Sesión 9

Listen to find out how to use the preposition 'at', 'on' and 'in' when talking about times in English.
ప్రత్యేకమైన రోజు, తేది, సమయాల గురించి చెప్పేటప్పుడు 'at', 'on', 'in' లను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో విని తెలుసుకోండి. 

Sesión 9 puntuación

0 / 3

  • 0 / 3
    Actividad 1

Actividad 1

How do I talk about special dates and times?

Listen to find out how to use the preposition 'at', 'on' and 'in' when talking about times in English.
కాలం, తేది, సమయాల గురించి చెప్పేటప్పుడు 'at', 'on', 'in' లను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Mostrar la transcripción Ocultar la transcripción

సౌమ్య
హాయ్!  ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు. 

Sian
Hi, everybody! 

సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్‌లో ప్రత్యేకమైన రోజుల గురించి టైం గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ముందుగా ముగ్గురు వ్యక్తులు ఒక ముఖ్యమైన రోజు గురించి చెప్తున్నారు.  విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి వాళ్లు నెల, తారీకు లాంటి విషయాలను ఎలా చెప్తున్నారో జాగ్రత్తగా గమనించండి. 

I was born at 3 p.m. on Sunday the 6th March.

I was born in the summer, in July.

I was born in 1992. 

సౌమ్య
OK, వాళ్లంతా ఎప్పుడెప్పుడు పుట్టారో ఆ తేదీ, సమయం చెప్పారు. 'I was born' అనే క్రియను వాడారు. అంటే ‘నేను పుట్టాను’ అని అర్థం. But now, shall we look at some of the prepositions you can use to talk about time? 

Sian
Yes, let's do that. So there are three main prepositions we use to talk about time and they are 'at', 'on' and 'in', and there are some simple rules about when to use them. 

సౌమ్య
అవును. ఒక రెండు నిర్దిష్ట సమయాలను తీసుకుని ఈ prepositions ఎలా ఎప్పుడు వాడాలో నేర్చుకుందాం. ఒంటిగంట, 9 గంటలు..ఈ రెండూ తీసుకుందాం. ఇందాక వాళ్లు టైంతో ఏ preposition  వాడారో మీకు గుర్తుందా? మళ్లీ విందాం.

I was born at 3 p.m. 

Sian
That's right. So we use 'at' with specific times. For example, 'see you at 2 o'clock'. Let's check the pronunciation – the word 'at' is not very strong in the sentence so it sounds like 'ut'. 

Let's practise. Repeat after me: 

'at 3 p.m'. 

'I was born at 3 p.m'. 

సౌమ్య
అంతేకాకుండా కొన్ని పదబంధాల్లో కూడా 'at' ను వాడొచ్చు. ఉదాహరణకు 'at the weekend' - వారాంతంలో, 'at night' – రాత్రిపూట. 

Sian
Yes, now let's look at days. Can you remember which preposition was used with days, like 'Sunday'? Let's listen again to find out.

I was born on Sunday. 

Sian
OK, so we use 'on' with days, so for example 'on Monday', 'on Tuesday'. 

సౌమ్య
అంతేకాకుండా తేదీలు చెప్పేటప్పుడు కూడా 'on' వాడాలి. ఉదాహరణకు మార్చి 6 వ తారీకు నాడు అని చెప్పాలంటే 'on the 6th of March' అనాలి.

I was born on the 6th of March. 

Sian
So, that leaves us one more preposition, 'in'. Can you remember what kinds of words 'in' was used with in the examples you heard? Let's listen again to check.

I was born in the summer, in July. 

I was born in 1992.

సౌమ్య
విన్నారా? ఋతువులు, కాలాలు, నెలలు, సంవత్సరాలు చెప్పేటప్పుడు 'in' వాడాలి. ఉదాహరణకు ‘in the summer’, ‘in July’, ‘in 1992’.  

Sian
Yes, so 'in' is used with longer periods of time. We also use 'in' with 'the morning', 'the afternoon' and 'the evening'. For example, 'see you in the morning'. 

