บทเรียนย่อย 17

Listen to find out how to talk about future arrangements.
సమీప భవిష్యత్తు ప్లానుల గురించి ఇంగ్లిష్‌లో చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 17

0 / 5

  • 0 / 5
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

How do I talk about future arrangements?

ఈ కింది వాటిల్లో సమీప భవిష్యత్తు గురించి చెప్పే వాక్యం ఏది?

I'll have dinner with my mother tomorrow.

I'm having dinner with my mother tomorrow.

I had dinner with my mother yesterday.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Phil కూడా ఉన్నారు.

Phil
Hello, everybody. Welcome!

సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్‌లో Future arrangements అంటే సమీప భవిష్యత్తు - రేపు, ఎల్లుండి లేదా రాబోయే వారంలో చేసుకునే ప్లానుల గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఇక్కడ నలుగురు వ్యక్తులు రేపటి ఏర్పట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. విందాం. పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. వీరిలో ఎవరు రేపటిరోజుని ప్రశాంతంగా గడపబోతున్నారు? జాగ్రత్తగా వినండి.

What are you doing tomorrow?

I'm having lunch with my mother.

I'm going to work as usual.

I'm not doing anything. It's my day off.

సౌమ్య
విన్నారా? అవును, చివరి వ్యక్తి రేపు ఏ పనీ లేకుండా ప్రశాంతంగా గడపబోతున్నారు. So, Phil, shall we look at the language we can use to talk about future arrangements?

Phil
Yes, let’s have a look!

సౌమ్య
ఇందాక సంభాషణలోని అన్ని వాక్యల్లోనూ సమీప భవిష్యత్తులో ఏర్పాట్ల గురించి చెప్పారు. ఆ వాక్యాల నిర్మాణంలో ఏ కాలం ఉపయోగించారు? ప్రశ్న ఒకసారి మళ్లీ విందాం.

What are you doing tomorrow?

సౌమ్య
It's the present continuous – వర్తమానకాలం – 'what are you doing'. ఈ కాలాన్ని సమీప భవిష్యత్తులోని ప్లానులను సూచించడానికి ఉపయోగించొచ్చు.

Phil
OK, let’s quickly practise the pronunciation together! Notice that when we say "What are you doing tomorrow" we pronounce 'are' as 'uh' 'What are you doing tomorrow?" Repeat after me:

‘What are you doing tomorrow?'

‘What are you doing tomorrow?'

సౌమ్య
Great! మొదటి వ్యక్తి ఏం జవాబు చెప్పారో మళ్లీ విందాం.

I'm having lunch with my mother.

సౌమ్య
ఇక్కడ 'am' అనే ‘to be’ form ను వాడుతున్నాం. ప్రధాన క్రియకు ‘ing’ జోడించాలి – 'having'.

Phil
OK, Let’s practise the pronunciation again. Notice how we say 'I am' as 'I'm'. Repeat after me:

‘I'm having lunch with my mother.'

‘I'm having lunch with my mother.'

సౌమ్య
తరువాతి వ్యక్తి ఏమన్నారో చూద్దాం.

I'm going to work as usual.

సౌమ్య
Ok, ఈ వ్యక్తి కూడా 'I'm' వాడారు. ప్రధాన క్రియ 'going'. ఇక్కడ ‘as usual’ అంటే ఎప్పుడూ చేసే పని లేదా రోజూ చేసే పని అని సూచించడానికి వాడారు.

Phil
And let’s practise the pronunciation together. Notice how 'to' in 'going to work' sounds like 'tuh' Repeat after me:

‘I'm going to work as usual.'

‘I'm going to work as usual.'

సౌమ్య
And, we have one more. చివరి వ్యక్తి ఏం ఏర్పాట్లు చేసుకున్నారు?

I'm not doing anything. It's my day off.

సౌమ్య
ఆమె ‘not doing anything’ ఏమీ చెయ్యట్లేదు. అన్నారు. నెగటివ్ వాక్యం రాసేటప్పుడు ‘to be’ form తరువాత ‘not’ వాడాలి. గుర్తు పెట్టుకోండి. ఆమె ఒక మంచి expression వాడారు – 'it's my day off' అంటే ఈరోజు నాకు సెలవు అని అర్థం.

Phil
When you can say 'I'm not doing anything' remember that it's important to stress the 'not'. Repeat after me:

‘I'm not doing anything.'

‘I'm not doing anything.'

సౌమ్య
Thanks, Phil. సమీప భవిష్యత్తులో ఏర్పాట్లను ఇంగ్లిష్‌లో చెప్పడం ఎలాగో మీరు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు కొంత సాధన చేద్దాం. రేపు మీరు సినిమా హాల్ లో film చూడ్డానికి వెళ్తున్నారు అనుకోండి. దీన్ని ఇంగ్లిష్‌లో ఎలా చెప్తారు? ‘See’ అనే క్రియను వాడండి. తరువాత Phil కూడా చెప్తారు. విని, తన వాక్యంతో మీ వాక్యాన్ని సరిపోల్చికోండి.

Phil
'I'm seeing a film at the cinema'

సౌమ్య
Did you say the same? ‘I'm going to see a new film' అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు, మీరు ఎవరినైనా ఈరోజు సాయంత్రం ఏం చేస్తున్నారు? అని అడగాలి. ఎలా అడుగుతారు? ‘Do’ అనే క్రియను వాడండి.

Phil
Are you doing anything this evening?

సౌమ్య
Did you say the same?

Phil
Well done! Now you know how to talk about future arrangements!

సౌమ్య
Great! Are you practicing English this week? Bye!

Phil
Bye!

 

Learn more

1. సమీప భవిష్యత్తు ప్లానుల గురించి చెప్పేటప్పుడు ఏ కాలాన్ని వాడాలి?

Present continous - వర్తమానకాలం వాడాలి. అది కచ్చితంగా జరగబోతోంది అని మనకి తెలిసినప్పుడు present continous tense వాడాలి.

2. వాక్య నిర్మాణం ఎలా చెయ్యాలి?

భావర్థకం లేదా నిశ్చయార్థకం లేదా అంగీకార సూచన గా చెప్పేటప్పుడు (affirmative form):

I'm having dinner with my mother. (subject + present form of be + verb-ing)

నకారాత్మక రూపం (negative form):

I'm not having dinner with my mother. (subject + present form of be + not + verb-ing)

ప్రశ్నార్థకం (question form):

Are you having dinner with your mother? (present form of Be + subject + verb-ing?)

ఈ కింది కుదింపులు పరిశీలించండి.

'I am' becomes 'I'm'

'You are' becomes 'You're'

'He is' becomes 'He's'

'We are' becomes 'We're'.

3. Present continous ను వేరే రకంగా కూడా ఉపయోగించొచ్చా?
అవును. సమీప భవిష్యత్తు గురించే కాక, ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి చెప్పడానికి కూడా వాడొచ్చు. గుర్తుపెట్టుకోండి. 

How do I talk about future arrangements?

5 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Tell us what your are doing this week our Facebook group!
ఈ వారం మీ ప్లానులేమిటో మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • as usual
    ఎప్పటిలాగే
    day off
    సెలవు
    listen to music
    సంగీతం వినడం
    cinema
    సినిమా హాల్