Sesión 7

Listen to find out how to talk about someone’s appearance in English.
ఇతరుల ఆకృతి, రూపం గురించి ఇంగ్లిష్‌లో ఎలా వివరించాలో విని తెలుసుకోండి.

Sesión 7 puntuación

0 / 4

  • 0 / 4
    Actividad 1

Actividad 1

How do I talk about someone's appearance?

How can we give a good amount of detail when describing the appearance of people we know? Listen to today’s episode to find out!
ఒక మనిషి ఆకృతి, రూపం గురించి వివరించేటప్పుడు వీలైనంత ఎక్కువ సమాచారం ఇవ్వడం ఎలా? ఇవాల్టి ఎపిసోడ్‌లో విని తెలుసుకోండి.

 

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Mostrar la transcripción Ocultar la transcripción

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. నాతో పాటూ Tom కూడా ఉన్నారు.

Tom
And, hi everybody! I’m Tom, welcome to today’s episode of ‘How do I…’.

సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్‌లో మనం మనుషుల ఆకారం, రూపు గురించి ఇంగ్లిష్‌లో ఎలా వివరించాలో తెలుసుకుందాం. ఇక్కడ, ఇద్దరు వ్యక్తులు అమ్మ గురించి, బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతా విన్నాక ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి: ఎవరికి బంగారు రంగు జుత్తుంది?

Speaker 1: What does your boyfriend look like?
Speaker 2: He's tall and has short, blonde hair.

Speaker 1: What does your mother look like?
Speaker 2: She's quite short and has long, dark hair.

సౌమ్య
మీకు అర్థమైందా? మొదట మాట్లాడిన వ్యక్తి బాయ్ ఫ్రెండ్‌కు ‘short, blonde hair’ ఉంది.

Tom
So, let’s begin today’s lesson on appearance!

సౌమ్య
OK! ‘Look like’..ఈ రెండూ ఇక్కడ ముఖ్యమైన పదాలు. ఇవి వాడితే ఒకరి ఆకారం, రూపం గురించి మనం చెప్తున్నాం అని తెలుస్తుంది. సరే, రూపం గురించి ఎలా అడిగారు? గమనించారా? వాళ్లు ‘do’ వాడారా, ‘does’ వాడారా?

Tom
Let’s listen again to find out!

‘What does your boyfriend look like?’

‘What does your mother look like?’

సౌమ్య
విన్నారా? ఇక్కడ ‘does’ అని ‘do’ కు third person form వాడారు. మనం ‘he’, ‘she’ or ‘it’ ల గురించి ప్రశ్నలడిగినప్పుడు, ఎప్పుడూ ‘does’ అనే వాడాలి. Tom, ఈ ప్రశ్నల్లోన్ని ఉచ్చారణ ఆసక్తికరంగా ఉంది. దాని గురించి వివరించగలరా?

Tom
Of course! Let’s work backwards to help with our rhythm. Repeat after me:

‘does your’

‘What does your’

Now let’s make it complete! Let’s add ‘mother’ and ‘look like’. ‘Mother’ and ‘look’ have strong stress.

‘What does your mother look like?’

సౌమ్య
Nice work! ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పినప్పుడు ‘be’ forms గానీ ‘have’ గానీ వాడాలి. జవాబులో ఏ రకమైన ‘be’ form వాడారు? మీకు గుర్తుందా?

‘He's tall and has short, blonde hair.’

‘She's quite short and has long, dark hair.’

Tom
They say ‘he’s’ or ‘she’s’. The speakers are using the short form of ‘is’.

సౌమ్య
ఇక్కడ ‘is’ అనే ‘be’ form వాడిన తరువాత, ఆ వ్యక్తి కొలతల గురించి చెప్పారు...పొడుగు, పొట్టి..ఇలాగన్నమాట. కొలతల గురించే కాకుండా వయసు, ఆకృతి లాంటి వాటి గురించి కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ‘is’ తరువాత ఆ వ్యక్తి గురించి మన అభిప్రాయం కూడా చెప్పొచ్చు.

Tom
The first speaker says ‘he’s tall’. The second speaker says ‘she’s quite short’.

సౌమ్య
That’s right! ‘Tall’ అనేది ‘short’ కు వ్యతిరేకం. ‘Quite’ అంటే ‘not very’ అని అర్థం. When we say ‘quite short’, we make the describing word, short, less strong. పొట్టే కానీ మరీ ఎక్కువ పొట్టి కాదు అని చెప్పడానికి ‘quite short’ అని వాడొచ్చు.

That’s not all! ఇంకా ఒడ్డుపొడుగు, జుత్తు రంగు, కనుపాపల రంగు లాంటి ముఖకవళికల గురించి చెప్పడానికి ‘have’ వాడతాం. ఇందాక ‘have’ వాడుతూ ఏం చెప్పారో మళ్లీ విందాం.

‘He's tall and has short, blonde hair.’

‘She's quite short and has long, dark hair.’

సౌమ్య
ఇక్కడ జుత్తు గురించి చెప్పడానికి ‘have’ వాడారు. మనం he, she or it ల కు ‘have’ కు మరో రూపం అయిన ‘has’ వాడతాం. ఇక్కడ ‘hair’ కు ముందు ‘a’ వాడకూడదు, గమనించండి. ‘A hair’ అని అంటే ఒక్క వెంట్రుక అని అర్థం వస్తుంది.

