Session 15

Listen to find out how to give opinions.
ఇంగ్లిష్‌లో అభిప్రాయాలను వ్యక్తపరచడం ఎలాగో విని తెలుసుకోండి.

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 15 ነጥብ።

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

How do I give opinions?

కార్యక్రమంలో సంభాషణ విని ఈ కింది ప్రశ్నకు జవాబు చెప్పండి.

How many people definitely wouldn't sing karaoke?



ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

మ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Phil కూడా ఉన్నారు.

Phil
Hello, everybody. Welcome!

సౌమ్య
ఇవాళ మనం అభిప్రాయాలను ఇంగ్లిష్‌లో వ్యక్తపరచడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా, karaoke అంటే కచేరీ గురించి ఇక్కడ కొందరు తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్తున్నారు. విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ఇంతకీ ఎవరు కరోకేలోపాడడానికి సిద్ధంగా ఉన్నారు?

What do you think about karaoke?
• I think (that) it’s awful.
• Personally, I love it.
• In my opinion, it’s fine.

సౌమ్య
విన్నారా? మీ ఉద్దేశం ఏంటి? రెండో వ్యక్తి కచ్చితంగా కరోకేలో పాడతారు అని నేను అనుకుంటున్నాను. So Phil, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఉపయోగించిన భాషను పరిశీలిద్దామా?

Phil
Yes, good idea!

సౌమ్య 
ముందు, అభిప్రాయం అడగడానికి ఉపయోగించిన ప్రశ్నను పరిశీలిద్దాం. ఎవరినైనా అభిప్రాయం అడగాలంటే ‘What do you think about…?’ అని మొదలెట్టాలి.

Phil
Yes, and the first person asked about karaoke. Listen and repeat after me:

‘What do you think about karaoke?’

సౌమ్య
అడిగిన ప్రశ్నకి బదులుగా మొదటి వ్యక్తి ఏం చెప్పారు? ఇక్కడ ముగ్గురూ కూడా వేరు వేరు పద్ధతులలో జవాబిచ్చారు. మొదటి వ్యక్తి ‘I think’ అని మొదలుపెట్టారు.

Phil
Yes, we can say ‘I think’ or ‘I think that’ – both are correct.

సౌమ్య
తరువాత, ఆమె ‘it’s awful’ అన్నారు. అంటే అస్సలు బాగోదు అని. ఈ పదబంధాన్ని మనకు అస్సలు నచ్చని లేదా బాగోని విషయం గురించి చెప్పడానికి వాడొచ్చు.

Phil
That’s right, let’s practise the first sentence to give an opinion. Listen and repeat:

‘I think it’s awful.’

సౌమ్య
రెండో వ్యక్తి కూడా ఈ విషయమై బలమైన అభిప్రాయమే వ్యక్తం చేసారు. అతనేం చెప్పాడో మీకు గుర్తుందా? ‘Personal’ అన్నారా? ‘Personally’ అన్నారా?

Personally, I love it.

Phil
It was ‘personally’.

సౌమ్య
Yes, 'personally' అంటే వ్యక్తిగతంగా. ఇతను పాజిటివ్‌గా చెప్పారు. ‘I love it’ అన్నారు. ‘Love’ అని వాడితే నిజంగా చాలా ఇష్టం అని అర్థం.

Phil
That’s right, let’s practise the second sentence to give an opinion. Listen and repeat:

‘Personally, I love it.’

సౌమ్య
మూడో వ్యక్తి ఏమని చెప్పారు? అతను ‘my opinion’ అన్నారా? లేక ‘in my opinion’ అన్నారా?

In my opinion, it’s fine.

Phil
It was ‘in my opinion’.

సౌమ్య
Yes, ‘my opinion’ కు ముందు ‘in’ వాడడం చాలా ముఖ్యం. తరువాత 'it’s fine' అన్నారు. అంటే నాకేం అభ్యంతరం లేదు, పాడడం ఆమోదయోగ్యమే అని అర్థం.

Phil
We can say ‘it’s fine’ when something is OK. Let’s practise the third sentence to state our opinions. Listen and repeat after me:

‘In my opinion, it’s fine.’

Phil
Great, now it’s time for some practice!

సౌమ్య
సరే, ఇప్పుడు కాస్త ప్రాక్టీస్ చేద్దామా! Phil మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు. దానికి జవాబుగా మీకు అస్సలు ఇష్టం లేదు లేదా బాగోదు అని చెప్పండి. ‘I think’ అని మొదలుపెట్టండి. తరువాత, Phil చెప్పిన వాక్యంతో సరిపోల్చుకోండి.

Phil
What do you think about hot weather?

Phil
I think it’s awful.

సౌమ్య
Did you say the same? ఈసారి ‘OK’ అని వచ్చేలా జవాబివ్వండి. ‘In my opinion’ అని మొదలుపెట్టండి.

Phil
What do you think about studying English online?

Phil
In my opinion, it’s fine.

సౌమ్య
Well done! అభిప్రాయాలను వ్యక్తపరచడంలో మూడు పద్ధతులను నేర్చుకున్నారు. I think you should practise more by visiting our website. What do you think of our website, Phil?

Phil
Personally, I love it.

సౌమ్య
I love it, too. Thank you. మరో ‘How do I…’ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. Bye!

Phil
Goodbye!

Learn more!

1.ఎవరిదైనా అభిప్రాయం కనుక్కోవాలంటే ఏమని అడగాలి?
'What do you think about…?' అని మొదలుపెట్టి దేని గురించైతే అడగాలనుకున్నారో అది చేర్చాలి. So, we could ask:

• What do you think about the new design?
• What do you think about this website?

2. అభిప్రాయాలను చెప్పడానికి వాడే పదబంధాలు ఏవి?
మూడు పదబంధాలు నేర్చుకున్నాం: 'I think', 'Personally' and 'In my opinion'. వీటన్నిటికీ అర్థం ఒకటే. మన అభిప్రాయం చెప్పడానికి వీటిల్లో ఏదైనా వాడొచ్చు.

• I think it's fine.
• Personally, I love it.
• In my opinion, it's awful.

3.అభిప్రాయాలు ఎలా చెప్పాలి?
'It's' అని మొదలుపెట్టి మన అభిప్రాయం తెలుపగలిగే విశేషణం వాడాలి. ఉదాహరణకు:

It's fine.
It's awful.
It's great.

కొన్ని క్రియాపదాలను కూడా వాడొచ్చు

• I love it.
• I like it.
• I hate it.

How do I give opinions?

4 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

Tell us what you think about learning English on our Facebook group!
ఇంగ్లిష్ నేర్చుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటో మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.

Join us for our next episode of How do I…?, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • karaoke
    కచేరీ
    awful
    అస్సలు బాగోనిది
    love
    ప్రేమ
    fine
    మంచిది
    opinion
    అభిప్రాయం
    personally
    వ్యక్తిగతంగా