Session 11

Listen to find out how to talk about rules and obligations in English.
నియమ నిబంధనల గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 11 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about rules at school?

ఈ కింది వాటిల్లో ఏవి నిబంధనలు కావు?

  • We have to arrive at 8:30.
  • We mustn’t use our mobile phones in class.
  • We must wear a uniform.
  • But we don’t have to wear specific shoes.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

సౌమ్య
హాయ్!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు. 

Sam
Hello, everybody. Welcome! 

సౌమ్య
మన చిన్నప్పుడు స్కూల్లో మనకి చాలా రకాలైన నియమ నిబంధనలుంటాయి కదా. ఈ టైంకు రావాలి, ఇవి వేసుకోవచ్చు, అవి వేసుకోకూడదు..ఇలా చాలా రూల్స్ ఉంటాయి. వీటి గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో ఇవాళ తెలుసుకుందాం. Tom వాళ్ల స్కూల్లోని నియమ నిబంధనల గురించి చెప్తున్నారు. విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారు పడకండి. నేను మీకు సహాయం చేస్తాను. 

Tom
We have to arrive at 8:30. We mustn't use our mobile phones in class. We must wear a uniform but we don't have to wear specific shoes. 

సౌమ్య
విన్నారా? యూనిఫారంతో పాటు ఏవో ఒక షూస్ వేసుకోవచ్చుట. కచ్చితంగా ఫలానా షూసే వేసుకోవాలి అనే రూలేమీ లేదుట. మిగతావన్నీ మాత్రం కచ్చితంగా పాటించవలసిందే! Tom చెప్పిన మాటల్లోంచి ఈ షూస్ విషయం మనకు ఎలా తెలిసింది? Sam, could you please explain us about that? 

Sam
We're going to have a look! Let's start with the first thing he said. 

సౌమ్య
సరే! మొట్టమొదట 'arrive' అనే క్రియను వాడారు. Arrive అంటే చేరడం. దానికి ముందు వాడిన phrase ఏది? మళ్లీ విందాం. 

We have to arrive at 8:30.

సౌమ్య
అతను 'have to' అన్నారు. అంటే కచ్చితంగా ఆ టైంకు వెళ్లాలన్నమాట. అందరికీ 'have to' అని వాడాలి.ఒక్క 'he', 'she', 'it' కు తప్ప. వాటికి మాత్రం 'has to' వాడాలి. 'Have to' or 'has to' తరువాత క్రియాపదం వాడాలి. 

Sam
Yes, so for example, I have to arrive at work at 9:00 but my friend, he, has to arrive at 8:00.

Let's practise the pronunciation. Notice that the 'v' in 'have' is pronounced more like an 'f' in 'have to'. Repeat after me:

‘I have to arrive at 9:00’.

‘He has to arrive at 8:00’. 

సౌమ్య
Great! తరువాత ఏం చెప్పారో విందాం. ఈసారి 'use' అనే  క్రియను వాడారు. Use అంటే వాడడం. అది ఎలా చెప్పారో చూద్దాం. 

We mustn't use our mobile phones in class. 

సౌమ్య
'Mustn't' అని అన్నారు. దీనర్థం ఆ పని అస్సలు చెయ్యకూడదు అని. 'Must' + 'not' కలిపితే 'mustn't' అవుతుంది. ఈ form మారదు. 'I', 'he','we' దేనితోనైనా 'mustn't' అనే వాడాలి. 

Sam
And the pronunciation is 'mustn't'. Let's try that: 

‘I mustn't be late’. 

‘We mustn't be late’. 

Now let's listen to the next rule. 

సౌమ్య
Yes, ఈసారి 'wear' అనే క్రియను వాడారు. Wear అంటే వేసుకోవడం. దానికి ముందు వాడిన phrase ఏది?

We must wear a uniform but we don't have to wear specific shoes. 

