Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 28
Listen to find out how to talk about things you are scared of.
భయాన్ని కలిగించేవాటి గురించి చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.
ክፍለጊዜያት 28 ነጥብ።
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about things that I'm scared of?
వీటిల్లో ఏది భయతీవ్రతను తెలియజేస్తుంది?
- I'm scared of spiders.
- I'm absolutely terrified of spiders.
విని తెలుసుకోండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Hello!
సౌమ్య
పాములు, తేళ్లు, సాలెపురుగులు, దెయ్యం సినిమాలు, ఎత్తైన ప్రదేశాలు... ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తోంది? భయమేస్తోంది కదూ! రైట్. ఇవాళ మనం భయాన్ని ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ‘Fear’ అంటే భయం ఈ నలుగురు వాళ్ల వాళ్ల భయాల గురించి చెప్తున్నారు. విందాం.
Examples
I'm scared of spiders. (female)
I'm really frightened of snakes. (male)
I'm absolutely terrified of heights. (male)
Horror movies are scary. (female)
సౌమ్య
అమ్మో, హారర్ మూవీస్ చూస్తున్నప్పుడు నేను కూడా భయపడతా! తేళ్లు, జెర్రిలు అన్నా కూడా భయమే! So, Sam, shall we look at the language they used to talk about their fears?
Sam
Let's do it! Let's start with person number one – she used the adjective 'scared' after 'I'm'.
సౌమ్య
ఆమె spiders - సాలెపురుగులంటే భయమని చెప్పారు. ఎలా చెప్పారో మళ్లీ జాగ్రత్తగా గమనించండి.
Example
I'm scared of spiders.
సౌమ్య
విన్నారా? భయానికి ‘scared’ అనే పదం వాడారు. Scared తరువాత ‘of’ అని చెప్పారు. గుర్తుపెట్టుకోండి. భయపడేవాటి గురించి చెప్పేటప్పుడు ‘of’ అనే వాడాలి.
Sam
Yes! Let's try saying the whole sentence. Repeat after me, please:
‘I'm scared of spiders.’
సౌమ్య
తరువాతి వ్యక్తికి పాములంటే భయంట. కానీ అతను scared అనే పదం వాడలేదే! ఇంకేదో అన్నారు. జాగ్రత్తగా వినండి.
Example
I'm really frightened of snakes.
Sam
It was 'frightened of', which is another way to say 'scared of'. And like 'scared of' you need to use the verb 'to be', so 'I'm really frightened of snakes'. Let's quickly practise that. Repeat after me:
‘I'm really frightened of snakes.’
And what does 'really' mean here?
సౌమ్య
ఇక్కడ 'really' అంటే ‘very’ …చాలా అనే అర్థమే వస్తుంది. తరువాతి వ్యక్తి ఏమన్నారో విందాం.
Example
I'm absolutely terrified of heights.
సౌమ్య
సో ఇతను ఎత్తైన ప్రదేశాలంటే భయం అంటున్నారు. భయానికి అతను వాడిన పదం విన్నారా? ‘Terrified of’ అన్నారు. అంటే చాలా చాలా భయం అని అర్థం. ‘Terrified’ అంటే ఠారెత్తిపోవడం అన్నమాట. Terrified కు ముందు ‘absolutely’ అని వాడారు. భయ తీవ్రతను తెలియజెయ్యడానికి absolutely అని వాడారు. అంటే 100%..బొత్తిగా... నిజంగా అని అర్థం.
Sam
Yes, and notice that, again, we have the verb 'to be' and we use 'of' before the noun. Let's practise this together:
‘I'm absolutely terrified of heights.’
సౌమ్య
You sounded very scared there! సరే, చివరు వ్యక్తి ఏమన్నారో గుర్తుందా?
Example
Horror movies are scary.
Sam
Did you hear it? She said 'scary', and the adjective was at the end of the sentence.
