Session 19

Listen to find out how to talk about your interests in English.
అభిరుచులు, ఆసక్తుల గురించి ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 19 ነጥብ።

0 / 5

  • 0 / 5
    Activity 1

Activity 1

How do I talk about my interests?

మీ అభిరుచులేంటి?
ఈ కింది వాక్యాన్ని పూరించండి.

I'm interested in ________.

ఇంకా ఎన్ని రకాలుగా మన అభిరుచులు, ఆసక్తుల గురించి చెప్పొచ్చో విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

సౌమ్య 
హాయ్!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.

Sam 
Hello, everybody! 

సౌమ్య 
ఇవాళ మనం మన అభిరుచులు, ఆసక్తులు, ఇష్టాయిష్టాల గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఎవరైనా మనల్ని ‘What are your interests?” అని అడిగారనుకోండి. జవాబు ఎలా చెప్పాలి? ఇవాళ నేర్చుకుందాం. ఈ ప్రశ్నకి ముగ్గురు వ్యక్తులు ఎలా జవాబిచ్చారో చూద్దాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారు పడకండి. నేను మీకు సహాయం చేస్తాను. 

I'm interested in all types of art, but I like photography the most.

I'm very keen on sports! I really like anything with a ball.

I’m really into comics. Superhero comics are my favourite. 

సౌమ్య 
So, did they have anything in common? 

Sam 
No, they all had completely different interests!

సౌమ్య 
Right. మొదటి వ్యక్తికి కళలు అంటే మక్కువ. ముఖ్యంగా ఫొటోగ్రఫీ అంటే ఎక్కువ ఇష్టంట! రెండవ వ్యక్తికి స్పోర్ట్స్ - క్రీడలంటే ఆసక్తి. బాల్‌తో ఆడే ఏ ఆటైనా తనకి ఇష్టం అంటున్నారు. మూడవ వ్యక్తికి కామిక్స్ అంటే ఇష్టంట! ముఖ్యంగా సూపర్ హీరో కామిక్స్ అంటే చాలా ఇష్టం అన్నారు. 

Sam
But how do we know that these are the things they like? 

సౌమ్య
మంచి ప్రశ్న. వాళ్ల ఇష్టాలను తెలుపడానికి వివిధ పదబంధాలను వాడారు. సాధారణంగా ఎక్కువమంది వాడే పదం ‘like’. మొదటి ఇద్దరు వ్యక్తులూ ఈ పదాన్ని ఎలా వాడారో మళ్లీ విందాం.

I like photography.

I really like anything with a ball.
 

Sam
Easy, right? They both used the verb 'like'! And you can change 'like', so you can say 'I really like' something to make it stronger, for example. Now let's listen to speaker one again. What does he say before 'all types of art'? 

I'm interested in all types of art. 

సౌమ్య
'I'm interested in' అని చెప్పాక, మనకి ఎందులో ఇష్టముందో ఆ నామవాచకం చెప్పాలి. 

Sam
Yes, 'interested' is an adjective, so we need to use the verb 'be' before it, and we use 'in' after it – always. Let's practise – repeat after me: 

‘I'm interested in art’.
‘You're interested in sports’.
‘He's interested in comics’. 

సౌమ్య
Thank you, Sam. రెండో వ్యక్తి స్పోర్ట్స్‌లో తనకున్న ఆసక్తి గురించి చెప్తూ ఒక మంచి పదం వాడారు. గుర్తుందా?

I'm very keen on sports! 

సౌమ్య
విన్నారా? Keen అన్నా ఆసక్తి అనే అర్థం. 'interested in', 'keen on'..ఏదైనా వాడొచ్చు. ఈ రెండూ కూడా విశేషణాలే! 

Sam
Quick practice! Repeat after me:

‘I'm keen on art’.
‘You're keen on sports’.
‘He's keen on comics’. 

Shall we listen to the final speaker?

సౌమ్య
Yes! మూడో వ్యక్తి 'comics' కు ముందు ఏ పదం వాడారు? 

I'm really into comics. 

సౌమ్య
ఇక్కడ ‘into something’ అంటే అందులో మునిగిపోవడం అనే అర్థంలో చెప్పుకోవచ్చు. దాని తీవ్రత పెంచడానికి really గానీ, very గానీ వాడొచ్చు But this expression is generally quite informal, isn't it, Sam? 

Sam
Yes, it's used more when speaking. Let's practise the pronunciation. Repeat after me: 

'I'm into art'.
You're really into sports'.
'He's very into comics'.

సౌమ్య
Nice. ఇప్పుడు పరీక్షా సమయం. మీ ఆసక్తులేంటి? 'interested' పదం వాడి వాక్యం చెప్పండి. తరువాత Sam కూడా చెప్తారు. విని మీరు సరిగ్గా చెప్పారో లేదో చూసుకోండి. 

Sam
I'm interested in languages. 

సౌమ్య
Great! అదే విషయాన్ని'keen' వాడి చెప్పండి?   

Sam
I'm keen on languages. 

సౌమ్య
Well done! మళ్లీ 'into' వాడి చెప్పండి. 

Sam
I'm into languages. 

సౌమ్య
Excellent! And if 'you're into learning English with us', join us next week for another episode of 'How do I…' Bye! 

Sam
Yes, please. I'm very keen on that! Bye, everyone! 

Learn more

1. క్రియాపదాలు వాడి నా ఆసక్తుల గురించి ఎలా చెప్పాలి?

'Like' వాడి చెప్పొచ్చు. Like తరువాత నామవాచకం గానీ gerund (ending in ‘–ing’) గానీ రావాలి.

  • I like photography.
  • She likes swimming.

మన ఇష్టాన్ని బలంగా చెప్పాలంటే 'like' కు ముందు 'really' వాడొచ్చు. కానీ 'very' వాడకూడదు.

  • I really like photography.
  • She really likes swimming.

2. విశేషణాలు వాడి నా ఆసక్తుల గురించి ఎలా చెప్పాలి?

రెండు కామన్ adjective + preposition కాంబినేషన్లు ఉన్నాయి.

subject + be + interested in + noun/ gerund (the interest)

  • I'm interested in art.
  • She's interested in swimming.

subject + be + keen on + noun/ gerund (the interest)

  • I'm keen on art.
  • She's keen on swimming.

బలంగా చెప్పడానికి విశేషణాలకు ముందు 'really' గానీ, 'very' గానీ వాడొచ్చు.

  • I'm very interested in art.
  • I'm really keen on art.

3. ఈ వాక్యాలు చెప్పడంలో formal/informal పద్ధతులున్నాయా?

పైన చెప్పినవన్నీ తటస్థమైనవే. ఏ సందర్భంలోనైనా వాడొచ్చు. అయితే 'be into' అని వాడడం ఎక్కువ వ్యవహారికం(informal) అవుతుంది.

subject + be into + noun/ gerund (the interest)

  • I'm into art.
  • She's into swimming.

బలంగా చెప్పడానికి 'into' కు ముందు 'really' గానీ, 'very' గానీ వాడొచ్చు.

  • I'm very into art.
  • She's really into swimming.

How do I talk about my interests?

5 Questions

Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

Come to our Facebook group to tell us what you’re interested in!
మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మీ అభిరుచులు, ఆసక్తులేమిటో తెలుపండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • interests
    అభిరుచులు/ఆసక్తులు

    all types of art
    అన్ని రకాల కళలు

    photography
    ఫొటోగ్రఫీ