ਸੈਸ਼ਨ 8

Listen to find out what you can say when you don't know a word in English.
మనకు ఏదైనా పదం తెలియనప్పుడు దాన్ని ఎలా వివరించాలో విని తెలుసుకోండి.

Sessions in this unit

Session 8 score

0 / 3

  • 0 / 3
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

How do I describe a word I don't know?

Listen to find out what you can say when you don't know a word in English.
మనకు ఏదైనా పదం తెలియనప్పుడు దాన్ని ఎలా వివరించాలో విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Show transcript Hide transcript

సౌమ్య
హాయ్!  ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు. 

Sian
Hi, everybody! 

సౌమ్య
మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక పదం గబుక్కున తోచలేదనుకోండి. అప్పుడు దాన్ని వర్ణించే ప్రయత్నాలు చేస్తాం కదా. అలాగ ఇంగ్లిష్‌లో ఏదైనా ఒక పదం తోచనప్పుడు దాన్ని ఎలా వివరించాలో ఇవాళ నేర్చుకుందాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వాళ్లకు తోచని పదాల గురించి వివరిస్తున్నారు. విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి వాళ్లు ఎలా వివరిస్తున్నారో జాగ్రత్తగా వినండి . 

Um, it's a kind of fruit. It's yellow and long.

It's an adjective and it’s the opposite of clean.

It's like a clock, but you wear it on your arm. 

సౌమ్య
వాళ్లు ఏం చెప్పాలనుకున్నారో మీకేమైనా అర్థమయ్యిందా? మొదటి వ్యక్తి banana - అరటిపండు గురించి చెప్తున్నారు. రెండో వ్యక్తి dirty – మురికిగా ఉండడం గురించి చెప్తున్నారు. మూడో వ్యక్తి చేతికి తగిలించుకునే watch - వాచీ గురించి చెప్తున్నారు. So now let's look at some techniques you can use if you don't know a word.

Sian
Good idea!
So the first person used 'it's a kind of'. You can use this phrase to talk about the category of the thing you are describing. So, for a banana, we can say 'it's a kind of fruit’. And for 'a cat' we can say 'it's a kind of animal.' 

సౌమ్య
Yes, so 'it's a kind of…' అంటే “…ఇలాంటిది” “…ఇలాంటి రకం” అని అర్థం.  ‘Kind’ కు బదులు ‘type’ అని కూడా వాడొచ్చు. We can also say 'it's a type of'. Can't we, Sian? 

Sian
That's right. So we can also say ‘it's a type of fruit'. So for 'coffee' we can say 'it's a type of drink' or 'it’s a kind of drink' and they have the same meaning. Let’s practise the pronunciation. Repeat after me: 

'It's a kind of drink'. 

'It's a type of drink'. 

సౌమ్య
రెండో వ్యక్తి మురికిగా ఉండడాన్ని సూచించే పదాన్ని వివరించారు.  ‘Dirty - ఇది ఒక విశేషణం. ఇది  ‘clean’ – శుభ్రంగా ఉండడానికి వ్యతిరేకం అని చెప్పారు. ఈ వాక్యం ఎలా చెప్పారో మీకు గుర్తుందా? మళ్లీ విందాం.

It’s the opposite of clean. 

Sian
Yes, 'it's the opposite of…'  So this is a useful way to describe an adjective, if you know it’s opposite. So let's have a quick go – how can you describe the adjective 'cold'? OK, we can say: It's the opposite of hot! 

సౌమ్య
Did you get it right? ఇంక మూడో వ్యక్తి వాచీని వివరించారు. ఇది గడియారాన్ని పోలి ఉంటుంది అని చెప్పారు.  ఆ వాక్యం మళ్లీ విందాం. 

It's like a clock. 

Sian
So we can use the phrase 'it's like' plus the thing to say that something is similar to something else. You can also use 'it's similar to'. 

Sian
Let's practise the pronunciation. Repeat after me. 

'It's like a clock'. 

'It's similar to a clock'. 

సౌమ్య
Great! ఇప్పుడు కొంచం ప్రాక్టీస్ చేద్దామా?!  ‘వెల్లుల్లిపాయ’ అని చెప్పాలి. కానీ ఆ పదం మీరు మర్చిపోయారు. ఇప్పుడు దీన్ని ఇంగ్లిష్‌లో ఎలా వివరిస్తారు? అది vegetables - కూరగాయల్లో ఒకటి లేదా  ఉల్లిపాయలాగుంటుంది అని చెప్తే సరిపోతుంది. ప్రయత్నించండి.   

Sian
It's a kind of vegetable. It's like an onion.

సౌమ్య
Did you say the Same? 'It’s a type of vegetable' and it's similar to an onion అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అసహ్యం, వికృతం అని అర్థాలొచ్చే ఒక పదం చెప్పాలి.   అదేమిటో మీకు తెలీదు. దీన్ని ఎలా వివరిస్తారు? ఇది beauty - అందానికి వ్యతిరేకం అని చెప్పొచ్చేమో ప్రయత్నించండి. 

Sian
It's the opposite of beautiful. 

సౌమ్య
Did you say the same? సరే ఇప్పుడు అసలు పదాలేమితో కూడా చూద్దాం. ‘Garlic’ అంటే వెల్లుల్లిపాయ, dirty అంటే అసహ్యం/వికృతం. 

Sian
Well done! Now hopefully you won't feel lost without a dictionary! 

సౌమ్య
That's true! See you next time. 

Sian
Bye, everyone! 

Learn more

1) ఏదైనా పదం గబుక్కున తోచనప్పుడు దాన్ని ఎలా వివరించాలి?

A) 'It's a kind of...' లేదా 'it's a type of...' అని వాడి అది ఏ రకానికి చెందినదో చెప్పొచ్చు.

  • It's a kind of hot drink. (coffee)
  • It's a type of fruit. (a banana)

రంగు, రూపు లాంటి అదనపు సమాచారం కూడా ఇవ్వొచ్చు. For example , for banana, you can say 'it’s long and yellow' – 'it's long and yellow'.

B) ఒకవేళ ఆ పదం విశేషణం అయితే దానికి వ్యతిరేక పదం చెప్పి వివరించొచ్చు. 'It's the opposite of' అని చెప్పి వ్యతిరేక పదం చెప్పొచ్చు.

  • It's the opposite of clean. (dirty)
  • It's the opposite of hot. (cold)

C) 'It's like...' or 'it's similar to..' అని వాడి ఆ పదం దేనికి దగ్గరగా ఉంటుందో లేదా దేనిలా ఉంటుందో చెప్పొచ్చు. 

  • It's like a clock. (a watch)
  • It's like an onion (garlic)

How do I describe a word I don't know?

3 Questions

Complete the gaps in these sentences describing a word.
ఖాళీలను పూరించండి.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Join our Facebook group to practise everyday!
మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి రోజూ ప్రాక్టీస్ చెయ్యండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • garlic
    వెల్లుల్లిపాయ    

    a clock
    గడియారం

    a watch
    వాచీ

    dirty
    మురికి

    ugly
    అసహ్యం/వికృతం

    beautiful
    అందం