ਸੈਸ਼ਨ 27

Listen to learn different ways of saying goodbye.
Goodbye చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.

Session 27 score

0 / 3

  • 0 / 3
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

How do I say goodbye?

రోజులో ఎంతమందికి bye లేదా goodbye చెప్తుంటారు? అలా చెప్తున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి, స్థలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చెప్పే విధానం మారుతుంటుంది కదా! వీడుకోలు చెప్పడంలో వివిధ పద్ధతులు ఇవాళ నేర్చుకుందాం.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Show transcript Hide transcript

సౌమ్య 
Hello!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.

Sam 
Hi, everybody.

సౌమ్య 
వీడుకోలు చెప్పడంలో వివిధ పద్ధతులను ఇవాళ నేర్చుకుందాం. బాగా తెలిసినవాళ్లకి ఒకలాగ, కొత్తగా పరిచయమైన వ్యక్తులకు మరోలాగ bye లేదా goodbye చెప్తుంటాం కదా. ఈ వ్యత్యాసాలన్ని ఇవాళ తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఎలా వీడుకోలు చెప్తున్నారో వినండి.

Inserts
Goodbye. It was nice meeting you. 
Bye! Have a good weekend. 
I have to go now. See you later.

సౌమ్య 
విన్నారా? మొదటి వ్యక్తి అప్పుడే తనకి పరిచయమైన మరో వ్యక్తికి వీడుకోలు చెప్పారు. So, Sam, shall we look at the language they used to say goodbye?

Sam 
Yes, so one very common way is to just use the word 'goodbye'. This can be used in formal and in informal situations. So the first person says 'goodbye', but then they follow it with another phrase. Can you remember? Let's listen again. 

Insert
Goodbye. It was nice meeting you. 

సౌమ్య  
Sam'It was nice meeting you' – ‘మిమ్మల్ని కలవడం చాలా బావుంది’ అని చెప్పారు.

Sam
Yes, so you can use this phrase when you say goodbye to someone who you have just met for the first time. Let’s quickly practise that. Repeat after me: 

‘Goodbye.’

‘It was nice meeting you.’ 

You can also change this phrase if you are talking to someone you already know – in this case you can say 'it was nice seeing you'. 

సౌమ్య 
తరువాతి వ్యక్తి ఏమన్నారో గుర్తుందా? మళ్లీ విందాం. 

Insert
Bye! Have a good weekend. 

Sam 
So she said 'bye' which is a common short form of 'goodbye' often used when you are talking to friends. She then says 'have a good weekend'. It's polite to say something like this after you say 'goodbye'. You can vary it in different ways, for example, 'have a lovely evening' or 'have a great holiday'. Let's quickly practise that. Repeat after me: 

‘Bye! Have a good weekend.’
‘Bye! Have a lovely evening.’ 

సౌమ్య 
So ‘have a good weekend’, ‘have a good evening’ ఇలా ఏదైనా చెప్పొచ్చు. చివరి వ్యక్తి కొంచం భిన్నాంగా చెప్పారు. గుర్తుందా?

Insert 
I have to go now. See you later.

Sam 
So instead of saying 'bye' you can say 'see you later'. There are lots of different variations of this, for example, 'see you tomorrow' 'see you soon' or you can just say 'see you', which is an informal way to say 'goodbye'. Let's practise that.

‘See you later!’

‘See you soon!’

‘See you!’ 

సౌమ్య 
So 'goodbye' అనే బదులు 'see you!’ అనొచ్చు. 'I have to go now' అన్నారు కదా. ‘నేనింక వెళ్లాలి bye’ అని చెప్తే సడన్ గా bye చెప్పినట్టు ఉండదు.

Sam 
Yes, so let's quickly practise the pronunciation.

‘I have to…’

‘I have to go now.’ 

సౌమ్య 
Thanks, Sam. సరే, కొంచం ప్రాక్టీస్ చేద్దామా?  మీరు కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యారు. మీ కలీగ్‌ని  ఇప్పుడే మొదటిసారి కలిసారు. తనకి bye చెప్పాలి. ఎలా చెప్తారు? మిమ్మల్ని కలవడం బావుంది అని కూడా చెప్పండి. తరువాత Sam జవాబు చెప్తారు. విని మీ జవాబు సరిచూసుకోండి.

Sam
Goodbye. It was nice meeting you.

సౌమ్య 
Nice. ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ కి goodbye చెప్పాలి. తను సెలవులకి విహారయాత్రకెళుతోంది. ఎలా చెప్తారు? Lovely holiday అని వాడండి. 

Sam
Bye! Have a lovely holiday.

సౌమ్య 
Good. చివరిగా మీరు మీ నేస్తానికి చెప్పాలి. అయితే రేపు మళ్లీ తనని మీరు కలుస్తారు. అప్పుడెలా చెప్తారు? 

Sam
See you tomorrow! 

సౌమ్య 
Well done! Now I have to go. See you all next week. Bye! 

Sam
Yes, see you! Have a great weekend.

Learn more

1. 'Goodbye' కి 'bye'  కి తేడా ఉందా?

లేదు. 'Goodbye' కి short form 'bye'. కానీ ఫార్మల్ గా మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు 'goodbye' రాయడం పరిపాటి.

2. Goodbye కి బదులు వేరే పదాలేమైనావాడొచ్చా?

మనకు బాగా తెలిసినవాళ్లతో ఈ కింది విధాలుగా చెప్పొచ్చు.

  • See you later!
  • See you tomorrow/ on Monday/ next week!
  • See you! 

'I have to go now' అని కూడా కలపొచ్చు.

3. మిమ్మల్ని కలవడం బావుంది, మీతో బాగా గడిపాం అని ఎలా చెప్పాలి?

ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు ఈ కింది రకాలుగా చెప్పొచ్చు.

  • (It was) nice meeting you!
  • (It was) nice to meet you!

తెలిసినవాళ్లని కలిసి బాగా టైం గడిపాక ఈ కింది రకాలుగా చెప్పొచ్చు.

  • (It was) nice seeing you!
  • (It was) nice to see you!

4. Goodbye అని మర్యాదపూర్వకంగా ఎలా చెప్పాలి?

It's polite to wish someone well after you go your separate ways with phrases like:

  • Have a good weekend!
  • Have a lovely evening!
  • Have a great holiday!

How do I say goodbye?

3 Questions

Choose the best option depending on the situation.
సందర్భాన్ని బట్టి సరైన పదాన్ని ఎంచుకోండి.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

We have to go now. Would you like more episodes of How do I..? They’re a useful way to learn English, I’m sure you’ll agree! Find more ways to learn English in our Facebook group.

ఇప్పుడింక సెలవు తీసుకోవాలి. మీరు మరిన్ని How do I... కార్యక్రమాలు వినాలనుకుంటున్నారా? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఇవి ఉపయోగకరంగా ఉన్నాయా?  మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మీ అభిప్రాయం చెప్పండి.

Session Vocabulary

  • to have to
    తప్పక

    evening
    సాయంత్రం

    nice
    బావుంది