1

บทเรียน 1: Essential English Conversation

เลือกบทเรียน

  1. 1 Essential English Conversation

บทเรียนย่อย 18

Listen to find out how to buy food at the market.
మార్కెట్‌లో ఆహారం కొనడం ఇక్కడ విని నేర్చుకోండి.

 

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 18

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

At the market

Listen to find out how to buy food at the market.
మార్కెట్‌లో ఆహారం కొనడం ఇక్కడ విని తెలుసుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

కల్యాణి
హలో! బాగున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. market లోకి వెళ్లి మీకు కావలసిన ఆహారం కొనుక్కోడం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందురు గాని.

ఇదిగో ... ఈ వ్యక్తి ఆలుగడ్డలు కొంటున్నాడు, ఒకసారి విని చూడండి.

Dan
How can I help you?

Lisa
Hi, can I have a kilo of potatoes?

Dan
Here you are. That’s £1.00.

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదట దుకాణదారు తన customerతో ఏమన్నాడు? ఏవిధంగా సహాయపడగలనో చెప్పండి, “How can I help you?” అన్నాడు. సాధారణంగా - shopల్లోనూ, restaurantలలోనూ, ఇంకా market లోనూ – మీకేం కావాలో చెప్పమని – ఇలాగే అడుగుతారు. విని మీరూ అనండి.

How can I help you? 

కల్యాణి
అప్పుడు customer ఒక “kilo” ఆలుగడ్డలు, a kilo of “potatoes” కావాలి అన్నాడు. విని మీరూ అనండి.

Hi, can I have a kilo of potatoes?

కల్యాణి
అలాగే మీరు - ఉల్లిపాయలు “onions”, టమాటాలు “tomatoes” వంటి కూరగాయలు,“vegetables” కావాలని కూడా అడగొచ్చు. విని మీరూ అనండి.

Can I have a kilo of onions?

కల్యాణి
నారింజ “oranges”, అరటిపళ్లు “bananas” వంటి పళ్లు “fruit” కావాలంటే ఇలా అడగొచ్చు. విని మీరూ అనండి.

Can I have two kilos of bananas?

కల్యాణి
బియ్యం “rice”, పిండి “flour” కోసం ఇలా అడగవచ్చు. విని మీరూ అనండి.

Can I have a kilo of flour?

కల్యాణి
దుకాణదారు తన customerకి ఆలుగడ్డలు ఇచ్చి, ఇదిగోనండీ, “here you are” అన్నాడు. ఎవరికైనా ఏదైనా ఇచ్చాక అలా అంటాం. విని మీరూ అనండి.

Here you are. 

కల్యాణి
తర్వాత అతను దాని ఖరీదు “£1.00” అని చెప్పాడు.

That’s £1.00 

కల్యాణి
ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా market లోకి వెళ్లి మీకు కావలసిన ఆహారం కొనుక్కుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.

Justin గొర్రెమాంసం, “lamb” కొంటున్నాడు.

How can I help you?
Hi, can I have two kilos of lamb?
Here you are. That’s £15.00

Nicole మిరపకాయలు “peppers” కొంటున్నాడు.

How can I help you?
Hi, can I have a kilo of peppers?
Here you are. That’s £2.50

కల్యాణి
Ok, మళ్లీ చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విన్నాక మీరూ అనండి.

How can I help you?
Can I have a kilo of potatoes?
Here you are. 
That’s £1.00

కల్యాణి
సరే! ఈ ఇంగ్లిష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లిష్‌లో అనండి.

How can I help you?
Can I have a kilo of potatoes?
Here you are.
That’s £1.00

కల్యాణి
Fantastic - మీకు market లో ఆహారం కొనేటప్పుడు ఏం మాట్లాడాలో తెలిసింది కదా. మరి దుకాణదారు అడుగుతున్నాడు, మీకేం కావాలో చెప్పండి.

How can I help you?
--------------------
Here you are. That’s £1.00

కల్యాణి
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.

Dan
How can I help you?

Lisa
Hi, can I have a kilo of potatoes?

Dan
Here you are. That’s £1.00.

కల్యాణి
Well done! మీరిప్పుడు marketలో మీకు కావలసిన ఆహారాన్ని కొనగలరు, in English. Remember to practice what you’ve learnt. ఇక మిత్రులతో కలిసి ఈ ఇంగ్లిష్‌ అభ్యాసం చేస్తూ ఉండండి. మరిన్ని విషయాల్ని తెలుసుకోడానికి Essential English Conversation లలో మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరు నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

At the market

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

  • How can I help you?
    మీకేం కావాలి?

    Hi, can I have a kilo of potatoes?
    Hi, నాకు ఒక కిలో ఆలుగడ్డలు ఇవ్వగలవా?

    Here you are. Anything else?
    ఇదిగోనండీ. మరేదైనా కావాలా?

    Yes, can I have a kilo of ______ as well?
    ఔను, ఒక కిలో ______ కూడా ఇస్తావా?

    Here you are. That’s £15.00 altogether.
    ఇదిగోనండీ. అంతా కలిపి £15.00 అయ్యింది.

    That’s expensive!
    అది ప్రియమేనే!

    That’s cheap!
    అది చవకేనే!

    fish
    చేపలు

    chicken
    కోడిమాంసం

    lamb
    గొర్రెమాంసం

    peppers
    మిరపకాయలు

    potatoes
    ఆలుగడ్డలు