Session 11

Listen to find out how to order food and drink in a restaurant.
రెస్టారెంట్‌కు వెళ్లి ఇంగ్లిష్‌లో ఆహారం ఆర్డర్ చేసుకోవడం ఎలాగో విని తెలుసుకోండి.

Session 11 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

How do I order in a restaurant?

ఈ కింది పదాలను జతపరచండి.

For                     drink

For                     main 

To                      dessert

To                      start 



ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Show transcript Hide transcript

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ…

Sam
And me, Sam. Hello, everybody.

సౌమ్య
కిందటివారం కెఫేకెళ్లి మనకు కావలసిన పదార్థాలను ఇంగ్లిష్‌లో ఎలా ఆర్డర్ చేసుకోవాలో నేర్చుకున్నాం కదా! ఇవాళ రెస్టారెంట్‌లో ఇంగ్లిష్‌లో భోజనం ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసుకుందాం. కెఫేకు, రెస్టారెంట్‌కు కొంచం వ్యత్యాసం ఉంది. రెస్టారెంట్‌లో మీల్ కోర్సులు ఉంటాయి…starters, main course, dessert ఇలాగన్నమాట! ఇవన్నీ ఏమిటో కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా, ఇక్కడ ఒక వ్యక్తి రెస్టారెంట్‌లో ఆర్డర్ చేస్తున్నారు, విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి వాళ్ల సంభాషణ జాగ్రత్తగా వినండి. సంభాషణలో వచ్చే కొన్ని పదాలు ఇవి: ‘soup’, ‘fish’ – చేపలు, ‘vegetables’ – కూరగాయలు, ‘chocolate cake’, ‘water’ – మంచినీళ్లు.

Waiter: Are you ready to order?

Diner: Yes! To start, I’ll have the soup, please. For main, I’ll have the fish with vegetables. And for dessert, I’ll have the chocolate cake, please.

Waiter: Of course. Anything to drink?

Diner: To drink, I’ll have water, please.

సౌమ్య
విన్నారా? వాళ్లు మూడు కోర్సులు ఆర్డర్ చేసారు. So, Sam, shall we look at the language we can use to order in a restaurant?

Sam
Absolutely!

సౌమ్య
ముందుగా వెయిటర్ అడిగిన ప్రశ్న: ‘Are you ready to order?’

Sam
There are only two ways to answer this question: ‘yes’ or ‘no’! In our conversation, the answer was ‘yes’.

సౌమ్య
ఆ వ్యక్తి ఎలా ఆర్డర్ చేసారో మళ్లీ ఒకసారి విందాం. మూడు కోర్సులను ఎలా చెప్పారో జగ్రత్తగా గమనించండి. మూడిట్లో ఒకటి భిన్నంగా ఉంటుంది, వినండి.

Yes! To start, I’ll have the soup, please. For main, I’ll have the fish with vegetables. And for dessert, I’ll have the chocolate cake, please.

సౌమ్య
ఏది భిన్నంగా ఉందో గమనించారా? పదార్థాలు ఆర్డర్ చేసే క్రమం ఇలా ఉంటుంది: ‘to start’ – మొదలుపెట్టేది, ‘for main’ – ప్రధానమైనది, ‘for dessert’ – ముగించేది లేదా చివరిది. ‘To start’ అనేది క్రియ, ‘main’, ‘dessert’...ఇవి రెండు నామవాచకాలు. కాబట్టి ఈ రెండిటికీ ‘for’ వాడతాం, ‘to’ కాదు.

Sam
And then you say what you want – do you remember how?

సౌమ్య
Yes, ‘I’ll have... తక్షణం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పడానికి ‘have’ తో పాటుగా ‘I’ll’ చెప్పాలి.

Sam
Yes, decisions in a restaurant are usually quite quick. And after ‘I’ll have…’ you say the food or drink you want.

సౌమ్య
గమనించారా పదార్థం ఆర్డర్ చేసేటప్పుడు ‘the’ వాడాలి. మనం చెప్తున్నది ఒక నిర్దిష్టమైన పదార్థం కాబట్టి ‘the’ చేర్చాలి. Listen to Sam to practise.

