలాగో ఇక్కడ వినండి

0 / 3

 • 0 / 3
  Bài tập 1

Bài tập 1

పరిచయం చేసుకోవడం

పరిచయం చేసుకోడం ఎలాగో ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to find out how to ask for names and say your names

ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

కల్యాణి
హలో! బాగున్నారా? ఇంగ్లీష్ సంభాషణలకు స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి అత్యవసరమైన విషయాలను మీరిక్కడ చూస్తారు – వీటిని నేర్చుకోడం ఈ భాషకు తప్పనిసరి. నా పేరు కల్యాణి. కొత్తవారితో పరిచయం చేసుకోడం ఎలాగో ఈ సంచికలో, మీకు తెలుస్తుంది.

ఇదిగో ... వీరిద్దరూ మొదటి సారి కలుసుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారో వినండి మరి.

Sian
Hello, I'm Sian. What's your name?

Phil
Hi. My name's Phil. Nice to meet you.

Sian
Nice to meet you too!


కాస్త కష్టంగా ఉందా ... ... ... మరేం పర్లేదు. మీరు సులువుగా సాధన చేసుకోడానికి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందిస్తాం, సరేనా ...

మొదట - ‘‘నేను షాన్‌’’, ‘Hello I’m Sian.’ అంది షాన్. అలాగే మీరు కూడా 'Hello I'm…' అని, ఆ తర్వాత మీ పేరు చెప్పండి.
ఏదీ, ఒక సారి విని మీరూ అనండి.

Hello, I'm Sian.

కల్యాణి
తర్వాత ’నీ పేరేమిటి?’ ‘what’s your name?’ అని ఫిల్‌ని షాన్ అడిగింది. ఇదిగో ఇలా ... విని మళ్లీ అనండి.

What's your name? 

కల్యాణి
తన పేరు చెప్పడానికి ఫిల్ వేరే పద్ధతి వాడాడు – అతను 'నా పేరు ', ‘my name is…’ అన్నాడు. మీరు ‘I’m...’అని గానీ ‘my name’s…’ అని గానీ చెప్పి తర్వాత మీ పేరు చెప్పొచ్చు.
ఉదాహరణకి నేనైతే ‘నేను కల్యాణిని’, అంటాను, లేదంటే ‘నా పేరు కల్యాణి’ అనైనా అంటాను. ఏదీ, ఇప్పుడు ఈ మాటల్ని విని మీరూ అనండి.

My name's Phil

కల్యాణి
తన పేరు చెప్పా క ఫిల్‌, 'నిన్ను కలవడం నాకు సంతోషంగా ఉంది', ‘nice to meet you,’ అన్నాడు. విని మీరూ అనండి.

Nice to meet you. 

కల్యాణి
షాన్‌ కూడా ‘nice to meet you అంది. కానీ  ‘too’, ‘కూడా’ అన్న పదం తన వాక్యానికి చేర్చింది. ఎదుటి వారంటున్న విషయమే మీరూ అంటున్నప్పుడు ‘too’ అన్న పదం మీ వాక్యం చివర చేర్చాలి. ఇదిగో వీటిని విని మీరూ అనండి

Nice to meet you too.

కల్యాణి
అన్నారా?! ఇదిగో మరి వీళ్ల మాటలు విని చూడండి, వీళ్లూ మొదటి సారే కలుసుకుంటున్నారు. విన్నాక మీరూ అలాగే అంటున్నారో లేదో చూసుకోండి.

Hi, I'm Pete. What's your name?

Hi. My name's Mark. Nice to meet you.

Nice to meet you too!

Hi, I'm Alice. What's your name?

Hi. My name's Claire. Nice to meet you.

Nice to meet you too!

కల్యాణి
సరే, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి.

Hello, I'm Sian. What's your name?

Hi, My name's Phil. Nice to meet you.

Nice to meet you too! 

కల్యాణి
సరే, ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ వాక్యాల్ని తెలుగులో విని వాటిని మీరు ఇంగ్లీష్‌లో అనండి.

'హలో, నేను షాన్‌ని'. 

'Hello, I’m Sian'.

కల్యాణి
'నీ పేరేమిటి'?

'What’s your name'?

కల్యాణి
'హాయ్‌, నా పేరు ఫిల్'. 

'Hi. My name’s Phil'.

కల్యాణి
నిన్ను కలవడం నాకు సంతోషంగా ఉంది. 

'Nice to meet you'.

కల్యాణి
'నిన్ను కలవడం నాకు కూడా సంతోషంగా ఉంది'. 

'Nice to meet you too'.

కల్యాణి
బ్రహ్మండం – ఇంగ్లీష్‌లో మీ పేరు చెప్పడం, ఎదుటి వారి పేరు అడగడం - రెండూ ఇప్పుడు మీకు తెలిశాయి కదా. మరి మీ పేరు చెప్తూ Sian ప్రశ్నకు జవాబివ్వండి.

'Hello, I’m Sian. What’s your name'? 
'Nice to meet you too'!

కల్యాణి
భలే, ఇప్పుడు మొత్తం సంభాషణంతా పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Sian
Hello, I'm Sian. What's your name?

Phil
Hi. My name's Phil. Nice to meet you.

Sian
Nice to meet you too!

కల్యాణి
భలే చక్కగా చేశారే, ఇప్పుడు ఇంగ్లీష్‌లో మీ పేరూ మీరు చెప్పగలరు, ఎదుటి వారి పేరూ అడగగలరు. మీరు నేర్చుకున్నది సాధన చెయ్యడం మర్చి పోకండేం! ఎవరన్నా ఒక మిత్రునితో కలిసి ఇంగ్లీష్‌లో పేరు చెప్పడం, అడగడం అనే అభ్యాసం చేస్తూ ఉండండి.
అన్నట్టు ‘Nice to meet you’ అనడం మర్చపోకండి సుమా! రోజు వారీ ఇంగ్లీష్‌ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

 

సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.
Check what you’ve learned by choosing the correct answer to the question.

What's your name?

3 Questions

జవాబును గుర్తించి మీరింతవరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

Check what you've learned by selecting the correct answer to each question.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Session Vocabulary

 • hello
  హెలో

  hi
  హాయ్ 

  name
  పేరు

  nice
  బాగుంది

  meet
  కలవడం

  you
  నువ్వు, నిన్ను