1

ਯੂਨਿਟ 1: Essential English Conversation

ਯੂਨਿਟ ਚੁਣੋ

  1. 1 Essential English Conversation

ਸੈਸ਼ਨ 3

What do you do? మీరేం చేస్తూ ఉంటారు?

Listen to find out how to tell someone what your job is.

మీరు కొత్తవారిని కలిసినప్పుడు:
ఉద్యోగం గురించి ఎలా మాట్లాడాలో ఇక్కడ తెలుసుకోండి.

Session 3 score

0 / 3

  • 0 / 3
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

What do you do? మీరేం చేస్తూ ఉంటారు?

Listen to find out how to tell someone what your job is.
ఉద్యోగం గురించి ఎలా మాట్లాడాలో ఇక్కడ తెలుసుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో విని క్విజ్ ని పూర్తి చేయండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో! బాగున్నారా? ఇంగ్లిష్ సంభాషణలకు స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి అత్యవసరమైన విషయాలను మీరిక్కడ చూస్తారు – ఇవి లేకుండా ఎవరూ ఈ భాషని నేర్చుకోలేరు. నా పేరు కల్యాణి. ఈ సంచికలో, మీరు చేసే ఉద్యోగాలూ, వృత్తుల గురించి చెప్పడం నేర్చుకుంటారు.

ఇదిగో వీరిద్దరూ తాము చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నారు, విందామా మరి...

Amanda
Hi James, What do you do?

James
I’m an engineer. How about you Amanda?

Amanda
I’m a farmer.

కల్యాణి
కాస్త కష్టంగా అనిపించిందా? మరేం పర్లేదు! మీరు సుళువుగా సాధన చేసుకునేలా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందిస్తాం.
మొదట ... “నువ్వేం చేస్తూ ఉంటావు?” “What do you do?” అని జేమ్స్‌ని అమందా అడిగింది. ఒకరి వృత్తి గురించి కనుక్కోవాలంటే ఇంగ్లిష్‌లో ఆ ప్రశ్న వేస్తాం. ఏదీ ... ఒకసారి విని మీరూ అనండి.

What do you do?

కల్యాణి
జేమ్స్ తనో “ఇంజనీర్‌ని” “an engineer” అని చెప్పాడు. అలాగే మీరు కూడా నేను ‘I’m’ అని ... మీరే వృత్తిలో ఉన్నారో అది కలిపి చెప్పొచ్చు.
ఇంజనీర్‌ అన్న మాట అచ్చుతో మొదలౌతుంది గనక “a engineer” అనలేదు, “an engineer” అన్నాం. ఈ విషయం గమనించండి. ఇదిగో - ఒకసారి విని మీరూ అనండి.

I’m an engineer.

కల్యాణి
తర్వాత అతను అమందాని అదే ప్రశ్న అడిగాడు. అలా అడగాలంటే “How about you?” అని వాడొచ్చు. ఇదిగో - మరోసారి విని మీరూ అనండి.

How about you?

కల్యాణి
అమందా - ఒక రైతు, అందుకని ఆమె “నేను”, “I’m” అని “ రైతును” “a farmer” అని చెప్పింది. ఈ మాటల్ని విని మీరూ తిరిగి అనండి.

I’m a farmer.

కల్యాణి
మీరేం పని చేస్తూ ఉంటారు? ... సరే మరి ... ఇప్పుడు కొన్ని వృత్తులను ఇంగ్లిష్‌లో ఏమంటారో విందాం.

నేనొక డ్రైవర్‌ని.
I’m a driver. 

నేనొక నర్స్‌ని.
I’m a nurse. 

నేను హోటళ్లలోనూ, రెస్టారెంట్లలోనూ వంటలు చేస్తాను. ( I cook in hotels and restaurants)
I’m a chef.

కల్యాణి
బాగుంది – ఇదిగో మరి కొంత మంది మాటలు వినండి, వాళ్లు చేసే పనుల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు.
క్లెయిర్‌ ఒక టీచర్ “a teacher”, ఏలిస్ ఒక సేల్స్ పర్సన్ “a salesperson”.

Hi Claire, what do you do?

I’m a teacher. How about you Alice?

I’m a salesperson.

కల్యాణి
మార్క్ ఒక బిల్డర్ “a builder” పీట్ ఒక డాక్టర్ “a doctor”.

Hi Mark, what do you do?

I’m a builder. How about you Pete?

I’m a doctor.

కల్యాణి
సరే, మళ్లీ చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లిష్ వాక్యాల్ని విన్నాక మీరూ అనండి.  

Hi James, What do you do?

I’m an engineer.

How about you, Amanda? 

I’m a farmer. 
 
కల్యాణి
సరే, మీరెంత బాగా ఇంగ్లిష్‌ను గుర్తుపెట్టుకున్నారో చూద్దాం! ఇప్పుడు ఈ వాక్యాల్ని తెలుగులో విని వాటిని మీరు ఇంగ్లిష్‌లో అనండి.

జేమ్స్, నువ్వేం చేస్తూ ఉంటావ్? 

Hi James, What do you do?

నేనొక ఇంజనీర్‌ని. 

I’m an engineer.

అమందా, మరి నీ సంగతి ? 

How about you, Amanda?

నేనొక రైతును. 

I’m a farmer.

Hi, what do you do? 

I’m a farmer

కల్యాణి
బ్రహ్మండం – ఇంగ్లిష్‌లో ఉద్యోగం గురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి అమందా ప్రశ్నకు జవాబివ్వండి.

Amanda
Hi James, What do you do?

James
I’m an engineer. How about you Amanda?

Amanda
I’m a farmer.

భలే చక్కగా చేశారు, ఇంగ్లిష్‌లో ఇప్పుడు మీ వృత్తి గురించీ మీరు చెప్పగలరు, ఎదుటి వారి వృత్తి గురించీ అడగగలరు. మీరు నేర్చుకున్నది సాధన చెయ్యడం మర్చిపోకండేం! ఎవరన్నా ఒక మిత్రునితో కలిసి ఇంగ్లీష్‌లో మీమీ ఉద్యోగాల గురించి చెప్పడం, అడగడం అనే అభ్యాసం చేస్తూ ఉండండి.
రోజు వారీ ఇంగ్లిష్‌ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

పూరించండి

3 Questions

ఈ ప్రశ్నలకు సరైన జవాబులిచ్చి మీరు నేర్చుకున్న విషయాల్ని చెక్ చేసుకోండి

Choose the correct answer.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

  • engineer
    ఇంజనీరు

    farmer
    రైతు

    driver
    డ్రైవరు

    nurse
    నర్సు

    chef
    హోటళ్లలోనూ, రెస్టారెంట్లలోనూ - వంటచేసే వ్యక్తి, షెఫ్

    teacher
    టీచరు

    salesperson
    సేల్స్ పర్సన్

    builder
    బిల్డర్

    doctor
    వైద్యుడు