సౌమ్య
'I must wear a uniform' అంటే నేను తప్పకుండా వేసుకోవాలి అని. ఇక్కడ 'must' కు, 'have to' కు ఒకటే అర్థం – అది నియమం, పాటించి తీరవలసిందే అని అర్థం. 'mustn't' లాగే 'must' కు కూడా . 'I', 'he','we' లతో వాడుతున్నప్పుడు form మారదు. 

Sam
Please repeat after me for the pronunciation: 

‘I must wear a uniform.’ 

‘He must arrive at 8:00.’ 

సౌమ్య
చివరిగా 'I don't have to…' అన్నారు కదా! అంటే నేను చెయ్యక్కర్లేదు. అది తప్పనిసరిగా చేయవలసినది కాదు అని అర్థం. 'Don't have to…' అంటే అది optional అన్నమాట..చేస్తే చెయ్యొచ్చు లేకపోతే లేదు. 

Sam
And, again, it's 'don't have to' for everyone apart from 'he', 'she' and 'it', where we say 'doesn't have to'. Let's practise. Repeat after me: 

‘I don't have to wear a uniform.’ 

‘She doesn't have to wear a uniform.’ 

సౌమ్య
Thanks, Sam. ఇప్పుడు మీకు తప్పనిసరిగా చెయ్యవల్సిన పనుల గురించి ఎలా చెప్పాలో, పనుల గురించి ఎలా చెప్పాలో అర్థమయ్యింది కదూ! ఇప్పుడు కొంచం సాధన చేద్దాం.

మీరు మీ ఆఫీసుకు ఎన్ని గంటలకి తప్పకుండా వెళ్లాలి? దీనికి జవాబు రెండు విధలుగా చెప్పొచ్చు. రెండూ ప్రయత్నించండి. జవాబులో 'arrive' అనే క్రియను వాడండి. తరువాత కూడా జవాబు చెప్తారు. విని మీ జవాబును సరిచూసుకోండి.

Sam
I have to arrive at 9:00.
Or
I must arrive at 9:00.

సౌమ్య
Great! ఇప్పుడు మీ ఆఫీసుకి సూట్ వేసుకోవడం తప్పనిసరి ఏమీ కాదు అని చెప్పాలి. ఎలా చెప్తారు? 

Sam
I don't have to wear a suit. 

Well done! Now you can talk about rules and obligations! And, unfortunately, we have to end there. 

సౌమ్య
Yes, we must! Bye! 

Sam
Bye!

Learn more

1) ఇది తప్పనిసరి లేదా నిబంధనగా పాటించవలసినది అని ఎలా చెప్పాలి?

రెండు విధాలుగా చెప్పొచ్చు:

  • We have to arrive at 8:30.
  • We must wear a uniform.

2) ఇది తప్పనిసరిగా చెయ్యకూడని పని అని ఎలా చెప్పాలి?

ఈ కింది విధంగా చెప్పొచ్చు:

  • We mustn’t use our mobile phones in class

3) ఏదైనా పని optional - చేస్తే చెయ్యొచ్చు లేకపోతే లేదు అని ఎలా చెప్పాలి?

ఈ కింది విధంగా చెప్పొచ్చు:

  • We don’t have to wear specific shoes.

4) What is the form?

have to
I/ you/ we/ they + have to + base verb (મૂળ ક્રિયાપદ)
He/ she/ it + has to + base verb

must
subject + must + base verb

must not
subject + (must + not) mustn’t + base verb

not have to
I/ you/ we/ they + don’t have to + base verb
He/ she/ it + doesn’t have to + base verb

How do I talk about rules at school?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

What rules do you have to follow? Come and tell us on our Facebook group!
మీ స్కూల్లో రూల్స్ ఏమిటి? మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • arrive
    చేరడం 

    use (our mobiles phones in class)
    వాడడం

    wear
    వేసుకోవడం

    a uniform
    యూనిఫార్మ్

    specific shoes
    ప్రత్యేకమైన షూస్