1

పాఠ్యాంశం 1: Essential English Conversation

పాఠ్యాంశాన్ని ఎంచుకోండి

  1. 1 Essential English Conversation

Session 32

Listen to find out how to ask people how often they do an activity.
ఎవరినైనా ఎంత తరచుగా వాళ్ళు ఏదైనా activity చేస్తారని అడగడం ఎలాగో విని తెలుసుకోండి.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 32 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

ఎంత తరచుగా మీరు ఫుట్బాల్ ఆడతారు?

Listen to find out how to ask someone about what sports they do.
ఏం sports ఆడతారని ఎలా అడగాలో తెలుసుకోవడానికి వినండి.

Listen to the audio and take the quiz.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లిషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎవరినైనా ఎంత తరచు పనులు చేస్తుంటారని ఎలా అడగాలో తెలుసుకుందాం.

ఇదిగో వీళ్ళిద్దరూ ఎంత తరచు పనులు చేస్తారో అన్నదాని గురించి మాట్లాడుకుంటున్నారు. విందాం.

Lisa
How often do you play football?

David
I play football once a week. How about you?

Lisa
About twice a week.

సౌమ్య
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి.
మొదట Lisa, David ను ఎంత తరుచుగా నువ్వు...? ‘How often do you….?’
'play football?’ అని చివర్లో కలిపింది....David ఎంత తరచుగా ఫుట్బాల్ ఆడతాడు అని అడగడానికి. విని, మళ్ళీ చెప్పండి.

How often do you play football?

సౌమ్య
అప్పుడు David... నేను వారానికోసారి ఫుట్బాల్ ఆడతాను అన్నాడు ‘I play football once a week.’
ఒకవేళ రెండుసార్లు ఆడితే twice అని చెప్పొచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే ఆ సంఖ్యతో పాటు times అని కలిపి చెప్పొచ్చు…three times, five times.. అలాగన్నమాట. విని, మళ్ళీ చెప్పండి.
I play football once a week.

సౌమ్య
అప్పుడు David అదే ప్రశ్నని మళ్ళీ అడగడానికి 'మీ సంగతేంటి?' అన్నాడు. విని, మళ్ళీ చెప్పండి.

How about you?

సౌమ్య
అప్పుడు Lisa, David కు, తను సుమారుగా వారంలో రెండుసార్లు రన్నింగ్‌కి వెళతానని చెప్పింది... she goes running about twice a week. About అనే పదాన్ని దాదాపుగా, సుమారుగా అని చెప్పడానికి వాడతాం. వారం అనే కాకుండా day, month ఇలా ఏదైనా చెప్పొచ్చు. ‘Once a day’ ‘once a month’ or ‘once a year’... ఇలాగన్నమాట. విని, మళ్ళీ చెప్పండి.

About twice a week.

Great...ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాటలు విని మీ జవాబులు సరిచూసుకోండి.

How often do you play tennis?
I play tennis twice a month. How about you?
About three times a month.

How often do you play basketball?
I play basketball twice a week. How about you?
About twice a year.

సౌమ్య
Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లిష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి. ఈసారి ఒక్కొక్కటీ రెండేసిసార్లు వస్తుంది...వినండి.

How often do you play football?
How often do you play football?

I play football once a week.
I play football once a week.

How about you?
How about you?

About twice a week.
About twice a week.

సౌమ్య
Great! ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం, ! ఏదీ ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

మీరు ఎంత తరచుగా ఫుట్బాల్ ఆడతారు?
How often do you play football?

నేను వారానికొకసారి ఆడతాను.
I play football once a week.

మీ సంగతేంటి?
How about you?

సుమారుగా వారానికి రెండుసార్లు
About twice a week.

సౌమ్య
Fantastic, OK, ఇప్పుడు మీకు ఎవరినైనా వాళ్ళు ఎంత తరచుగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారో అడగడం వచ్చేసింది. Lisa కు జవాబిస్తూ ప్రాక్టీస్ చెయ్యండి. Follow up ప్రశ్న అడగడం మర్చిపోకండి. How about you? అని అదే ప్రశ్న వాళ్ళని కూడా అడగండి.

How often do you play football?
About twice a week.

సౌమ్య
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Lisa
How often do you play football?

David
I play football once a week. How about you?

Lisa
About twice a week.

సౌమ్య
Well done, భలే చక్కగా చేశారే! ఇప్పుడు మీకు ఎవరినైనా వాళ్ళు ఎంత తరచుగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారో అడగడం వచ్చేసింది. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి. రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

 

Check what you’ve learned by choosing the correct answer to the question.

ఎంత తరచుగా మీరు ఫుట్బాల్ ఆడతారు?

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Session Vocabulary

  • How often do you ______ ______?
    ఎంత తరచుగా మీరు ______ ______?
    I ______ ______ once a week.
    నేను వారానికొకసారి ______ ______.
    about twice a week
    సుమారుగా వారానికి రెండుసార్లు.
    about twice a month
    సుమారుగా నెలకి రెండుసార్లు.
    about three times a month
    సుమారుగా నెలకి మూడుసార్లు.
    about twice a year
    సుమారుగా ఏడాదికి రెండుసార్లు.
    play football
    ఫుట్బాల్ ఆడడం