Session 3

Listen to find out how to compare more than two things in English.
రెండు కంటే ఎక్కువ అంశాలను ఎలా కంపేర్ చెయ్యాలో విని తెలుసుకోండి.

ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 3

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

How do I compare more than two things?

ఇవాల్టి ఎపిసోడ్‌లో ఈ కింది ఆహారపదార్థాల గురించి మాట్లాడుకోబోతున్నాం.

Japanese food

Mexican food

Italian food

English food

మీకు వీటిల్లో ఏది ఎక్కువ ఇష్టం? వీటిని ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి. తరువాత ఇవాల్టి పాఠం విని, ఈ విషయాలను ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో నేర్చుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు. 

Sam
Hello, everybody. Welcome! 

సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్‌లో రెండు కంటే ఎక్కువ అంశాలను ఎలా కంపేర్ చెయ్యాలో తెలుసుకుందాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వివిధ దేశాలలో భోజనం గురించి తమ అభిప్రాయాలను చెప్తున్నారు. విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ముందు విందాం.

 1. I think Japanese food is the nicest food in the world. It's definitely the tastiest.

2. Mexican food is the most delicious, in my opinion.

3. Of all the food in the world, Italian is the best! And English is the worst. 

సౌమ్య
Ah, I'm hungry now! వాళ్లందరూ food గురించి మాట్లాడుతున్నారు,  కదా! వివిధ దేశాల్లోని వంటకాల గురించి తమ ఆభిప్రాయాలు చెప్పారు. 

Sam
Yes, they talked about Japanese, Mexican, Italian and English food. So they were taking one type of food and comparing it to many others. 

సౌమ్య
అవును. ఇలా కంపేర్ చెయ్యడానికి విశేషణాలను వాడాలి…'nice', 'tasty', 'delicious', 'good', 'bad' – ఇలా ఏవై నా వాడొచ్చు. 

Sam
Let's listen again to the first speaker – how does he use the words 'nice' and 'tasty'? 

I think Japanese food is the nicest food in the world. It's definitely the tastiest. 

సౌమ్య
Ok, so ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన రూల్ ఏంటంటే అన్ని one-syllable విశేషణాలకు, చాలామటుకు two-syllable విశేషణాలకు ముందు 'the' వాడి, ఆ పదాల చివర్లో '-est' తగిలించాలి. Nice లాంటి పదాలకు చివర్లో ఎలాగూ ‘e’ ఉంటుంది కాబట్టి '-st' చేరిస్తే చాలు. 

Sam  
And in the case of 'tasty', the 'y' at the end changes to an 'I' in 'the tastiest'. This doesn't change the pronunciation, it's just when you’re writing. 

Let's quickly practise! Repeat after me:

‘the nicest’

‘the tastiest’

‘It's the nicest food in the world’.

‘It's the tastiest food in the world’. 

సౌమ్య
One-syllable, two-syllables అంటే ఏంటో ఇంతకుముందు పాఠాల్లో చెప్పుకున్నాం, మీకు గుర్తుందా? One-syllable అంటే ఆ పదంలో ఒకే ఒక అచ్చు ఉంటుంది. T wo-syllables అంటే రెండు అచ్చులుంటాయి. అయితే two-syllables కన్నా ఎక్కువ ఉన్న పదాలు 'delicious' లాంటివాటికి ఏం చెయ్యాలి? మళ్లీ విందాం.

Mexican food is the most delicious, in my opinion.

Sam
In this case, we don't change the adjective – 'delicious' stays 'delicious'. 

సౌమ్య
అవును. పదాన్ని మార్చకుండా ఆ పదానికి ముందు 'the most' అనే రెండు పదాలు చేరిస్తే చాలు. 

Sam
Yes, so ‘interesting' becomes 'the most interesting', 'exciting' becomes 'the most exciting', etcetera. Shall we practise the pronunciation? Repeat after me, please:

‘the most delicious’

‘It’s the most delicious food in the world’. 

And we just have two more to look at quickly! 

