课程 14

Listen to find out how to accept or refuse offers.
'కావాలి' లేదా 'వద్దు' అని ఇంగ్లిష్‌లో ఎన్ని రకాలుగా చెప్పొచ్చో విని తెలుసుకోండి.

本单元得分 14

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

How do I accept or refuse things?

How many people accept the offer? What do they say?
ఎంతమంది offer ను అంగీకరించారు? వాళ్లు ఏం చెప్పారు?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

显示文字稿 收起文字稿

సౌమ్య
హాయ్!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు. 

Sian
Hello, everybody.

సౌమ్య
ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే కావాలి, వద్దు అనే కాకుండా వాళ్లకి కృతజ్ఞతలు చెప్తూనో లేకపోతే వద్దన్నప్పుడు వాళ్లు మనసు కష్టపెట్టుకోకుండా ఉండడానికో అనేక రకాల మర్యాద సూచక వాక్యాలను వాడుతుంటాం కదా! అలాంటి వాక్యాలు ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో ఇవాళ తెలుసుకుందాం. ముందు ఈ సంభాషణ వినండి.

Would you like some chocolate cake? 

Yes please. That would be lovely. 

I’d love some, thanks! 

I’m ok thanks. 

Thanks, but I'm really full. 

సౌమ్య
విన్నారా? చాక్లేట్ కేక్ కావాలా? అని అడిగితే  ఇద్దరు కేక్ కావాలన్నారు. ఇద్దరేమో వద్దన్నారు. కానీ ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిలో జవాబు చెప్పారు.   
Shall we look at the language they used to accept and refuse things Sian? 

Sian
Yes, so the first person said ‘yes please’ – this is a very common way to accept something. 

సౌమ్య
అవును. మనకి కావాలంటే ‘yes please’ అనొచ్చు. కానీ సాధారణంగా అక్కడితో ఆపేయకుండా అదనంగా మరో వాక్యం చేర్చి చెప్తుంటాం.  మొదటి వ్యక్తి ‘yes please’ తరువాత ఏమన్నారో గుర్తుందా? మళ్లీ విందాం. 

Yes please. That would be lovely. 

Sian
So we can say ‘that would be lovely’ or you can change the adjective to something else positive. For example ‘that would be great’ or ‘that would be nice’. Let’s practise that. Repeat after me. 

‘Yes please. That would be lovely.’

‘Yes please. That would be great.’

సౌమ్య

Nice! రెండో వ్యక్తి కూడా కేక్ కావాలన్నారు. కానీ అతను వేరే విధంగా చెప్పారు. మళ్లీ విందాం. 

I’d love some, thanks!

Sian
OK so you can say ‘I’d love some, thanks’ – we use ‘some’ because here chocolate cake is uncountable. If someone asks you if you’d like something countable – such as a cup of tea – you can say ‘I’d love one, thanks’. So let’s practise that. 

‘I’d love some, thanks.’

‘I’d love one, thanks.’

సౌమ్య
Good. ఎలా చెప్పినా, చివరికి thanks చెప్పడం మాత్రం మరచిపోకూడదు. సరేనా! ఇప్పుడు ‘వద్దు’ అని మర్యాదపూర్వకంగా చెప్పడం ఎలాగో చూద్దాం.

I’m ok thanks.

సౌమ్య
OK so it’s not very polite to just say ‘no’ is it? 

Sian
Exactly, so ‘I’m ok thanks’ is a much more polite way to say ‘no’. You can also say ‘I’m alright thanks’ or I’m fine thanks’ or even just ‘no thanks’.

Let's practise the pronunciation. Repeat after me. 

‘I’m ok thanks.’ 

‘I’m alright thanks.’

‘No thanks.’

సౌమ్య
‘I’m ok, thanks’ అని చెప్పొచ్చు. కానీ ఎందుకు వద్దంటున్నామో కారణం కూడా చెప్తే ఇంకా బావుంటుంది. చివరి వ్యక్తి వద్దంటునే కారణం చెప్పారు. మళ్లీ విందామా? 

Thanks, but I'm really full. 

సౌమ్య
అతను ‘thanks’ చెబుతూ I’m really full’ అన్నాడు. అంటే నాకు కడుపు నిండుగా ఉంది అని అర్థం.

Sian
Exactly, so you can give any reason you like, but remember to say ‘thanks’ first.

