บทเรียนย่อย 21

Listen to find out how to make small talk in English.
టూకీ సంభాషణలు మొదలుపెట్టడం ఎలాగో విని తెలుసుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 21

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

How do I make small talk?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య 
హాయ్!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.

Sam 
Hello! Lovely day, isn't it? 

సౌమ్య
Yes, very nice! ఇవాళ మనం ‘small talk’ - టూకీ మాటలు - ఎవరితోనైనా చిన్న చిన్న సంభాషణలు చెయ్యడం ఎలాగో నేర్చుకుందాం. ఇక్కడ నలుగురు వ్యక్తులు టూకీ వాక్యాలు చెప్తున్నారు. వినండి. 

Inserts
1. Terrible weather, isn't it?
2. The buses are always so crowded, aren't they?
3. How's your day going?
4. Haven't seen you in a while! How are things? 

Sam
They were all questions! 

సౌమ్య
Yes, అందరూ కూడా సంభాషణ మొదలెట్టడానికి ఏదో ఒక టాపిక్ తీసుకుని తమ అభిప్రాయం చెప్తున్నట్టు చెప్తూ ప్రశ్నలడిగారు. 

Sam
Let's start with the weather - a very common subject in English. 

సౌమ్య
సరే, ముందు Sam ఎలా చెప్పారో విందాం. తరువాత ఆ నలుగురిలో మొదటి వ్యక్తి ఏమన్నారో కూడా విందాం. ఇద్దరూ ఒకేలా చెప్పారు. గమనించండి! 

Inserts
Lovely day, isn't it?
Terrible weather, isn't it? 

Sam
Ok, so we both started with an adjective: 'lovely' or 'terrible'. 

సౌమ్య
Yes, and after 'lovely' and 'terrible'– or any other adjective you want to use – you can either put 'day' or 'weather'. And you can just stop there, can't you, Sam? 

Sam
Yes, or you can add the simple question 'isn't it?' at the end. Let's practise the pronunciation of both of those. Please repeat after me.

'Lovely day.'
'Terrible weather.'
'Lovely day, isn't it?'
'Terrible weather, isn't it?'

సౌమ్య
Thank you, Sam. రెండో వ్యక్తి ఎలా అన్నారో చూద్దాం. 

Insert
The buses are always so crowded, aren't they? 

సౌమ్య
బస్సుల్లో ఎంత రష్ గా ఉంటుందో చెప్పారు. ఇందాక చెప్పుకున్నట్టు మన అభిప్రాయం చెప్పి ఊరుకుని అవతలి వాళ్ల స్పందనకోసం వెయిట్ చెయ్యొచ్చు లేదా అభిప్రాయం చెప్పాక అవునా? కాదా? అన్నట్టు ప్రశ్న అడగొచ్చు.

Sam
Yes, here they used 'aren't they?' instead of 'isn't it?' because 'buses' are plural. So we use 'are' with 'buses' but with 'day' and 'weather' we use 'is'. Quick practice! Repeat after me:

'The buses are always crowded.'

'The buses are always crowded, aren’t they?' 

Who was next? 

సౌమ్య
మూడో వ్యక్తి చెప్పింది మళ్లీ విందాం.

Insert
How's your day going? 

సౌమ్య
మీ రోజు ఎలా గడిచింది? అని అడిగారు. నాలుగో వ్యక్తి ఇలాంటి ప్రశ్నే అడిగారు కానీ వేరే విధంగా అడిగారు. మళ్లీ జాగ్రత్తగా వినండి.

Insert
Haven't seen you in a while! How are things? 

Sam
They asked 'How are things?', which is similar to asking 'How is everything?' These are all quite informal ways of asking 'How are you?' and we use them with people we know a little bit, usually, not with people we don't know.

Let's practise - repeat after me:

'How's your day going?'

'How are things?'

