1

单元 1: Essential English Conversation

选择一个单元

  1. 1 Essential English Conversation

课程 21

Shoppingకి వెళ్లినప్పుడు రకరకాల size లూ, colourల వస్తువుల కోసం అడగడం ఎలాగో ఇక్కడ విని నేర్చుకోండి.

本单元得分 21

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

పరిమాణం, రంగు

Listen to find out how to use what we have learned in the last four lessons.
గత నాలుగు సంచికల్లోనూ నేర్చుకున్న విషయాలని వాడడం ఇక్కడ వినండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

显示文字稿 收起文字稿

కల్యాణి
హలో! బాగున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. shoppingకి వెళ్లినప్పుడు రకరకాల size లూ, colourల వస్తువుల కోసం అడగడం ఇక్కడ మీరు నేర్చుకుందురు గాని. ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.

Shop assistant
Can I help you?

Dan
Yes, do you have these shoes in size 9?

Shop assistant
No, but we have them in size 8 and 10.

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ... మొట్టమొదటా
Dan ని shop assistant ఏమని అడిగింది - ‘మీకేదన్నా కావాలా?’ ‘Can I help you?’ అని అంది. విని మీరూ అనండి.

Can I help you?

కల్యాణి
ఆప్పుడు Dan ఏమన్నాడు -‘Yes, do you have these shoes in size 9?’, ‘ఔను, మీ దగ్గర size 9లో ఈ shoes ఉన్నాయా?’ అని అడిగాడు. దుకాణంలో ఆ వస్తువు - వేరే colour లోనో, size లోనో ఉందా అని కనుక్కోడానికి - ‘Do you have these in…?’ అనే ఈ ప్రశ్నని వాడతాం. వస్తువు ఒకటైతే - ‘this’అనీ, అంత కంటే ఎక్కువైతే these అనీ వాడతాం. So - దుకాణంలో ఒక వస్తువు - black colour లో, 8 size లో ఉందా అని కనుక్కోవాలనుకోండి - ఈ ప్రశ్నలని వేస్తాం.

Do you have these shoes in black?

Do you have these in size 8?

ఇదిగో, విని మీరూ అనండి.

Yes, do you have these shoes in size 9?

కల్యాణి
చివరగా, shop assistant ఏమందంటే - ‘లేదండీ, మా దగ్గర size 8,10 – ఇవే ఉన్నాయి ప్రస్తుతం.’ ‘No, but we have them in size 8 and 10.’ అంది. విని మీరూ అనండి.

No, but we have them in size 8 and 10.

కల్యాణి
Great –దుకాణంలో కొంత మంది మాట్లాడుకుంటున్నారు వినండి.

Can I help you?

Yes, do you have these trousers in black?

No, but we have them in brown.

Can I help you?

Yes, do you have these sunglasses in white?

No, but we have them in silver

కల్యాణి
సరే, మళ్లీ చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విన్నాక మీరూ అనండి.

Can I help you?

Yes, do you have these shoes in size 9?

No, but we have them in size 8 and 10.

కల్యాణి
సరే, ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.
మీకేమన్నా కావాలా?
Can I help you?

ఔను, ఈ shoes మీదగ్గర size 9లో ఉన్నాయా?

Yes, do you have these shoes in size 9?

లేదండీ, మా దగ్గర size 8,10 – ఇవే ఉన్నాయి ప్రస్తుతం.

No, but we have them in size 8 and 10.

కల్యాణి
Fantastic – మీరు shoppingకి వెళ్లినప్పుడు రకరకాల sizeల వస్తువుల కోసం అడగడమెలాగో తెలిసింది కదా. మరి store assistantతో సంభాషణ జరిపి, ఆ దుకాణంలో size 7లో socks ఉన్నాయేమో కనుక్కోండి.

Can I help you?

No, but we have them in size 8 and 10.

కల్యాణి
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.

Shop assistant
Can I help you?

Dan
Yes, do you have these shoes in size 9?

Shop assistant
No, but we have them in size 8 and 10.

కల్యాణి
Well done! మీరు shoppingకి వెళ్లినప్పుడు వస్తువుల్లో రకరకాల sizeలూ, colourల కోసం ఇంగ్లీష్‌లో అడగడమెలాగో తెలిసింది కదా ఇక మిత్రులతో కలిసి ఈ ప్రశ్న -‘Do you have this/these in…?’ వేయడాన్ని అభ్యాసం చేస్తూ ఉండండి. మరిన్ని విషయాల్ని తెలుసుకోడానికి Essential English Conversation లలో మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

బట్టల: పరిమాణం, రంగు

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

本课词汇

  • Can I help you?
    మీకేమన్నా కావాలా?
    Yes, do you have these ______ in ______?
    ఔను, ఈ ----- మీదగ్గర ------లో ఉన్నాయా?
    Do you have these in ______?
    మీదగ్గర ఇవి ______ లో ఉన్నాయా?
    Do you have these ______ in ______?
    మీదగ్గర ఈ ______ ______ లో ఉన్నాయా?
    No, but we have them in ______.
    లేదండీ, మా దగ్గర ______ ఇవే ఉన్నాయి ప్రస్తుతం.
    trousers
    పంట్లాం
    sunglasses
    చలవ కళ్లద్దాలు
    brown
    బ్రౌన్
    silver
    వెండి రంగు
    black
    నలుపు
    white
    తెలుపు