1

유닛 1: Essential English Conversation

유닛 고르세요

  1. 1 Essential English Conversation

세션 29

Listen to find out how to ask what time it is.

세션 29 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

టైం ఎంత?

Listen to find out how to ask someone what time they start work.
మీరెన్ని గంటలకు పని మొదలెడతారు? అని ఎవరినైనా ఎలా అడగాలో విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz.

스크립트 보기 스크립트 숨기기

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. ఇవాల్టి ఎపిసోడ్‌లో టైం ఎంత? అని అడగడం, సమయం ఎంత అయ్యిందో చెప్పడంలాంటివి నేర్చుకుందాం.

ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.

Sian
Hi Phil, what time is it?
Phil
It’s eight forty-five.
Sian
Ah! I start work at ten to nine….. I’m late! Bye!
Phil
Bye!

సౌమ్య
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి. మొట్టమొదట Sian, Phil ని టైం ఎంత అని అడిగింది…’ what time is it ‘...విని చెప్పండి.

What time is it?

సౌమ్య
ఎనిమిది నలభై ఐదు ‘eight forty five’ అయ్యిందని Phil చెప్పాడు. టైం చెప్తున్నప్పుడు ముందు గంటలు చెప్పి తరువాత ఆ గంటలు దాటి ఎన్ని నిముషాలయ్యిందో చెప్పాలి. విని, మళ్ళీ చెప్పండి.

It’s eight forty-five.

సౌమ్య
అప్పుడు Sian… Ah! అంది. మనం తెలుగులో అమ్మో అంటాం కదా...అలాంటిదే! తను పది నిముషాల తక్కువ తొమ్మిది ten to nine కి పని మొదలెట్టానని చెప్పింది. టైం చెప్పేటప్పుడు తరువాత వచ్చే గంటకి ముప్ఫై నిముషాల కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఆ గంట అవ్వడానికి ఎన్ని నిముషాలు పడుతుందో అంత తక్కువ ఉంది అని చెబుతాం. Ten minutes to nine...తొమ్మిది అవ్వడానికి ఇంకా పది నిముషాలు ఉందన్నమాట... ten to nine నే eight fifty ఎనిమిది యాభై అని కూడా చెప్పొచ్చు. విని, మళ్ళీ చెప్పండి.

Ah! I start work at ten to nine

సౌమ్య
అప్పుడు Sian తనకి ఆలస్యం..late అయిపోయిందని చెప్పి, వెళ్ళొస్తాను..bye అని చెప్పింది.

I’m late! Bye!

సౌమ్య
Great – ఇదిగో ఈ సంభాషణలు విని, ఇంతవరకూ మీరేం నేర్చుకున్నారో అది మళ్ళీ మననం చేసుకోండి.
ఇప్పుడు ఎనిమిది ఇరవై... eight twenty అయ్యింది...Lauren పని చేయడానికి తొందరగా వచ్చేసాడు...
Lauren is early for work.

Hi, what time is it?

It’s eight twenty.

I start work at nine o’clock, I’m early!

సౌమ్య
Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లిష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి. ఈసారి ఒక్కొక్కటీ రెండేసిసార్లు వస్తుంది...వినండి.

What time is it?
It’s eight forty-five.
Ah! I start work at ten to nine!
I’m late! Bye!
Bye!
సౌమ్య
సరే! ఈ ఇంగ్లిష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం, ! ఏదీ ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లిష్‌లో అనండి.

టైం ఎంత?
What time is it?

ఎనిమిది నలభై ఐదు అయ్యింది
It’s eight forty-five

నేను పది నిముషాల తక్కువ తొమ్మిదికి పని మొదలెడతాను
I start work at ten to nine.

నాకు ఆలస్యం అయ్యింది
I’m late!

సౌమ్య  
Fantastic – Ok ఇప్పుడు మీకు ఎవరినైనా టైం ఎంత అని అడగడం, టైం ఎంతయ్యిందో చెప్పడం వచ్చేసింది. ఇప్పుడు Sian అడిగేవాటికి జవాబులు చెప్తూ ప్రాక్టీస్ చెయ్యండి.

What time is it?

సౌమ్య  
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి. 

Sian
Hi Phil, what time is it?
Phil
It’s eight forty-five.
Sian
Ah! I start work at ten to nine….. I’m late! Bye!
Phil
Bye!

సౌమ్య
Well done, భలే చక్కగా చేశారే! ఇప్పుడు మీకు ఇంగ్లిష్‌లో టైం ఎంత అని అడగడం, టైం ఎంతయ్యిందో చెప్పడం చక్కగా వచ్చేసింది. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి. రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

 

Check what you’ve learned by choosing the correct answer to the question.

టైం ఎంత?

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Session Vocabulary

  • What time is it?
    టైం ఎంత?
    It’s ______.
    ______ అయ్యింది.
    I start work at ______.
    నేను ______ కి పని మొదలెడతాను.
    I usually have lunch at ______.
    నేను సాధారణంగా ______ కి లంచ్ చేస్తాను.
    I’m early!
    నేను తొందరగా వచ్చేసాను.
    I’m late!
    నేను ఆలస్యం అయ్యాను!
    eight forty-five
    ఎనిమిది నలభై ఐదు
    ten to nine
    పది నిముషాల తక్కువ తొమ్మిది
    twenty to one
    ఇరవై నిముషాల తక్కువ ఒంటిగంట
    twelve
    పన్నెండు
    eight twenty
    ఎనిమిది ఇరవై
    nine o’clock
    తొమ్మిది గంటలు