1

유닛 1: Essential English Conversation

유닛 고르세요

  1. 1 Essential English Conversation

세션 24

Cash counter దగ్గర డబ్బులు చెల్లించడం ఎలాగో విని నేర్చుకోండి.

세션 24 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

Cash counter దగ్గర

Listen to find out how to pay for something at the till.
Cash counter దగ్గర డబ్బులు చెల్లించడం ఎలాగో విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz.

스크립트 보기 스크립트 숨기기

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, cash counter లో ధర చెల్లించడం ఎలాగో- ఇవాళ నేర్చుకుందురు గాని.
ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.

Shop Assistant
That’s 9.99 please.

Tony
Can I pay with a credit card?

Shop Assistant
Yes. Sign here please.

Tony
Thank you.

సౌమ్య
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదట... Tony తో shop assistant ఏమని అంది? ‘అది 9.99 అండీ.’ ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి..ధర చెప్పేటప్పుడు పైసలతో సహా చెప్పాలి. ఉదాహరణకు, ధర 12.99 అయితే ‘12.99’, 20.50 అయితే ‘20.50’ అని చెప్పాలి. విని..తిరిగి మీరూ అనండి.

That’s 9.99 please.

సౌమ్య
అప్పుడు Tony ఏమన్నాడు, ‘నేను క్రెడిట్ కార్డ్‌తో పే చెయ్యొచ్చా?’ '‘Can I pay with a credit card?’' అని అడిగాడు. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ తో పే చెయ్యాలనుకుంటే ‘Can I pay with a debit card?’ అని అడగాలి. లేదూ.. క్యాష్ చెల్లించాలనుకుంటే “Can I pay with cash?” అని అడగాలి. విని..తిరిగి మీరూ అనండి.

Can I pay with a credit card?

సౌమ్య
అప్పుడు shop assistant ఏమంది 'ఆ చెయ్యొచ్చండీ...ఇక్కడ సంతకం పెట్టండి.' ‘Yes. Sign here please.’
విని..తిరిగి మీరూ అనండి.

Yes. Sign here please.

సౌమ్య
డబ్బులు చెల్లించాక, Tony, shop assistant కి 'Thank you' చెప్పాడు. "Thank you" అని చెప్పడం మర్యాద సూచకంగా ఉంటుంది. విని..తిరిగి మీరూ అనండి.

Thank you.

సౌమ్య
సరే – ఇదిగో ఇక్కడ వీళ్లు దుకాణంలో మాట్లాడుకుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.

That’s 14.99 please.
Can I pay with cash?
Yes. Here’s your receipt and change.
Thank you.

That’s 19.99 please.
Can I pay with a debit card?
Yes. Sign here please.
Thank you.

That’s 8.95 please.
Can I pay with a credit card?
Yes. Sign here please.
Thank you.

సౌమ్య
Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి. ఈసారి ఒక్కొక్కటీ రెండేసిసార్లు వస్తుంది..వినండి.

That’s 9.99 please. X2
Can I pay with a credit card? X2
Yes. Sign here please. X2
Thank you. X2

సౌమ్య
సరే! ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం, ! ఏదీ ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

అది 9.99 అండీ.
That’s 9.99 please.

నేను క్రెడిట్ కార్డ్‌తో పే చెయ్యొచ్చా?

Can I pay with a credit card?

'ఆ చెయ్యొచ్చండీ...ఇక్కడ సంతకం పెట్టండి.

Yes. Sign here please.

Thank you.
Thank you.

సౌమ్య
Fantastic – షాపుకి వెళ్ళి ఏదైనా కొనుక్కున్న తరువాత, దాని ధర కనుక్కుని డబ్బులు ఎలా చెల్లించాలో నేర్చుకున్నారు కదా. మరి, Sian తో ఇదే సంభాషణని ప్రాక్టీస్ చెయ్యండి. కార్డ్ తో పే చెయ్యొచ్చా అని అడగడం మర్చిపోకండి. అలాగే చివర్లో thank you చెప్పడం కూడా.

That’s 9.99 please.

Yes, sign here please.

సౌమ్య
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Shop Assistant
That’s 9.99 please.

Tony
Can I pay with a credit card?

Shop Assistant
Yes. Sign here please.

Tony
Thank you.

సౌమ్య
Well done, భలే చక్కగా చేశారే! మీకిప్పుడు, cash counter లో ఏమడగాలో, ఎలా పే చెయ్యాలో బాగా వచ్చేసింది. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి. రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

 

Check what you’ve learned by choosing the correct answer to the question.

Cash counter దగ్గర

3 Questions

Choose the correct answer. 

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Session Vocabulary

  • That’s ______, please.
    అది ______, అండీ.
    Can I pay with a debit card?
    నేను డెబిట్ కార్డ్‌తో పే చెయ్యొచ్చా?
    Can I pay with a credit card?
    నేను క్రెడిట్ కార్డ్‌తో పే చెయ్యొచ్చా?
    Can I pay with cash?
    క్యాష్ కట్టొచ్చా?
    Yes. Sign here please.
    'ఆ చెయ్యొచ్చండీ...ఇక్కడ సంతకం పెట్టండి.
    Yes. Here’s your receipt and change.
    ఇదిగోండి..మీ రసీదు, చిల్లర.