1

单元 1: Essential English Conversation

选择一个单元

  1. 1 Essential English Conversation

课程 33

Listen to find out how to ask someone if they have any hobbies.
ఎవరినైనా వాళ్ళ అభిరుచులేమిటో ఎలా అడగాలో విని తెలుసుకోండి.

本单元得分 33

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

మీ అభిరుచులేమిటి?

Listen to find out how to ask someone if they have any hobbies.
ఎవరినైనా వాళ్ళ అభిరుచులేమిటో ఎలా అడగాలో విని తెలుసుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి

显示文字稿 收起文字稿

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎవరివైనా వాళ్ల అభిరుచుల గురించి అడగడం ఎలాగో తెలుసుకుందాం.

ఇదిగో వీళ్ళిద్దరూ తమ తమ అభిరుచుల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో విందాం.

Helen
Do you have any hobbies?

Jim
Yes, I like watching movies. How about you?

Helen
I like reading books.

సౌమ్య
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి.
మొదట Helen, Jim ను మీకు ఏవైనా......? ‘Do you have….?’ అని మొదలెట్టి…అభిరుచులు ఉన్నాయా? ‘any hobbies’ అని చివర్లో కలిపింది.... Jim కు ఏమైనా అభిరుచులు ఉన్నాయా? అని అడగడానికి. విని, మళ్ళీ చెప్పండి.

Do you have any hobbies?

సౌమ్య
అప్పుడు Jim... ‘Yes, I like watching movies’ అన్నాడు. మనకు ఇష్టమైన పని గురించి చెప్పడానికి ‘I like’ అని చెప్పి అప్పుడు ఆ క్రియాపదానికి చివర్న ‘-ing’ అని చేర్చాలి. వంటపని ఇష్టమైతే ‘I like cooking’ , డాన్స్ ఇష్టమైతే ‘I like dancing’ అని చెప్పొచ్చు. అప్పుడు Jim...’How about you’ అని అదే ప్రశ్న Helen ను అడిగాడు. విని, మళ్ళీ చెప్పండి.

Yes, I like watching movies.
How about you?

సౌమ్య
అప్పుడు Helen, నాకు పుస్తకాలు చదవడం ‘reading books’. ..ఇష్టం అని చెప్పింది. –ing తో అంతమయ్యే అభిరుచులు చాలానే ఉన్నాయి. ఇదిగో ఈ కింద ఇచ్చిన ఉదాహరణలు కొన్ని చూడండి.

గాలిపటం ఎగరేయడం flying a kite
మ్యూజియంలు చూడడం visiting Museums
ఫొటోలు తియ్యడం taking photos
సంగీతం వినడం listening to music
బొమ్మలు వెయ్యడం drawing pictures

పుస్తకాలు చదవడం ఇష్టం...ఈ వాక్యాన్ని ఇంగ్లిష్ లో విని మళ్ళీ చెప్పండి.

I like reading books.

Great...ఇప్పుడు, వీళ్ళంతా తమ తమ అభిరుచుల గురించి మాట్లాడుకుంటున్నారు. వింటూ, మీ జవాబులు సరిచూసుకోండి.

Do you have any hobbies?
Yes, I like visiting museums. How about you?
I like going shopping.

Do you have any hobbies?
I like horse-riding. How about you?
I like drawing pictures.

సౌమ్య
Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లిష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి. ఈసారి ఒక్కొక్కటీ రెండేసిసార్లు వస్తుంది...వినండి.

Do you have any hobbies?
Do you have any hobbies?

Yes, I like watching movies.
Yes, I like watching movies.

How about you?
How about you?

I like reading books.
I like reading books.

సౌమ్య
Great! ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం. ! ఏదీ ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

మీకేమైనా అభిరుచులు ఉన్నాయా?
Do you have any hobbies?

అవును, నాకు సినిమాలు చూడడం ఇష్టం. మీకు?
Yes, I like watching movies. How about you?

నాకు పుస్తకాలు చదవడం ఇష్టం
I like reading books.

సౌమ్య
Fantastic, OK, ఇప్పుడు మీకు ఎవరినైనా వాళ్ల అభిరుచులు ఏమిటో అడిగి తెలుసుకోవడం వచ్చేసింది. Helen కు జవాబిస్తూ ప్రాక్టీస్ చెయ్యండి. Follow up ప్రశ్న అడగడం మర్చిపోకండి. How about you? అని అదే ప్రశ్న వాళ్ళని కూడా అడగండి.

Do you have any hobbies?
I like reading books.

సౌమ్య
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Helen
Do you have any hobbies?

Jim
Yes, I like watching movies. How about you?

Helen
I like reading books.

సౌమ్య
Well done, భలే చక్కగా చేశారే! ఇప్పుడు మీరు ఎవరినైనా వాళ్ల అభిరుచుల గురించి ఇంగ్లిష్‌లో చక్కగా అడిగేయగలరు. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి. రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

మీకేమైనా అభిరుచులున్నాయా?

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

本课词汇

  • Do you have any hobbies?
    మీకేమైనా అభిరుచులున్నాయా?
    Yes, I like ______.
    అవును, నాకు______ఇష్టం.
    How about you?
    మీ సంగతేంటి?
    watching movies
    సినిమాలు చూడడం
    reading books
    పుస్తకాలు చదవడం
    flying a kite
    గాలిపటం ఎగరేయడం
    visiting museums
    మ్యూజియంలు చూడడం
    taking photos
    ఫొటోలు తియ్యడం
    listening to music
    సంగీతం వినడం
    drawing pictures
    బొమ్మలు వెయ్యడం
    going shopping
    షాపింగ్ చెయ్యడం
    horse-riding
    గుర్రపు స్వారీ