సౌమ్య
సూపర్. ఇప్పుడు మీకు చిన్న పరీక్ష. మీరొక బస్ స్టాప్ లో ఉన్నారు. పక్కనున్న వ్యక్తితో సంభాషణ మొదలుపెట్టాలనుకుంటున్నారు. వాతావరణం గురించి ఒక వాక్యం చెబుతూ, ప్రశ్న అడగండి. ‘Lovely’ అని వాక్యం మొదలెట్టండి. తరువాత Sam కూడా చెప్తారు. విని మీ జవాబు సరిచూసుకోండి. 

Sam
Lovely weather, isn't it? 

సౌమ్య
Nice! 'Lovely day' అని కూడా మొదలుపెట్టొచ్చు. ఇప్పుడు వాళ్ల రోజు ఎలా గడిచిందో అడగండి. మీరు కొత్తవ్యక్తులతో మాట్లాడుతున్నారు, గుర్తు పెట్టుకోండి. 

Sam
How's your day going? 

సౌమ్య
Great! Now you're ready to make lots of small talk! Join us next week for another episode of 'How do I…' Bye!

Sam
Bye, everyone! 

Learn more!

1. Small talk - టూకీ సంభాషణలు మొదలుపెట్టడానికి ఎలాంటి టాపిక్స్ తీసుకోవచ్చు?
కామన్ టాపిక్స్ - వాతావరణం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ (ఉదా: బస్సులు, మెట్రోలలో ప్రయాణాలు), మనమున్న ప్రదేశాలు (ఉదా: హోటెల్, రెస్టారంట్, పార్క్) కొత్తవాళ్లతో సంభాషణ మొదలుపెట్టేటప్పుడు డబ్బులు, రాజకీయాలు, మతం, కులం, రంగు, రూపు లాంటి అంశాల ప్రసక్తి తేవకుండా ఉండడమే మంచిది.

2. కొత్తవాళ్లతో సంభాషణ మొదలుపెట్టినప్పుడు ప్రశ్నలను ఎలా అడగాలి?
ఈ కింది రెండు రకాలుగా అడగొచ్చు. 

a) Tag questions – ఒక వాక్యం చెప్పి చివరిలో ప్రశ్న చేర్చడం.

  • Terrible weather, isn't it?
  • Lovely day, isn't it?
  • The buses are always so crowded, aren't they? 

b) Direct questions 

  • How's your day going?
  • How are things?

3. 'Terrible weather' అని మొదలుపెట్టడం కరక్టేనా?
సాధారణంగా వాడుక భాషలో పూర్తి వాక్యం చెప్పకుండా ముఖ్యమైన పదాలు మాత్రం చెప్పి మొదలెడుతూ ఉంటాం. Articals, prepositions వదిలేసి ముఖ్యమైన పదాలు మాత్రమే వాడి వాక్యం చెప్పొచ్చు. 

  • The weather is terrible, isn't it?  > Terrible weather, isn't it?
  • It's a lovely day, isn't it? > Lovely day, isn't it?
  • I haven't seen you in a while! > Haven't seen you in a while!  

4. 'How are you?' కాకుండా 'ఎలా ఉన్నారు?' అని అడగడానికి వేరే పద్ధతులెమైనా ఉన్నాయా?
కొత్తవాళ్లను ఈ కింది విధంగా అడగొచ్చు:

  • How's your day going?

పరిచయస్థులను ఈ కింది విధంగా కూడా అడగొచ్చు:

  • How are things?
  • How is everything? 

How do I make small talk?

3 Questions

Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Would you like to study English with us? Join us on our Facebook group!
మా దగ్గర ఇంగ్లిష్ నేర్చుకోవడం మీకు ఇష్టమేనా? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి  మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

หลักไวยากรณ์จากบทเรียนย่อย

Session Vocabulary

  • small talk
    టూకీ సంభాషణలు 

    the weather
    వాతావరణం

    lovely
    బాగుంది

    terrible
    బాలేదు

    crowded
    రష్ గా ఉంది