Lição 10

Listen to find out how to talk about your education.
మీ చదువు గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.

Lições desta unidade

Pontos alcançados nesta lição

0 / 3

  • 0 / 3
    Atividade 1

Atividade 1

How do I talk about my education?

పాఠం వినేముందు Session Vocabulary చూడండి. మీరు ఏ విద్యాసంస్థలకు వెళ్లారు? ఏ వయసులో వెళ్లారు?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Mostre a transcrição Oculte a transcrição

సౌమ్య
హాయ్!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు. 

Sam
Hi, everybody. 

సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్‌లో మనం..మ్మ్మ్ నేను చెప్పను. మీరే గెస్ చెయ్యగలరేమో చూద్దాం. ఇక్కడ కొందరు వ్యక్తులు తమ గురించి ఏదో చెప్తున్నారు. విందాం. వాళ్లు మాట్లాడుతున్న అంశం ఏమిటి? కనుక్కోండి చూద్దాం.

  • I started primary school when I was 6.
  • I left high school when I was 18 to go to university.
  • I graduated from Manchester University and I got a degree in engineering.
  • I left secondary school when I was 16 and I went to college, where I got a certificate in business.

సౌమ్య
వాళ్లంతా వాళ్ల చదువుల గురించి మాట్లాడుతున్నారు. అవునా?! 

Sam
Yes, they used lots of different ways to talk about education. So let’s have a closer look! 

సౌమ్య
అవును. వాళ్లు ఎక్కడెక్కడ చదువుకున్నారో చెప్పారు. 'Primary school' అంటే ప్రాథమిక పాఠశాల 'secondary school' లేదా 'high school'  అంటే ఉన్నత పాఠశాల, 'college' - కళాశాల, 'university' విశ్వవిద్యాలయం. 

Sam
And what verbs did they use with these places? Let’s listen again – the verbs will come before the schools. 

I started primary school when I was 6.

I left secondary school when I was 16 and I went to college.

సౌమ్య
Ok, 'started' అంటే మొదలుపెట్టడం, 'left' అంటే వదిలిపెట్టడం, 'went to' అంటే వెళ్లడం..వెళ్లాను అని అర్థం. 

Sam
And these verbs are all in the past simple. Shall we practise the pronunciation? Please repeat after me: 

'I started primary school when I was 6. '

'I left secondary school when I was 16… '

'…and I went to college. ' 

సౌమ్య
ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు: 'went' తరువాత 'to' వాడాలి. రెండోది, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీల ముందు 'the' వాడకూడదు.  మళ్లీ విందాం. ఈసారి అర్హతల గురించి ఎలా చెప్పారో చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఒకే క్రియాపదాన్ని వాడారు. అదేంటి? 

I graduated from Manchester University.

I got a degree in engineering.

I got a certificate in business. 

Sam
Did you hear it? The verb they used twice was ‘got’. 

సౌమ్య
అవును. అతను/ఆమె 'got a degree in engineering' - ఇంజినీరింగ్‌లో డిగ్రీ సంపాయించాను అన్నారు. తరువాత ‘got a certificate in business' - బిజినెస్‌లో సర్టిఫికెట్ సంపాయించాను అన్నారు. ఇక్కడ డిగ్రీ లేదా సర్టిఫికెట్ ఎందులో సంపాయించారో చెప్పడానికి 'in'  అని వాడాలి. ఇంకో క్రియాపదం గమనించారా? 'Graduated' - గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇది 'graduate' కి భూతకాలం. 

Sam
And after ‘graduated’, it’s important to remember to use ‘from’ before the name of the place. Let’s practise saying these altogether. Repeat after me:

'I got a degree in engineering '.

'I got a certificate in business'.

'I graduated from Manchester University '.

సౌమ్య
Great! ఇంకో ముఖ్యమైన సంగతి. వాళ్లు ఏ వయసులో ఏది చేసారో ఎలా చెప్పారు? మరోసారి విందాం.   

I started primary school when I was 6.

I left high school when I was 18.

I left secondary school when I was 16. 

సౌమ్య
వాళ్లంతా 'when I was' అని తరువాత వయసు చెప్పారు. 