Tom
OK! Now, time to practise!

సౌమ్య
ఇక్కడ ఈమె చాలా ఉద్వేగంగా ఉన్నారు. ఆమె సంతోషానికి కారణం ఏమిటో విందాం. తను ఎవరి గురించి మాట్లాడుతున్నారు?

‘Hey! I’m so happy! I have a new boyfriend!’

సౌమ్య
Wow! A boyfriend! 'మీ బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉంటారు?' అని ఇంగ్లిష్‌లో ఎలా అడుగుతారో చెప్పండి.

Tom
What does your boyfriend look like? You could also say ‘what does he look like’?

సౌమ్య
Did you say the same?
ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు మీరు చెప్పండి.

‘What does your best friend look like?’

సౌమ్య
‘ఆమె మరీ అంత పొట్టి కాదు, తనకు పొడుగు జుత్తుంది’ అని ఎలా చెప్తారు?

‘She’s quite short and has long hair.’

సౌమ్య
Well done! ‘Quite’ అంటే కొంచం అని అర్థం. గుర్తుంచుకోండి.

Tom
Great! So, now you know how to describe appearance, practise with some of your friends!

సౌమ్య
మరో 'How do I…' కార్యక్రమంలో మళ్లీ కలుసుకునేవరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. Bye!

Tom
Bye!

Learn more!

1. ఆకృతి, రూపం గురించి అడగడం ఎలా?

ఆకారం, రూపు గురించి అడుగుతున్నప్పుడు వాడవలసిన ముఖ్యమైన క్రియాపదం ‘look’..అంటే కనిపించడం. దీన్ని ‘like’ అనే పదంతో కలిపి వాడాలి...‘look like’.
‘Do’ అనేది ఒక auxiliary verb గా ప్రశ్నారూపం తేవడానికి ఉపయోగపడుతుంది.
‘He’ or ‘she’ అని వాడుతున్నప్పుడు third person form అయిన ‘does’ వాడాలి. పదాల వరుస క్రమం ఈ కింది విధంగా ఉండాలి.

'What does he/she look like?

2. ఆకృతి, రూపం గురించి వివరించడం ఎలా?

We can use ‘be’ to describe a person’s appearance. The third person form of ‘be’ is ‘is’.

ఎత్తు గురించి చెప్పేటప్పుడు ‘be’ కూడా వాడాలి. ‘Tall’-పొడుగు, ‘short’-పొట్టి..ఇవి, ఎత్తు గురించి చెప్పడానికి తరచుగా వాడే పదాలు.

He is tall.

ఎత్తు గురించే కాకుండా వయసు, ఆకృతి లాంటి వాటి గురించి చెప్తున్నప్పుడు కూడా ‘be’ వాడాలి. అంతేకాకుండా ‘is’ తరువాత ఆ వ్యక్తి గురించి మన అభిప్రాయం కూడా చెప్పొచ్చు.

Pretty..సొగసైన (ఆడవారికి వర్తిస్తుంది), handsome..అందమైన/చక్కని (మగవారికి వర్తిస్తుంది) లాంటి విశేషణాలు వాడొచ్చు.

She is 25 years old.
She is pretty.
He is tall and thin.

‘Quite’ అనే adverb కూడా కలిపి వాడొచ్చు.‘Quite’ is a word we use to reduce the strength of an adjective. It is similar to ‘a little bit’...కొంచం అని అర్థం.

She is quite short.
He is quite tall.

3. రూపం వివరించడానికి 'have' వాడొచ్చా?

జుత్తు పొడుగు, రంగు, కనుపాపల రంగు వంటి ముఖకవళికలను వివరించడానికి ‘have’ వాడొచ్చు. ‘Has’ is the third person form of ‘have’.

He has short, blonde hair.
She has blue eyes.

ఇక్కడ ‘hair’ కు ముందు ‘a’ వాడకూడదు, గమనించండి. ‘A hair’ అని అంటే ఒక్క వెంట్రుక అని అర్థం వస్తుంది. అలాగే , సాధారణంగా, ముందు జుత్తు పొడవు తరువాత రంగు చెప్తాం.

How do I talk about someone's appearance?

4 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

Felicitaciones. Has completado el quiz.
Excellent! ¡Muy bien! Bad luck! Tu puntaje :
x / y

Can you describe the appearance of somebody you know in English?
మీకు తెలిసిన వ్యక్తి ఆకృతి, రూపం గురించి ఇంగ్లిష్‌లో వివరించగలరా?

Tell us on our Facebook group!
మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.

Join us for our next episode of How do I..., when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Sesión de vocabulario

  • mother
    తల్లి
    boyfriend
    బాయ్‌ఫ్రెండ్‌
    pretty
    సొగసైన
    handsome
    అందమైన(మగవారికి ఉపయోగించే పదం)
    long
    పొడుగు/పొడవైన
    short
    పొట్టి
    blonde
    బంగారు రంగు/చక్కని
    dark
    గాఢమైన/దట్టమైన