సౌమ్య
అర్థమైందా? అలాగే కొన్ని సమయాలను చెప్పడానికి ఏ prepositions వాడక్కర్లేదు. ఉదాహరణకు 'today' - ఇవాళ, 'tomorrow' – రేపు. 

Sian
That's right. So we just say 'see you tomorrow' with no preposition. We also don't need 'at', 'on' or 'in' with phrases with 'next', for example 'next week' or 'next year'. 

సౌమ్య
Prepositions ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో మీకు పూర్తిగా అర్థమైంది కదూ? సరే, కొంత సాధన చేద్దామా! మీ స్నేహితులు మిమ్మల్ని మీ స్కూలు ఏ సంవత్సరంలో అయిపోయింది? అని అడిగారనుకుందాం. 1999 లో అయిపోయింది అని చెప్పాలి. ఎలా చెప్తారు? ‘Left school’ అనే క్రియను వాడండి. తరువాత Sian కూడా జవాబు చెబుతారు. విని, నీ జవాబు సరిచూసుకోండి. 

Sian
I left school in 1999. 

సౌమ్య
Did you say the same? తరువాత, మీరు మీ నేస్తాన్ని కలవాలని అనుకుంటున్నారు. తనకి మంగళవారం పొద్దున్న 10 గంటలకి కలుస్తాను అని చెప్పాలి. ప్రయత్నించండి. 

Sian
I'll see you on Tuesday at 10 o'clock in the morning. 

సౌమ్య
Did you say the same? 

Sian
It's time for us to go now, but we'll be back at the same time next week. 

సౌమ్య
See you next week Sian, bye everyone! 

Sian
Bye, everyone! 

Learn more

1) తేదీ, సమయాల గురించి చెప్తున్నప్పుడు 'at', 'on', 'in' లను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి? 

సాధారణ నియమాలు:
నిర్దిష్ట సమయాలను చెప్పడానికి 'at' వాడాలి.

  • I get up at 6 o' clock.
  • See you at midday.

రోజులు, తారీకులు చెప్పడానికి 'on' వాడాలి.

  • I'm going on holiday on Monday.
  • My son was born on Tuesday 22nd April.

నెలలు, కాలాలు, ఋతువులు, సంవత్సరాలు చెప్పడానికి 'in' వాడాలి.

  • I started school in the winter, in 1988.

2) 'At', 'on', 'in' లను వాడే సందర్భాలు ఇంకా ఏమైనా ఉన్నాయా?

అవును. గుర్తుంచుకోవలసిన కొన్ని కామన్ పదబంధాలు: 'at the weekend' - వారాంతంలో, 'at night' - రాత్రిపూట, 'at the moment' - ఈ క్షణంలో.

'in the morning' - ఉదయం, 'in the afternoon' - మధ్యాహ్నం, 'in the evening' - సాయంత్రం.

  • I can't get to sleep at night.
  • What did you do at the weekend?
  • I have an English class in the evening.

3) Prepostions వాడక్కర్లేని సందర్భాలున్నాయా?

అవును. కొన్నిసార్లు ఏ prepostions వాడక్కర్లేదు. ఉదాహరణలు: 'tomorrow', 'yesterday', 'Next'.

  • See you next week.
  • I'll be back tomorrow.

How do I talk about dates and times?

3 Questions

Complete the gaps in these sentences with the correct preposition.
సరైన prepositions తో ఖాళీలను పూరించండి.

Felicitaciones. Has completado el quiz.
Excellent! ¡Muy bien! Bad luck! Tu puntaje :
x / y

Join our Facebook group to practise everyday!
మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి రోజూ ప్రాక్టీస్ చెయ్యండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Sesión de vocabulario

  • months
    నెలలు

    seasons
    ఋతువులు

    years
    సంవత్సరాలు

    dates
    తేదీలు

    winter
    చలికాలం

    summer
    వేసవికాలం

    spring
    వసంత ఋతువు

    autumn
    శరదృతువు

    today
    ఈరోజు 

    tomorrow
    రేపు