Sam
Repeat after me:

‘To start, I’ll have the soup, please.’

‘For main, I’ll have the fish with vegetables.’

‘And for dessert, I’ll have the chocolate cake, please.’

సౌమ్య
తరువాత, మీకు తాగడానికి ఏమైనా కావాలా అని అడుగుతారు: ‘Anything to drink?’

Sam
Yes – this is short for ‘would you like anything to drink? – and how do you answer it, do you remember? Let’s listen again:

To drink, I’ll have water, please.

సౌమ్య
ఇక్కడ ‘to drink’ అని మొదలెట్టాలి. ‘To start’ లాగ ఇది ఒక చర్య. తరువాత ‘I’ll…’’అని కొనసాగించాలి.

Sam
Great! Now you’ve learned what to say in a restaurant, it’s time for you to practise.

సౌమ్య
సరే! ముందు, వెయిటర్ మిమ్మల్ని ఏదైనా ఆర్డర్ చేస్తారా అని అడుగుతారు. మీరు మొదట సూప్ కావాలని అడగండి. ఇక్కడ ‘for’ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. తరువాత Sam చెప్పిన వాక్యంతో మీ జవాబును సరిపోల్చుకోండి.

Sam
To start, I’ll have the soup, please.

సౌమ్య
తరువాత, మీకు చేపలకూర కావాలి. ఎలా చెప్తారు?

Sam
For main, I’ll have the fish.

సౌమ్య
Did you say the same? చివరిగా, వెయిటర్ అడిగినదానికి 'మంచినీళ్లు’ అని జవాబు చెప్పి ముగించండి.

Anything to drink?

Sam
To drink, I’ll have water, please.

సౌమ్య
Ok, so now you know how to order food and drink in a restaurant. మీ స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చెయ్యండి.

Sam
Yes, and see you next week. Bye!

సౌమ్య
Bye!

Learn more!

1. ‘To start’,  ‘for main’? ఎందుకు అని ఎందుకు వాడాలి?
‘Start’, ‘drink’..ఈ రెండూ చర్యలు/క్రియలు, కాబట్టి వాటికి ముందు ‘to’ వాడాలి. ‘Main’, ‘dessert’...ఈ రెండూ నామవాచకాలు, కాబట్టి వీటికి ముందు ‘for’ వాడాలి.

2. ఈ పదబంధాలు ఒక వాక్యంలో ఎక్కడ రావాలి?
అవి వాక్యానికి మొదట రావొచ్చు. ఉదా: For main, I’ll have the fish, please.
లేదా ఆహార పదార్థం తరువాత రావొచ్చు. ఉదా: I’ll have the fish for main, please.

3. 'నాకు కావాలి' అని మర్యాదపూర్వకంగా అడగడానికి వాడే పదం ఏది?
‘I’ll have…, please.’ అని చెప్పాలి. రెస్టారెంట్‌లో అప్పుడే నిర్ణయించుకున్న విషయాల గురించి చెప్పడానికి ఈ కింది రెండు వాక్యాలు కూడా వాడొచ్చు.
Can I have…, please?
I’d like…., please.

4. ఆర్డర్ చేసే పదార్థాలకు ముందు ‘the’ ఎందుకు చేర్చాలి?  
మనం నిర్దిష్టమైన పదర్థాలను ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి ‘the’ వాడాలి.  

How do I order in a restaurant?

4 Questions

Arrange the words in the correct order.
ఈ కింది పదాలను సరైన క్రమంలో అమర్చండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

What's your favourite type of restaurant? Why?
మీకెలాంటి రెస్టారెంట్ నచ్చుతుంది? ఎందుకు?

Tell us on our Facebook group!
మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • To start…
    మొదలుపెట్టడానికి...
    For main…
    ప్రధానమైనది..
    For dessert…
    ముగించేది/చివరిది..
    To drink…
    తాగడానికి...
    I’ll have…
    నాకు...కావాలి
    the soup
    సూప్
    the fish
    చేపలు/చేపలకూర
    with vegetables
    కూరగాయలతో సహా
    the chocolate cake
    చాక్లేట్ కేక్
    water
    మంచినీళ్లు