సౌమ్య
Thanks, Sian.  మీకు పూర్తిగా అర్థమయ్యింది కదూ! మరి, మీరెంత బాగా నేర్చుకున్నారో టెస్ట్ చెయ్యనా? Ready? ఈ వ్యక్తి మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు, వినండి.

Do you want a cup of tea? 

సౌమ్య 
మీకు టీ తాగడం చాలా ఇష్టం. టీ కావాలి. అదెలా చెప్తారు? రెండు మూడు రకాలుగా చెప్పొచ్చేమో ప్రయత్నించండి. తరువాత Sian కూడా చెబుతారు. విని మీ జవాబు సరిచూసుకోండి.

Sian
Yes please, that would be lovely.

I’d love one, thanks.  

సౌమ్య
Great! ఇప్పుడు ఇంకేదో అడుగుతున్నారు. వినండి.

Do you want some more pizza? 

సౌమ్య  
మీకు వద్దు. అదే చెప్పండి. కారణం చెప్పక్కర్లేదు.  

Sian
I’m ok thanks. 

సౌమ్య
Good. ‘No thanks’ లేదా ‘I’m fine thanks అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు వద్దని చెప్తూనే కారణం కూడా చెప్పండి. మ్మ్..ఏం కారణం చెబుతారు? ఆ..డైట్‌లో ఉన్నాను అని చెప్పండి. 

Sian
Thanks, but I’m on a diet. 

సౌమ్య
Well done! Now you can accept and refuse things politely.

Sian
See you next time everybody. Bye!  

సౌమ్య
Bye!

Learn more

1) ప్రతిపాదనలను అంగీకరించడం

ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే అంగీకరించడానికి ఇంగ్లిష్‌లో అనేక రకాల పద్ధతులున్నాయి.

ఈ ఎపిసోడ్ నుంచి ఉదాహరణలు..

  • Yes please. That would be lovely.
  • I’d love some, thanks!

'Yes please’ - ఇది చాలా కామన్‌గా వాడే పదం. 

‘That would be lovely’లో lovely కు బదులు వేరే పదాలను కూడా వాడొచ్చు. ఉదా: ‘great’, ‘amazing’ or ‘nice’.

రెండో ఉదాహరణ - 'I’d love some', 'I’d love one' - ఆఫర్ చేస్తున్న వస్తువు లెక్కించదగిన నామవాచకం అయితే 'one' అని వాడాలి. ఉదా: an apple.

లెక్కించలేని నామవాచకం లేదా బహువచనం అయితే 'some' అని వాడాలి. ఉదా: cake.

'Thanks' వాడడం మరచిపోవద్దు.


2) ప్రతిపాదనలను తిరస్కరించడం

ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే వద్దు అని చెప్పడానికి ఇంగ్లిష్‌లో అనేక రకాల పద్ధతులున్నాయి.

ఈ ఎపిసోడ్ నుంచి ఉదాహరణలు.. 

  • I’m ok thanks.
  • Thanks, but I’m really full.

చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వద్దు అని చెప్పేటప్పుడు వీలైనంత మర్యాదపూర్వకంగా చెప్పాలి. సింపుల్‌గా 'NO' అని చెప్పకూడదు. 

'Thanks' అని కూడా చెప్పాలి. మనకి వద్దకపోయినా ఆఫర్ చేసినందుకు 'thanks' చెప్పాలి.

‘I’m ok thanks’ లో 'ok' కు బదులు వేరే పదాలు కూడా వాడొచ్చు. 
ఉదా: ‘I’m fine thanks’, or ‘I’m alright thanks’.

రెండో ఉదాహరణలో 'thanks' తరువాత 'but..' అని చెప్పి మనకి ఎందుకు వద్దో కారణం కూడా చెప్పొచ్చు.

How do I accept or refuse things?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Would you like more episodes of How do I? Come and accept or refuse our offer on our Facebook group!
మీకు మరిన్ని ఇలాంటి 'How do I' ఎపిసోడ్స్ కావాలా? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి కావాలో, వద్దో చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

本课词汇

  • a slice of cake
    కేక్ ముక్క

    That would be lovely.
    అది చాలా బాగుంటుంది.

    nice
    చక్కగా ఉంది

    great
    గొప్పగా ఉంది

    alright
    సరే, మంచిది

    I’m full.
    నా కడుపు నిండుగా ఉంది

    a cup of tea
    కప్పుడు టీ

    on a diet
    డైట్‌లో ఉండడం