1

ਯੂਨਿਟ 1: Essential English Conversation

ਯੂਨਿਟ ਚੁਣੋ

 1. 1 Essential English Conversation

ਸੈਸ਼ਨ 14

Listen to find out how to ask someone for their favourite place.
ఇష్టమైన జాగా గురించి ఎలా మాట్లాడాలో విని తెలుసుకోండి.

 

Session 14 score

0 / 3

 • 0 / 3
  ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

What’s your favourite place? మీకు ఇష్టమైన జాగా ఏది?

Listen to find out how to ask someone for their favourite place.

ఇష్టమైన జాగా గురించి ఎలా మాట్లాడాలో విని తెలుసుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో! బాగున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. మీరుండే ఊళ్లో – మీకిష్టమైన ప్రదేశం గురించి మాట్లాడడం- ఇవాళ నేర్చుకుందురు గాని.

ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.

Sian
Hi Phil, what’s your favourite place?

Phil
My favourite place is the market. How about you?

Sian
Mine is the restaurant.

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదటా...
‘నీకిష్టమైన జాగా ఏది?’ ‘What’s your favourite place?’ అని Sian అడిగింది. విని తిరిగి మీరూ అనండి.
What’s your favourite place?

కల్యాణి
Phil కిష్టమైన జాగా, ‘favourite’ place ఏదని అన్నాడు? ‘Market’ అని చెప్పాడు. వినీ తిరిగి మీరూ అనండి.
My favourite place is the market.

కల్యాణి
మీకిష్టమైన జాగా ‘city centre’ అని చెప్పొచ్చు, లేదా ‘beach’ అని చెప్పొచ్చు.
My favourite place is the city centre.
My favourite place is the beach

కల్యాణి
అప్పుడు అతనూ అదే విషయం కనుక్కోవాలనుకున్నాడు. అందుకని ‘నీ సంగతేమిటి?’ ‘How about you?’ అని అడిగాడు. వినీ తిరిగి మీరూ అనండి.
How about you?

కల్యాణి
‘The restaurant’ అనే మాటకి ‘mine’, నాది (అంటే ఇక్కడ, నాకు ఇష్టమైన జాగా అని), దాన్ని కలిపి చెప్పింది. మీరూ అనండి.
Mine is the restaurant.

కల్యాణి
సరే – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా దారి కనుక్కుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి. Mark కి ‘park’ ఇష్టం, Pete కి ‘river’ నది అంటే ఇష్టం.

Hi Mark, what’s your favourite place?
My favourite place is the park. How about you?
Mine is the river.

Aliceకి ‘swimming pool’ ఇష్టం. Claire కిష్టమైన జాగా ‘cinema’.

Hi Alice, what’s your favourite place?
My favourite place is the swimming pool.
Mine is the cinema.

కల్యాణి
Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి.

What’s your favourite place?
My favourite place is the market.
How about you?
Mine is the restaurant.

కల్యాణి
సరే! ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

నీకిష్టమైన జాగా ఏది?
What’s your favourite place?

నాకిష్టమైన జాగా market.
My favourite place is the market.

నీ సంగతేమిటి?
How about you?

నా జాగా restaurant.
Mine is the restaurant.

కల్యాణి
Fantastic – ఇంగ్లీష్‌లో నీకిష్టమైన జాగా గురించి ఎలా మాట్లాడాలో తెలిసింది కదా. మరి Sian ప్రశ్నకు జవాబివ్వండి.
What’s your favourite place?
Mine is the restaurant.

కల్యాణి
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Sian
Hi Phil, what’s your favourite place?

Phil
My favourite place is the market. How about you?

Sian
Mine is the restaurant.

కల్యాణి
Well done, భలే చక్కగా చేశారే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్‌లో- మీరుండే ఊళ్లో – మీకిష్టమైన ప్రదేశం గురించి మాట్లాడగలరు కదా. ఇక మీ మిత్రులతో కలిసి ఇంగ్లీష్‌లో అభ్యాసం చేస్తూ ఉండండి.
రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.

ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

What’s your favourite place?

3 Questions

ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

Choose the correct answer.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

 • What’s your favourite place?
  నీకిష్టమైన జాగా ఏది?

  My favourite place is ______.
  నాకిష్టమైన జాగా______.

  the market
  మార్కెట్

  the restaurant
  రెస్టరెంట్

  the park
  పార్క్

  the river
  నది

  the swimming pool
  స్విమ్మింగ్ పూల్

  the cinema
  సినిమా

  the city centre
  సిటీ సెంటర్ 

  the beach
  బీచ్