1

บทเรียน 1: Essential English Conversation

เลือกบทเรียน

  1. 1 Essential English Conversation

บทเรียนย่อย 11

Listen to find out how to ask someone where they live.
మీరుండే ప్రదేశం గురించి మాట్లాడ్డం ఎలాగో ఇక్కడ విని నేర్చుకోండి.

 

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 11

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

Where do you live?

Listen to find out how to ask someone where they live.
మీరుండే ప్రదేశం గురించి మాట్లాడ్డం ఎలాగో ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

కల్యాణి
హలో! బావున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. మీరుండే ప్రదేశం గురించి మాట్లాడ్డం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందురు గాని.
ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.

Sian
Hi Phil, where do you live?

Phil
I live near the market. How about you?

Sian
I live in London.

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ... మొట్టమొదటా ...
షాన్ నువ్వెక్కడ ఉంటావూ ‘Where do you live?’ అని అడిగింది. వినీ తిరిగి మీరూ అనండి.

Hi, where do you live?

కల్యాణి
ఫిల్ ఎక్కడ ఉంటాడూ? “near the market” బజారు దగ్గర ఉంటాడు. మీరు’ I live near…’ అని చెప్పి మీరు దేనికి దగ్గరగా ఉంటారో చెప్పొచ్చు. విని మీరూ అనండి.
I live near the market.

కల్యాణి
మీరుండే స్థలం వీటికి దగ్గరగా గానీ ఉంటుందా?
I live near the city centre

I live near the bus station

కల్యాణి
షాన్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు ఫిల్. ‘నీ సంగతి ఏమిటి?’ ‘how about you?’ అని అడిగాడు. మనను వేసిన ప్రశ్నే ఎదుటివారిని అడగాలనుకుంటే అలా అడుగుతాం. విని మీరూ అనండి.

How about you?

కల్యాణి
షాన్ లండన్‌లో ఉంటుంది, so “I live in” అని London అనే మాటను కలిపి చెప్పింది. “I live in” అనే మాటను పట్టణాలూ, ప్రాంతాలూ, దేశాల పేర్ల తో కలిపి కూడా వాడొచ్చు, వినీ తిరిగి మీరూ అనండి.

I live in London.

కల్యాణి
బాగుంది – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా నివాసం గురించి మరొకరు అడిగి తెలుసుకుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.

Mark సముద్రం దగ్గర నివసిస్తాడు.

Hi Mark, where do you live?

I live near the sea. How about you?

I live in Manchester.

Claire ఉండేది ఆసుపత్రి దగ్గర.

Hi Claire, where do you live?

I live near the hospital. How about you?

I live in Birmingham.

కల్యాణి
సరే, మళ్లీ చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విన్నాక మీరూ అనండి. ఈసారి మీకు ప్రతి వాక్యం రెండు సార్లు వినపడుతుంది.

Hi Phil, Where do you live?
Hi Phil, Where do you live?

I live near the market. 
I live near the market. 

How about you? 
How about you? 

I live in London. 
I live in London. 

కల్యాణి
సరే, ఈ ఇంగ్లిష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లిష్‌లో అనండి.

Hi Phil, నువ్వెక్కడ ఉంటావు?
Hi Phil, where do you live?

నేను బజారు దగ్గర ఉంటాను.
I live near the market.

నీ సంగతి ఏమిటి? 
How about you?

నేను లండన్‌లో ఉంటాను. 
I live in London.

కల్యాణి
Fantastic – ఇంగ్లిష్‌లో నివాసం గురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి షాన్ ప్రశ్నకు జవాబివ్వండి.
Hi, where do you live? 

I live in London 

కల్యాణి
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.

Sian
Hi Phil, Where do you live?

Phil
I live near the market. How about you?

Sian
I live in London.

కల్యాణి
Well done! భలే చక్కగా చేశారే. ఇప్పుడు ఇంగ్లిష్‌లో మీరెక్కడ ఉండేదీ చెప్పగలరూ, ఎదుటి వారి నివాసం గురించీ కనుక్కోగలరు. మీరు నేర్చుకున్నది సాధన చెయ్యడం మర్చిపోకండేం! ఇక మీ మిత్రులతో కలిసి ఇంగ్లీష్‌లో మీమీ నివాసాల గురించి చెప్పడం, అడగడం అనే అభ్యాసం చేస్తూ ఉండండి. Bye! 

Check what you’ve learned by putting the words in the correct order.
పదాలను సరైన వరసలో పెట్టి మీరు నేర్చుకున్న విషయాన్ని చెక్ చేసుకోండి

Where do you live?

3 Questions

Put the words in the correct order.
పదాలను సరైన వరసలో పెట్టండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

  • Where do you live?
    నువ్వుండేది ఎక్కడ?

    I live near ______.
    నేనుండేది ______ దగ్గర.

    How about you?
    నీ సంగతేమిటి?

    I live in ______.
    నేను ___లో ఉంటాను.

    the market
    బజారు

    the bus station
    బస్స్టాండు

    the hospital
    హాస్పిటల్

    the city centre
    సిటీ సెంటర్