సౌమ్య
ఆమె 'scary' అన్నారు. అంటే భయం కలిగించేవి, భయానకమైనవి అని అర్థం. దెయ్యాల సినిమాలంటే భయం అంటున్నారు. Scary, Scared…ఇవన్నీ విశేషణాలు.
Sam
Yes, so let's quickly practise the pronunciation.
‘Horror movies are scary.’
సౌమ్య
Thanks, Sam. మీకేం భయాలున్నాయి? సాలెపురుగులంటే భయమేనా? అయితే దాన్ని ఇంగ్లిష్లో చెప్పండి చూద్దాం. రెండు విధాలుగా చెప్పొచ్చు. తరువాత కూడా చెప్తారు. విని మీ జవాబు సరిచూసుకోండి.
Sam
I'm scared of spiders.
I'm frightened of spiders.
సౌమ్య
Great! ఇప్పుడు మీకు పాములంటే నిజంగా భయం అని చెప్పాలి.
Sam
I'm absolutely terrified of snakes.
సౌమ్య
Good! మీకు కూడా దెయ్యాల సినిమాలంటే భయమే! అదెలా చెప్పాలో గుర్తుందా?
Sam
Horror movies are scary.
సౌమ్య
Do you agree, Sam?
Sam
Actually, yes! I'm not scared of anything else, but I think horror films are very scary!
సౌమ్య
And I'm terrified of lizards. సరే మరి, వచ్చేవారం మరో ‘How do I…’ లో మళ్లీ కలుసుకుందాం. Bye.
1. భయాల గురించి చెప్పడానికి సాధారణంగా వాడే పదాలేవి?
ఈ కింది విశేషణాలు వాడొచ్చు.
- scared
- frightened
'Afraid' అన్నా కూడా భయమనే అర్థం. ఈ పదాల తీవ్రత పెంచడానికి వాటి ముందు 'really', 'very' పెట్టొచ్చు.
- I'm very scared.
- I'm really frightened.
చాలా చాలా భయపడ్డాం అని చెప్పడానికి 'terrified' అని వాడొచ్చు. నిజంగా బాగా భయమేసింది అని చెప్పడానికి 'absolutely' అని వాడొచ్చు.
- I'm absolutely terrified.
2. ఈ విశేషణాలను వాక్యాల్లో ఎలా వాడాలి?
They follow the sentence structure:
Subject + verb 'to be' + adjective
ఉదాహరణకు:
- I'm scared.
- She's frightened.
- We're terrified.
When you want to talk about what you are scared of, you need to use:
Subject + verb 'to be' + adjective + of + noun
- I'm scared of spiders.
- She's frightened of heights.
- We're terrified of snakes.
3. 'Scared' కి 'scary' కి మధ్య తేడా ఏంటి?
భయమనే మన ఫీలింగ్స్ గురించి చెప్పడానికి 'scared' అని వాడొచ్చు. ఫలానా అంశం భయం గొపిలేది అని చెప్పడానికి 'scary' అని వాడాలి.
- I'm scared of horror film.
- Horror films are scary.
Notice that with 'scared', the subject of the sentence is a person, and with 'scary' the subject of the sentence is the thing that causes our fear.
How do I talk about things that I'm scared of?
3 Questions
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
ድጋፍ
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
ፍንጭ
కుక్కలంటే భయం అని చెప్పాలి.Question 1 of 3
ድጋፍ
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
ፍንጭ
Subject, క్రియ కూడా రావాలి.Question 2 of 3
ድጋፍ
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
ፍንጭ
పాముల గురించి చెప్తున్నాం. మన ఫీలింగ్స్ గురించి కాదు.Question 3 of 3
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
What are you scared of? Come and tell us on our Facebook group.
మీ భయాలేంటి? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
spiders
సాలెపురుగులుsnakes
పాములుhorror movies
దెయ్యల సినిమాలుheights
ఎత్తైన ప్రదేశాలుreally
చాలాabsolutely
బొత్తిగా/నిజంగా