Sam
Let’s try it! Repeat after me: 

'when I was…' 

సౌమ్య
OK, మీ చదువు గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో అర్థమయ్యింది కదూ! ఇప్పుడు కొంచం సాధన చేద్దాం. మీరు 'primary school' లో చేరినప్పుడు మీ వయసెంత? చెప్పండి. ఇక్కడ ఏ క్రియాపదం వాడాలో గుర్తుందా? Started అనాలా? Left అనాలా? తరువాత Sam కూడా చెప్తారు. విని, మీ జవాబు సరిచూసుకోండి.

Sam
I started primary school when I was 6. 

సౌమ్య
Good! ఇప్పుడు మీకు ఎందులోనైనా సర్టిఫికెట్ వచ్చింది అని చెప్పండి. సబ్జెక్ట్ మీ ఇష్టం. 

Sam
I got a certificate in teaching. 

సౌమ్య
Is that true, Sam? 

Sam
Yes, it is! And now you can talk about your education, as well. 

సౌమ్య
And please join us for the next episode of How do I…for more education! Bye! 

Sam
Bye bye!

Learn more

1) మనం చదువుకున్న విద్యాసంస్థల గురించి చెప్పడానికి ఏ క్రియాపదాలు వాడాలి?

ఈ కిందివన్నీ వాడొచ్చు:
'started' - మొదలుపెట్టాను
'left' - వదిలిపెట్టాను
'went to' - వెళ్లాను

ఈ మూడూ కూడా భూతకాలమే! 'Start' కు భూతకాలం 'started', 'leave' కు భూతకాలం 'left', 'go to' కు భూతకాలం 'went to'.

  • I started primary school when I was 6.
  • I left secondary school when I was 16 and I went to college.

ప్రస్తుతం చదువుతున్న సంస్థల గురించి చెప్పడానికి 'go to' లేదా 'be in' అని వాడాలి.

  • My little brother goes to secondary school.
  • My little brother’s in secondary school.

'To attend' అని కూడా అనొచ్చు. ఇది కొంచం formal భాష అవుతుంది.

  • He attended Bristol University.

2) ఏదైనా విద్యాసంస్థకు ముందు 'the' ఎప్పుడు వాడాలి?

మామూలుగా స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ అని చెప్పినప్పుడు 'the' వాడకూడదు. కానీ ఆ విద్యాసంస్థ పేరు చెప్పినప్పుడు 'the' వాడాలి.

  • They go to the London School of Economics.
  • She went to the University of Manchester.
  • I left the College of West Anglia when I was 18.

3) మన qualifications - అర్హత లేదా యోగ్యతల గురించి ఎలా చెప్పాలి?

మనం సంపాయించుకునే యోగ్యతలు:

a certificate 
a diploma 
a degree 

వీటికి ముందు 'get' అనే క్రియ వాడాలి. భూతకాలమైతే 'got' అని వాడాలి. అలాగే 'to graduate' కూడా వాడొచ్చు. భూతకాలమైతే 'graduated' అని అనాలి. వీటిని వాక్యాల్లో చెప్తున్నప్పుడు 'in' అని వాడితే ఆ subject పేరు చెప్పాలి. కానీ 'from' అని వాడితే ఎక్కడ చదువుకున్నామో ఆ సంస్థ పేరు చెప్పాలి.

  • I got a degree in engineering from Sheffield University.
  • I graduated in engineering from Sheffield University.

4) వయసు గురించి ఎలా చెప్పాలి?

'when I was' + the age చెప్పొచ్చు. లేదా 'at the age of' + the age చెప్పొచ్చు.

  • I started primary school when I was 6.
  • I started primary school at the age of 6.

How do I talk about my education?

3 Questions

Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Tell us about your education and qualifications on our Facebook group!
మీ చదువు, సంపాయించిన డిగ్రీల గురించి మా ఫేస్బుక్ గ్రూప్ లో మాకు చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Vocabulário desta lição

  • primary school
    ప్రాథమిక పాఠశాల

    secondary school
    ప్రాథమికోన్నత పాఠశాల

    high school
    ఉన్నత పాఠశాల

    college
    కళాశాల

    university
    విశ్వవిద్యాలయం

    engineering
    ఇంజినీరింగ్‌

    business
    బిజినెస్‌/వ్యాపారం