సౌమ్య
Yes, ఇంకో రెండు ఉండిపోయాయి కదా! అవి ఇప్పటివరకూ మనం చెప్పుకున్న రూల్స్ కి మినహాయింపులు. కాన్ని చాలా ముఖ్యమైన మినహాయింపులు. మళ్లీ విందాం. వీటిల్లో కూడా ‘the’ వస్తుంది, జాగ్రత్తగా వినండి.

Italian is the best! And English is the worst.

Sam
They were 'the best' and 'the worst'.

సౌమ్య
ఇవి మినహాయింపులు ఎందుకంటే good అనేది bad, worst గా మారిపోతుంది తప్పితే '-est' చేర్చకూడదు. 

Sam
So don’t say 'the goodest' or 'the baddest' – they're not correct! Repeat after me: 

‘the best’

‘the worst’ 

సౌమ్య
Now it's time for some practice.

ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అన్నిటికన్నా చౌకైన పద్ధతి ఏది?

'Alone with a book' - ఏదైనా పుస్తకం చూసి నేర్చుకోవడం, 'in class' - క్లాస్ రూంలో పాఠాలు, లేదా ‘online’ - ఆన్ లైన్ లో నేర్చుకోవడం. 'Cheap'అనే విశేషణాన్ని వాడుతూ మీకు ఏది చౌకగా అనిపిస్తోందో చెప్పండి. తరువాత Sam కూడా చెప్తారు. మీరు సరిగ్గా చెప్పారో లేదో చెక్ చేసుకోండి. 

Sam
Online is the cheapest way to learn English. 

సౌమ్య
Do you agree? వీటిల్లో ఏది అత్యంత ఆసక్తికరమైనది? 'Interesting'అనే విశేషణాన్ని వాడండి. తరువాత Sam అభిప్రాయంతో కంపేర్ చేసుకోండి.

Sam
Online with BBC Learning English is the most interesting way to learn English. Of course! 

సౌమ్య
Good point, Sam! 

Sam
Yes, because we're the best. 

సౌమ్య
So join us next week for another episode of 'How do I…'! Bye! 

Sam
Bye, everyone! 

 

Learn more

1) ఒకే విశేషణాన్ని ఉపయోగిస్తూ ఒకటి కంటే ఎక్కువ అంశాలను ఎలా కంపేర్ చెయ్యాలి?

One-syllable, two-syllable విశేషణాలకు ముందు 'the' పెట్టి, పదాల చివర్న '-est' తగిలించాలి.

subject + be + the (adjective + -est)

  • My mother's house is the cleanest house I know.

adjective ending in 'e' + -st (don’t double the 'e')

  • He's the nicest man I know.

adjective ending in 'y' + -iest (change 'y' for 'I')

  • She's the prettiest girl I know.

adjective ending in a single vowel plus a single consonant, double the final consonant + -est

  • London's the biggest city in the UK.

Two-syllables కన్నా ఎక్కువ ఉన్న పదాలకు ముందు 'the most' చేరిస్తే చాలు.

  • New York is the most exciting city in the world.
  • Mr Smith is the most interesting teacher in the school.

2) ఈ రూల్స్‌కు మినహాయింపులు ఏమైనా ఉన్నాయా?

Of course! ఈ కింద ఇచ్చిన పదాలు మినహాయింపులు. వీటిని గుర్తుపెట్టుకోండి.

  • good > the best (not 'the goodest')
  • bad > the worst (not 'the baddest’)
  • fun > the most fun (not 'the funnest')

How do I compare more than two things?

4 Questions

Choose the correct option to fill the gap.
ఖాళీలను పూరించండి.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

Come to our Facebook group to tell us what you think 'the best' food in the world it!
మీకు ప్రపంచంలో 'the best' food ఏది? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • nice
    చక్కని

    tasty
    రుచికరమైన

    delicious
    మధురమైన/ రుచికరమైన

    good
    మంచి

    bad
    చెడు/చెత్త

    cheap
    చౌక

    long
    పొడవైన

    fun
    సరదా

    pretty
    అందమైన

    lovely
    మనోహరమైన

    interesting
    ఆసక్తికరమైన

    exciting
    ఉత్తేజకరమైన