Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 13

Delhi has been affected by severe air pollution. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.
దీపావళి తరువాత ఢిల్లీలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. వాహన కాలుష్యం, పక్క రాష్టాలనుంచి వచ్చే వాయు కాలుష్యం అన్నీ కలిపి గాలి కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చిస్తున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

 

Sessions in this unit

Session 13 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Delhi Air pollution

Delhi has been affected by severe air pollution. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

దీపావళి తరువాత ఢిల్లీలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. వాహన కాలుష్యం, పక్క రాష్టాలనుంచి వచ్చే వాయు కాలుష్యం అన్నీ కలిపి గాలి కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చిస్తున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

[Images: Getty images]

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions

1. shrouded

Shrouded అంటే కప్పబడి ఉండడం, కమ్ముకోవడం. 'Shroud' అంటే శవాల మీద కప్పే గుడ్డ. So ఈ పదాన్ని negative connotation తోనే వాడాలి. అంటే చెడు విషయాలు లేదా మంచివి కాని విషయాల గురించి చెప్తున్నప్పుడు మాత్రమే వాడాలి. విషయాల మీద అనుమానం, రహస్యం, అనిశ్చితి కమ్ముకుని ఉన్న సందర్భాల్లో అని వాడొచ్చు.

  • Identity of hackers shrouded in mystery.
  • Highway closed as bridge shrouded by fog.

2. linger

To linger అంటే అక్కడే వేలాడడం. అవసరమైన దానికన్నా ఎక్కువసేపు అక్కడక్కడే తిరుగుతుండడం. Lingering అంటే అక్కడే తచ్చాడడం.

  • Doubts linger about candidate
  • Cold weather to linger until next month

3. decry

Decry అంటే ఖండించడం, నిందించడం, తిరస్కరించడం. Decry అనేది చాలా formal గా వాడే పదం. రోజువారీ మాటల్లోకంటే రాతల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

  • Fans decry coach's team selection.
  • Unions decry falling wages.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Vocabulary

  • forced
    బలవంతంగా

    gear
    గేర్/యంత్రంలో పళ్ల చక్రం

    revealed
    బహిర్గతం చెయ్యబడినది

    swing
    ఊపు, ఊగటం

    toughest
    అతి క్లిష్టమైనది

    considerably
    గణనీయంగా